• తాజా వార్తలు

గైడ్ - ఎక్కడున్నా సరే యాప్స్ ద్వారా మీ  పీసీని ష‌ట్‌డౌన్ చేయ‌డానికి గైడ్ 

ఇప్పుడు ప్ర‌తి ప‌నికి యాప్‌లు వాడుతున్నాం. ఏం చేయాల‌న్నా యాప్‌ల‌ను డౌన్‌లోడ్ చేస్తున్నాం. అయితే మీరు మీ ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్‌ను ముట్టుకోకుండానే యాప్‌ల సాయంతో  ష‌ట్‌డౌన్ చేయ‌డం ఎలాగో తెలుసా?.. యాప్‌ల సాయంతో డౌన్‌లోడ్ ఎలా చేస్తార‌ని అనుకుంటున్నారా? ఇలా చేయ‌డానికి కూడా కొన్న యాప్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. మ‌రి ఆ యాప్‌లు ఏంటో చూద్దామా?

యూనిపైడ్ రిమోట్‌
ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్‌ని  ష‌ట్ డౌన్ చేయ‌డానికి బెస్ట్ యాప్ యూనిఫైడ్ రిమోట్‌.  ఈ యాప్‌ను ఉప‌యోగించి కేవ‌లం ష‌ట్‌డౌన్ చేయ‌డం మాత్ర‌మే కాదు వాల్యుమ్ పెంచ‌డం, టాస్క్ మేనేజ‌ర్ యాక్సెస్ చేయ‌డం, మౌస్‌, కీబోర్డ్ ఆప‌రేట్ చేయ‌డం లాంటి ప‌నుల‌ను నేరుగా ఫోన్ నుంచే చేసేయ‌చ్చు.  ఈ ప‌నుల‌న్ని పీసీని ట‌చ్ చేయ‌కుండానే ఫోన్ ద్వారా చేయ‌చ్చు.  దీనికోసం ముందుగా యూనిఫైడ్ రిమోట్ యాప్‌ను మీ ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ పీసీలో డెస్క్‌టాప్ స‌ర్వ‌ర్‌ను డౌన్‌లోడ్ చేయాలి. వైఫై నెట్‌వ‌ర్క్ ద్వారా లేదా బ్లూటూత్ ద్వారా పీసీని మొబైల్‌తో క‌నెక్ట్ చేయాలి.  ఆండ్రాయిడ్ స‌ర్వ‌ర్ సెక్ష‌న్‌లోకి వెళ్లి స‌ర్వ‌ర్‌ను ట్యాప్ చేయాలి.  ఆ త‌ర్వాత మెయిన్ స్క్రీన్ మీద ప‌వ‌ర్ ఆప్ష‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాలి.  అప్పుడు  రీస్టార్ట్‌, ష‌ట్‌డౌన్ ఇలా అన్ని క‌నిపిస్తాయి. ష‌ట్‌డౌన్ మీద క్లిక్ చేస్తే చాలు  పీసీ ఆఫ్ అయిపోతుంది. 

మాక్స్ రిమోట్‌
మొబైల్ ద్వారా పీసీని ష‌ట్‌డౌన్ చేయ‌డానికి మ‌రో యాప్ మాక్స్ రిమోట్. ఇది మాత్ర‌మే కాదు దీంతో డ‌జ‌ను ఉప‌యోగాలు కూడా ఉన్నాయి. ఈ యాప్‌ను ముందుగా మీ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీ పీసీలో మాక్స్ కం ట్రోల్ స‌ర్వ‌ర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత వైఫై ద్వారా పీసీతో మొబైల్‌ను క‌నెక్ట్ చేయాలి.  స‌ర్వ‌ర్ మీద క్లిక్ చేస్తే ప‌వ‌ర్ ఐకాన్ క‌నిపిస్తుంది. దానిలో ష‌ట్‌డౌన్‌ను క్లిక్ చేస్తే మీ పీసీ ఆఫ్ అయిపోతుంది. 

ష‌ట్‌డౌన్ స్టార్ట్ రిమోట్‌
పీసీని మొబైల్ యాప్ ద్వారా ఆఫ్ చేయ‌డానికి అందుబాటులో ఉన్న మ‌రో యాప్ ష‌ట్‌డౌన్ స్టార్ట్ రిమోట్‌. మీ మొబైల్‌లో ష‌ట్‌డౌన్ స్టార్ రిమోట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత మీ పీసీలో స‌ర్వ‌ర్ లింక్ డౌన్‌లోడ్ చేయాలి. ఆ త‌ర్వాత  యాప్‌లో స‌ర్వ‌ర్‌ని క్లిక్ చేసి ముందుకెళ్లాలి.  ఆ  త‌ర్వాత ష‌ట్‌డౌన్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దానిపై ట్యాప్  చేస్తే పీసీ ఆగిపోతుంది.

జన రంజకమైన వార్తలు