• తాజా వార్తలు
  •  

ఆండ్రాయిడ్ ఫోన్ పోతే ఆండ్రాయిడ్ డివైజ్‌ మేనేజర్ తో క‌నిపెట్టేయ‌డానికి గైడ్‌

ఫోన్ పోయిందంటే మ‌న‌కు ఒక‌టే కంగారు. ఎందుకంటే కీల‌క‌మైన స‌మాచారాన్నంతా ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్ల‌లోనే భ‌ద్ర‌పరుస్తున్నాం. ఆర్థిక లావాదేవీల‌న్నీ స్మార్ట్‌ఫోన్‌తోనే చేసేస్తున్నాం. అందుకే ఫోన్ పోతే మ‌న‌కు చాలా ఇబ్బందే. నంబ‌ర్ల‌తో పాటు విలువైన స‌మాచారం బ‌య‌ట‌కు వెళ్లిపోతుందనే ఆందోళ‌న క‌చ్చితంగా ఉంటుంది. అయితే ఆండ్రాయిడ్ ఫోన్ పోయినా.. ఆండ్రాయిడ్ మేనేజ‌ర్ సాయంతో సుల‌భంగా క‌నిపెట్టేయ‌చ్చు మ‌రి పోగొట్టుకున్న ఆండ్రాయిడ్ ఫోన్‌ను క‌నిపెట్టడానికి గైడ్ ఇదే.

మొబైల్ లొకేష‌న్‌ను క‌నిపెట్టేయ‌చ్చు...
మ‌నం మొబైల్ పోగొట్టుకున్నా పెద్ద‌గా కంగారు ప‌డ‌కూడ‌దు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాల‌జీ పెరిగిన త‌ర్వాత‌.. ఇంట‌ర్నెట్ వాడ‌కం ఇంత విస్తృతం అయిన త‌ర్వాత మ‌న దగ్గ‌ర ఎవ‌రైనా మొబైల్ కొట్టేసినా.. లేదా మ‌నం పొర‌పాటున పోగొట్టుకున్నా.. దాన్ని క‌నిపెట్ట‌డం పెద్ద క‌ష్టం కావ‌ట్లేదు. కేవ‌లం లొకేష‌న్ ఆధారంగా మ‌నం మొబైల్ ఎక్క‌డుందో తెలుసుకోవ‌చ్చు. దీనికి డివైజ్ మేనేజ‌ర్ బాగా హెల్ప్ చేస్తుంది. మ‌రి డివైజ్ మేనేజర్ ద్వారా మ‌న  ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎలా క‌నిపెట్టాలో చూద్దామా...

సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోండిలా..
1. ఆండ్రాయిడ్ డివైజ్ మేనేజ‌ర్‌లోకి వెళ్లాలి. మీ జీమెయిల్ లేదా మీరు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లో వాడుతున్న నంబ‌ర్ ద్వారా కూడా లాగిన్ కావొచ్చు

2. అప్పుడు మీకో పోప‌ప్ మెనూ ఓపెన్ అవుతుంది. దానిపై యాక్సెప్ట్ అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి

3. అంతే.. మీ మొబైల్ ఫోన్ ఏ ప్ర‌దేశంలో ఉందో సెక‌న్ల‌లో గూగుల్ మ్యాప్ ద్వారా మ‌నం క‌నిపెట్టేయచ్చు.

4. రింగ్ బ‌ట‌న్ మీద క్లిక్ చేస్తే చాలు. ఆ మొబైల్ ఆటోమెటిక్‌గా  రింగ్ అవుతుంది. అప్పుడు ఆ ప్లేస్‌ను సుల‌భంగా ప‌ట్టేయ‌చ్చు.

5.  ఎరేజ్ డేటా ఆప్ష‌న్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా మీ మొబైల్‌లో ఉన్న మొత్తం డేటాను కూడా ఎరేజ్ చేసే అవ‌కాశం ఉంది.

గూగుల్ మ్యాప్స్ లొకేష‌న్ హిస్ట‌రీ ద్వారా..
మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న లొకేష‌న్ హిస్ట‌రీ ద్వారా కూడా మీ ఫోన్‌ను క‌నిపెట్టే అవ‌కాశాలున్నాయి. ఈ ఫీచ‌ర్ ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఏ స‌మ‌యంలో ఎక్క‌డ ఏ స్థ‌లంలో మీ మొబైల్ ఉందో కూడా మీరు తెలుసుకోవ‌చ్చు. 

థ‌ర్డ్ పార్టీ యాప్‌లతో కూడా..
థ‌ర్డ్ పార్టీ యాప్‌ల‌ను ఉప‌యోగించి సైతం మ‌న మొబైల్ ఆచూకీని క‌నిపెట్టొచ్చు. అయితే ఇది ఎంత‌వ‌ర‌కు సేఫ్ అనేది మాత్రం చెప్ప‌లేం. వేర్ మైడ్ర‌యిడ్‌, లాస్ట్  ఆండ్రాయిడ్ లాంటి యాప్‌లు ఇప్పుడు ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చాయి. వాటి సాయంతో మీ మొబైల్ ఫోన్ ఆచూకీని మీరు తెలుసుకునే అవ‌కాశం ఉంది.