• తాజా వార్తలు
  •  

మీ ఫోన్లో ఫొటోలు ఆటోమెటిక్‌గా బ్యాక్ అప్ కావ‌డానికి అన్ని మార్గాలు ఒకే గైడ్ లో

స్మార్ట్‌ఫోన్‌ను మ‌నం కాల్స్, ఇంట‌ర్నెట్‌కు మాత్ర‌మే కాదు ఫొటోలు తీసుకోవ‌డానికి బాగా యూజ్ చేస్తాం. వీలైన‌న్ని ఎక్కువ ఫొటోలు మ‌న డివైజ్‌లో స్టోర్ చేస్తాం. అయితే ఒక్కోసారి ఈ ఫొటోలు డిలీట్ అయ్యే ప్ర‌మాదం కూడా ఉంది. మ‌రి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కాబ‌ట్టే ఎప్ప‌టిక‌ప్పుడు ఫొటోలు సేవ్ చేసుకోవాలి. కానీ చాలా సందర్భాల్లో మ‌నం ఫొటోల‌ను సేవ్ చేసుకోవ‌డ‌మో లేక స్టోర్ చేసుకోవ‌డ‌మో మ‌రిచిపోతాం. అయితే మ‌న ప్ర‌మేయం లేకుండా ఫొటోల‌న్నీ ఆటోమెటిక్‌గా బ్యాక్ అప్ కావ‌డానికి కొన్ని మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం..

గూగుల్ ఫొటోలు, డ్రైవ్‌
ఫొటోల‌ను సేవ్ చేయ‌డానికి అన్నిటికంటే మించిన మార్గం గూగుల్ ఫొటోస్‌. ఇది ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ రెండింట్లో ల‌భ్యం అవువుతుంది. దీనిలో ఉన్న ఉప‌యోగం ఏమిటంటే అన్‌లిమిటెడ్ ఫొటో స్టోరేజ్‌. మీ ఫొటోల‌ను బ్యాక్ అప్ చేసుకోవాలంటే గూగుల్ ఫొటోస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని మీ గూగుల్ ఐడీతో సైన్ ఇన్ అయితే స‌రిపోతుంది.  ఐవోఎస్‌లో అయితే ఫొటోలు క్లౌడ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు సేవ్ అయిపోతాయి. ఈ ఫొటోల‌న్నిటిని మీరు ఫొటోస్‌.గూగుల్‌.కామ్‌లో చూడొచ్చు. మీరు గూగుల్ డ్రైవ్ యూజ‌ర్ అయితే ఫొటోల‌న్నీ అందులో చూడొచ్చు. 

డ్రాప్‌బాక్స్‌
ఫొటోల‌ను స్టోర్ చేయ‌డానికి డ్రాప్‌బాక్స్ కూడా మంచి ఆప్ష‌న్. ఈ ఫొటో బ్యాక‌ప్ ఫీచ‌ర్‌ను చాలామంది ఉప‌యోగిస్తున్నారు. అయితే గూగుల్ ఫొటోస్ మాదిరిగా ఎక్కువ ఫీచ‌ర్లు లేక‌పోయినా ఇది వినియోగ‌దారుల‌కు బాగా చేరువైంది. డ్రాప్‌బాక్సులో లిమిటెడ్ సైజు ఉంటుంది. హెవీ యూజ‌ర్ల కోసం భారీ స్పేస్ ఉండే డ్రాప్ బాక్స్ కూడా అందుబాటులో ఉంది. సెట్టింగ్స్ మెనూలో మీరు డ్రాప్‌బాక్స్ యాప్‌ను చూడొచ్చు. ఈ ఫీచ‌ర్‌ను కెమెరా అప్‌లోడ్స్ అనే పేరుతో పిలుస్తారు.

అమేజాన్ ప్రైమ్ ఫొటోలు
మీరు అమేజాన్ ప్రైమ్ మెంబ‌ర్ అయితే మీరు అన్‌లిమిటెడ్ ఫొటోల కోసం, అప్‌లోడ్స్ కోసం అమేజాన్ ప్రైమ్ ఫొటోస్ ఆప్ష‌న్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. అమేజాన్‌లో చాలామందికి తెలియ‌ని ఆప్ష‌న్ ఇదే. అయితే అమేజాన్ ప్రైమ్ మెంబ‌ర్లు మాత్ర‌మే ఆ ఆప్ష‌న్ వాడుకునే అవ‌కాశం ఉండ‌డం ఒక్క‌టే డ్రా బ్యాక్‌. ఏడాదికి 11.99 డాల‌ర్లు పెట్టి ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకుంటే మీరు 100 జీబీ స్టోరేజ్ ల‌భిస్తుంది. 

జన రంజకమైన వార్తలు