• తాజా వార్తలు

ఆండ్రాయిడ్ ఫోన్‌ను స్పీడ్ అప్ చేసే ఏడు టాప్ క్లీనింగ్ యాప్‌లు ఇవే..

ఆండ్రాయిడ్ ఫోన్‌... ఎంత ఉప‌యోగ‌మో.. అంత న‌ష్టం కూడా ఉంది దీనితో! ఎంతో ఖ‌ర్చు పెట్టి కొన్నా ఒక్కోసారి హ్యాంగ్ అయిపోవ‌డం, స్లో అయిపోవ‌డం, ఆక‌స్మాత్తుగా ఆగిపోవ‌డం లాంటి ఇబ్బందులు త‌లెత్తుతాయి.  ఈ పరిణామాలు అంత‌టికి కార‌ణం ఫోన్లో జంక్ ఫైల్స్ ఎక్కువ అయిపోవ‌డం, బూస్టింగ్ లేక‌పోవ‌డం వ‌ల్లే. మ‌రి మీ ఫోన్ తిరిగి ప‌రుగులెత్తాలంటే ఏం చేయాలి? ఆండ్రాయిడ్ ఫోన్‌లో జంక్‌ను తీసేసి, ఫెర్మార్‌మెన్స్‌ను బూస్ట్ అప్ చేయాలంటే ఏం చేయాలి?   దీనికి కోసం కొన్ని ఉత్త‌మ‌మైన యాప్‌లు ఉన్నాయి అవేంటో చూద్దాం. 

క్లీన్ మాస్ట‌ర్‌
గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఉత్త‌మ‌మైన జంక్ క్లీన్ యాప్స్‌లో క్లీన్ మాస్ట‌ర్ ముందంజ‌లో ఉంటుంది. 500 మిలియ‌న్ డౌన్‌లోడ్స్ ఉన్న ఈ యాప్..  మోస్ట్ ఫ్రిఫ‌ర్‌బుల్ ఆప్టిమైజేష‌న్ యాప్‌గా పేరు పొందింది. ఇది కేవ‌లం జంక్ క్లీన్ చేయ‌డ‌మే కాదు.. వైర‌స్‌ను వెతికి ప‌ట్టుకోవ‌డానికి స్కాన్ కూడా చేస్తుంది. ఇటీవ‌లే ఆ యాప్ ప్రైవేటు పొటోస్ అనే ఫీచ‌ర్ ప్ర‌వేశ‌పెట్టింది. దీని సాయంతో మ‌న ఫొటోల‌ను హైడ్ చేసుకోవ‌చ్చు. 

క్యాచె క్లీన‌ర్‌, డీయూ స్పీడ్ బూస్ట‌ర్‌
క్యాచె క్లీన‌ర్ కూడా దూసుకుపోతోంది.  ఇప్ప‌టికే ప్లే స్టోర్ నుంచి 230 మిలియ‌న్ల మంది యూజ‌ర్లు దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ జంక్ ఫైల్స్‌ను క్లీన్ చేయ‌డ‌మే కాక‌, మెమ‌రీ బూస్ట్ చేస్తుంది. నెట్‌వ‌ర్క్‌, ఫోన్ స్పీడ్ పెంచుతుంది. సీపీయూ కూల‌ర్‌గా కూడా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. 

సీసీ క్లీన‌ర్‌
పిరీఫామ్ త‌యారు చేసిన సీసీ క్లీన‌ర్ కూడా ఫోన్లో ఫైల్స్‌ను క్లీన్ చేయ‌డానికి మంచి ఆప్ష‌న్‌.  పీసీ, మ్యాక్ క్లీన్‌, ఫోన్ డివైజ్ క్లీనింగ్ యాప్‌గా దీనికి మంచి పేరు వ‌చ్చింది. ఇప్ప‌టికే 50 మిలియ‌న్ల డౌన్‌లోడ్స్ ఉన్నాయి ఈ యాప్‌కి.  జంక్ రిమూవ్ చేయ‌డం, స్పేస్ ఫ్రీ చేయ‌డం, సిస్ట‌మ్ మోనిట‌ర్ చేయ‌డం, బ్రౌజింగ్ సేఫ్టీ లాంటి ప‌నులు చేస్తుందిది. 

ప‌వ‌ర్ క్లీన్‌
ప్లే స్టోర్‌లో 100 మిలియ‌న్ డౌన్‌లోడ్స్ ఉన్న ఈ క్లీనింగ్ యాప్ వినియోగ‌దారుల‌కు బాగా ఉప‌యోగ‌ప‌డే యాప్‌గా పేరుంది. 2 మిలియ‌న్ల మందికి పైగా యూజ‌ర్ రేటింగ్స్ ఉన్నాయి ఈ యాప్‌కు. ఇది లైట్ వెర్ష‌న్ కావ‌డంతో ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకున్నా ఎక్కువ మెమ‌రీ ఖ‌ర్చు కాదు. ఫోన్‌ను ఆప్టిమైజ్ చేసి, జంక్‌ను క్లీన్ చేసి, డివైజ్ వేగాన్ని పెంచుతుంది ఈ యాప్‌.

360 సెక్యూరిటీ లైట్‌
మీకు ఇష్ట‌మైన యాప్స్‌ను డౌన్‌లోడ్ చేయ‌కుండా ఫోన్ స్పీడ్ పెంచాలంటే 360 లైట్ సెక్యూరిటీ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. 1 జీబీ మెమ‌రీ క‌న్నా త‌క్కువ మెమ‌రీ ఉన్న ఫోన్ల కోసం ప్ర‌త్యేకంగా డివైజ్ చేశారు ఈ ఫోన్‌ను. వైర‌స్‌ల నుంచి ఫోన్‌ను కాపాడ‌డానికి, జంక్ క్లీన్ చేయ‌డానికి ఈ యాప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. 

గో స్పీడ్‌
ఇది కూడా లైట్ వెయిట్ యాపే. త‌క్కువ స్పేస్ కంజ్యూమ్ చేస్తూ ఎక్కువ ప‌ని చేయ‌డంలో ఇది ముందుంటుంది. జంక్ ఫైల్స్ క్లీన్ చేయ‌డం,  అడ్వాన్స‌డ్ ప్రాసెస‌ర్ మోనిట‌రింగ్ టెక్నిక్ ద్వారా జంక్ ఫైల్స్‌ను క్లీన్ చేయ‌డం, వైర‌స్‌ల‌ను స్కాన్ చేయ‌డం, బ్యాక్ గ్రౌండ్ యాప్‌ల‌ను ఆప్టిమైజ్ చేయ‌డం లాంటి ప‌నులు చేస్తుంది. 

ఆల్ ఇన్ వ‌న్ టూల్ బాక్స్
ఆల్ ఇన్ వ‌న్ టూల్ బాక్స్ ప్ర‌త్యేక‌త ఏంటంటే దీనిలో అన్ని ర‌కాల క్లీనింగ్ ఆప్ష‌న్లు ఉంటాయ‌. జంక్ క్లీన్ చేయ‌డానికి, ఫైల్స్‌ను ఆప్టిమైజ్ చేయ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇప్ప‌టికే ప్లే స్టోర్ నుంచి 10 మిలియ‌న్ల మంది యూజ‌ర్లు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఫోన్ల‌తో పాటు  ట్యాబ్లెట్ల కోసం కూడా ఇదో మంచి ప్ర‌త్యామ్నాయం.          

జన రంజకమైన వార్తలు