• తాజా వార్తలు

హెడ్‌ఫోన్ల‌తో వ‌చ్చే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి వన్ & ఓన్లీ గైడ్‌

సెల్‌ఫోన్ చేతిలో ఉంటే  హెడ్‌ఫోన్ కూడా ఉండాల్సిందే. ముఖ్యంగా యూత్‌కు హెడ్‌ఫోన్లు ఒక ఆభ‌ర‌ణ‌మే. అవి లేకుండా ఎటూ వెళ్ల‌రూ. చివ‌రికి ప్ర‌యాణాల్లో సైతం హెడ్‌ఫోన్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటాయి. ఈ హెడ్‌ఫోన్లు ఎంత బ్రాండ్‌వి అయినా ప‌ని చేసినంత కాలం బాగానే ఉంటాయి. కానీ ఒక్క‌సారి స‌మ‌స్య వ‌స్తే చాలా ఇబ్బంది పెడ‌తాయి. మ‌రి హెడ్‌ఫోన్ జాక్‌ల‌లో వ‌చ్చే సాధార‌ణ స‌మ‌స్య‌లు ఏమిటి? ఆ స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించుకోవ‌డం ఎలా?

హెడ్‌ఫోన్ జాక్ దుమ్ము దుల‌పండి
సాధార‌ణంగా హెడ్‌ఫోన్లు ఎందుకు పాడ‌వుతూ ఉంటాయంటే దుమ్మ ధూళి చేర‌డం వ‌ల్లే.  ఆ దుమ్ము దులిపితేనే మ‌ళ్లీ అవి స‌క్ర‌మంగా ప‌ని చేస్తాయి. మొబైల్‌కు హెడ్‌ఫోన్ జాక్‌కు క‌నెక్ట్ కాకుండా ఆపేవి డ‌స్ట్ పార్టిక‌ల్స్‌. మొబైల్ ఫోన్‌ను మ‌న జేబులో పెట్ట‌డం వ‌ల్ల కూడా ఈ ఇబ్బంది త‌లెత్తే అవ‌కాశం ఉంది. ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే..

1. హెడ్‌ఫోన్ జాక్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు టార్చ్ లేదా హైలైట్ ద్వారా చెక్ చేస్తూ ఉండాలి

2. ఏదైనా దుమ్ము ఉంద‌ని మీకు అనిపిస్తే మీ నోటితో కంప్రెస్డ్ ఎయిర్ దానిలోకి పోయిలా చేయాలి

3. జాక్ దుమ్ముతో నిండి ఉంటే కాట‌న్ క్లీన‌ర్‌తో క్లీన్ చేయాలి

4. ఈ కాట‌న్ క్లీన‌ర్‌ను ఆల్క‌హాల్‌లో ముంచి తుడ‌వ‌డం వ‌ల్ల ఎంతో ప్ర‌యోజ‌నం ఉంటుంది.

వేరే హెడ్‌ఫోన్లు ప్ర‌య‌త్నించండి
మీ హెడ్‌ఫోన్లు ప‌ని చేయ‌క‌పోతే మీరు వేరే హెడ్ ఫోన్ ట్రై చేయ‌డం బెట‌ర్‌. ఎందుకంటే ఒక్కోసారి హెడ్‌ఫోన్ డివైజ్ పిన్‌లోనే ప్రాబ్ల‌మ్ ఉంటుంది. ఇలాంటి సంద‌ర్భాల్లో వేరే హెడ్‌ఫోన్‌తో జాక్‌ను క‌నెక్ట్ చేసి ప్ర‌య‌త్నించాలి. ఒక‌వేళ జాక్‌లో ప్రాబ్ల‌మ్ ఉండి హెడ్‌ఫోన్లు బాగా ప‌ని చేస్తుంటే వీడియోస్‌, మ్యూజిక్, మూవీ, కాల్స్ కోసం దీన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇంకా ప్రాబ్ల‌మ్ ఇస్తుంటే  మాత్రం క‌చ్చితంగా ఈ హెడ్‌ఫోన్లు మార్చాల్సిందే.

మీ డివైజ్ రిస్టార్ట్ చేయాలి
హెడ్‌ఫోన్లు జాక్‌తో వ‌చ్చే ప్లాబ్ల‌మ్స్ వ‌ల్లే కాదు మొబైల్స్ వ‌ల్ల కూడా ఒక్కోసారి హెడ్‌ఫోన్లు ప‌ని చేయ‌వు. ఇలాంటి సంద‌ర్భంలో మీ డివైజ్‌ను రీస్టార్ట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. 

1. మీ ఫోన్ ప‌వ‌ర్ బ‌ట‌న్‌ను హోల్డ్ చేసి ఐదు సెక‌న్లు ప‌ట్టుకోవాలి

2. స్క్రీన్ మీద మీకో రీస్టార్ట్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది

3. దాన్ని క్లిక్ చేయాలి. కొన్ని సెక‌న్ల త‌ర్వాత మీ మొబైల్ ఆన్ అవుతుంది

4. ఇప్పుడు మీరు ఫోన్‌కు హెడ్‌ఫోన్ల‌కు క‌నెక్ట్ చేసి మ్యూజిక్ హాయిగా వినొచ్చు.

జన రంజకమైన వార్తలు