• తాజా వార్తలు
  •  

మీకు కావాల్సిన అంద‌మైన ఫొటోల‌ను ఉచితంగా అందించే ఫొటో సైట్లు ఇవే!

మనం సైట్ న‌డుపుతుంటే క‌చ్చితంగా ఫొటోలు కావాలి. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది క‌దా అని మ‌నం ఆ ఫొటోలు తీసి కొన్ని అప్‌లోడ్ చేస్తుంటాం. సెల్ఫీలు కూడా తీస్తుంటాం. కానీ ఈ సెల్ఫీలు, మ‌నం తీసిన ఫొటోలు మంచి రిజ‌ల్యూష‌న్‌తో ఉండ‌వు. పైగా బ్ల‌ర్ అయి ఉంటాయి. ఇలాంటి ఫొటోల‌ను మ‌నం సైట్ల‌లో వాడ‌లేం. చాలా లో క్వాలిటీతో ఉన్న ఈ ఫోల వ‌ల్ల సైట్ పేరు కూడా చెడిపోతుంది. అందుకే మ‌నకు మంచి క్వాలిటీ ఉన్న ఫొటోలు కావాలి. గూగుల్ వెతికితే అన్ని కాపీ రైటెడ్ ఫొటోలే. పైగా చిన్న సైజు ఫొటోలు. ఇలాంటి ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డేయ‌డానికి మ‌న‌కు కొన్ని సైట్లు ఉన్నాయి. మ‌న‌కు కావాల్సిన అంద‌మైన ఫొటోల‌ను అందించే అలాంటి సైట్ల‌లో ఇవి కొన్ని...

అన్ స్ల్పాష్‌
మ‌న ఫొటోల‌ను మ‌రింత అందంగా తీర్చిదిద్దే సైట్ల‌లో అన్ స్ల్పాష్ ముందంజ‌లో ఉంటుంది. దాదాపు 2 ల‌క్ష‌ల ఫొటో అల్బ‌మ్స్ దీనిలో ఉన్నాయి. మ‌న‌కు న‌చ్చిన విధంగా ఈ మ‌న ఫొటోల‌ను త‌యారు చేసి పెట్ట‌డం దీని ప్ర‌త్యేక‌త‌. మీకు కేట‌గిరి వైజ్ కూడా బ్రౌజ్ చేసి పెడుతుంది. ల్యాండ్ స్కేప్‌, పొట్రాయిట్ ఇలా ఏదైనా మీకు న‌చ్చిన‌ట్లు ఫొటోల‌ను అమ‌ర్చుకోవ‌చ్చు. మంచి క్వాలిటీతో ఫొటోల‌ను మ‌నం చూసుకోవ‌చ్చు. 

కార్బూమ్ పిక్స్
ఇది వైడ్ రేంజ్ ఆఫ్ సెర్చ‌బుల్ ఇమేజ్‌ల‌ను మ‌న‌కు అందిస్తుంది. కేట‌గిరి వైజ్‌గా బ్రౌజ్ చేసి మ‌నం తీసుకోవ‌చ్చు. దీనిలో ఉన్న ఒక అద్భుత‌మైన ఫీచ‌ర్ ఫోక‌స్ ఆన్ క‌ల‌ర్‌. మీ ప్రాజెక్ట్‌కు త‌గ్గ‌ట్టుగా క‌ల‌ర్‌ను, మీ ఆల్బ‌మ్‌కు త‌గ్గ‌ట్టుగా ఫోక‌స్‌ను అందించ‌డంలో ఇది ముందుంటుంది. ప్ర‌తి ఫొటోకు క‌ల‌ర్ పెలెట్ ఉంటుంది. మీకు న‌చ్చిన డిజైన్‌ను ఎంచుకోవ‌చ్చు. 

మెర్గూఫైల్ 
ఫొటోల‌ను బ్యూటిఫుల్‌గా అందించ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.  3 ల‌క్ష‌ల 50 వేల ఫొటో ఆల్బ‌మ్స్ మీకు అందుబాటులో ఉంటాయి ఈ సైట్‌లో.  ఈ ఫొటోల‌ను మ‌రి ఉచితంగా ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే మీరు ఈ సైట్‌ను క్లిక్ చేసేట‌ప్పుడు వేరే పెయిడ్ సైట్ల‌కు కూడా అది మ‌ళ్లే అవ‌కాశాలు ఉంటాయి కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండాలి. క‌మ‌ర్ష‌ల్ యూజ్ కోసం కూడా బాగా ప‌నికొస్తుంది. 

పిక్స్ బే
ఈ సైట్‌లో మిలియ‌న్ ఇమేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ వెబ్‌సైట్లో ఈ పిక్స్‌ను ఉచితంగా వాడుకోవ‌చ్చు. వాటిలో మ‌నం కొన్ని ఎంచుకుని వాడుకోవ‌చ్చు. మ‌నకు అనుకూల‌మైన ఇమేజ్‌లు ఎన్నో ఎన్నెన్నో అందుబాటులో ఉన్నాయి. మ‌న‌కు కావాల్సింద‌ల్లా ఓపికే. జాగ్ర‌త్త‌గా వెతికితే అద్భుత‌మైన ఫొటోల‌ను మ‌నం తీసుకోవ‌చ్చు. 

స్టాక్ నాప్‌
ఇది కూడా మిగిలిన సైట్ల‌లాగే మంచి ఫొటోల‌ను అందిస్తుంది.  వంద‌లాది ఫొటోలు ఈ సైట్లో ప్ర‌తి వారం అప్‌డేట్  అవుతూ ఉంటాయి. కానీ  అవ‌న్ని మ‌నం కోస‌మే. అన్ని కాపీ రైట్ లేకుండా మ‌నం పొందొచ్చు. అయితే ఒకేసారి ఐదు ఫొటోల‌ను మాత్ర‌మే మ‌నం తీసుకోగ‌లం. మంచి ఫొటోలు, నాణ్య‌మైన ఫొటోలు మాత్ర‌మే ఈ సైట్లో అప్‌లోడ్ చేస్తారు.
 

జన రంజకమైన వార్తలు