• తాజా వార్తలు
  •  

మొబైల్ పాస్‌వర్డ్ ప్యాట్ర‌న్ మ‌ర్చిపోయారా? అయితే క్రాక్ చేయ‌డానికి వ‌న్ అండ్ ఓన్లీ గైడ్‌!

స్మార్ట్‌ఫోన్‌లో విలువైన స‌మాచారాన్ని దాచుకుంటాం. మ‌న‌కు సంబంధించిన వివ‌రాలేవీ అప‌రిచితుల‌కు తెలియ‌కూడ‌ద‌ని అనుకుంటాం. నిజానికి ఒక‌ప్పుడు ఇది సాధ్య‌మ‌య్యేది కాదు. కానీ పాస్‌వర్డ్‌, ప్యాట్ర‌న్‌లు వ‌చ్చాక సెల్‌ఫోన్లో మ‌న స‌మాచారం చాలా సుర‌క్షితం అయిపోయింది. అయితే చాలామంది పాస్‌వ‌ర్డ్‌లు పెట్టిన త‌ర్వాత మ‌రిచిపోతుంటారు. ఆ పాస్‌వ‌ర్డ్‌లు తెలియ‌క మ‌ళ్లీ మొబైల్ అన్‌లాక్ కాక చాలా ఇబ్బంది ప‌డ‌తారు. అయితే పాస్‌వ‌ర్డ్‌, ప్యాట్ర‌న్‌లు పెట్టి మ‌రిచిపోయినా ఛేదించొచ్చు. దీనికో గైడ్ ఉంది అదెంటో చూద్దాం..

ఏం చేయాలంటే..
1. మొద‌ట మీ ఆండ్రాయిడ్ మొబైల్‌కు సంబంధించిన యూఎస్‌బీ డ్రైవ‌ర్ల‌ను ఇన్‌స్టాల్ చేయాలి. ప్ర‌తి ఆండ్రాయిడ్ మొబైల్‌కు డ్రైవ‌ర్లు భిన్నంగా ఉంటాయి. గూగుల్‌లో సెర్చ్ చేయ‌డం ద్వారా వాటి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.

2. మీ డివైజ్‌లో ట్వ‌ర్ప్‌, సీడబ్ల్యూఎం, సీటీఆర్ లాంటి క‌స్ట‌మ్ రిక‌వ‌రీల‌ను మీ మొబైల్‌లో ఫ్లాష్ చేయాలి. మీ డివైజ్‌లో ఫ్లాష్ చేయ‌క‌పోతే.. క‌స్ట‌మ్ రిక‌వ‌రీ ఎలా ఫ్లాష్ చేయాలో గూగుల్ ట్యుటోరియ‌ల్స్ ద్వారా తెలుసుకునే అవ‌కాశం ఉంది. 

3. ఆ త‌ర్వాత  మీ ఫోన్‌ను ప‌వ‌ర్ కీ, వాల్యుమ్ కీ ఒకేసారి ప్రెస్ చేయ‌డం ద్వారా రీబూట్ చేయాలి. 

4. ఆ త‌ర్వాత గూగుల్‌లో ఏడీబీ ఫాస్ట్ బూట్ డ్రైవ‌ర్ల‌ను డౌన్‌లోడ్ చేయాలి. దాన్ని ఒక ఫోల్డ‌ర్‌లో సేవ్ చేసుకోవాలి

5. మీ ఫోన్ రీబూట్ అయి క‌స్ట‌మ్ రిక‌వ‌రీలోకి వెళ్లిన త‌ర్వాత మౌంట్ అండ్ స్టోరేజ్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి

6. ఆ త‌ర్వాత మౌంట్ లేదా డౌట్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి. అది మీ డివైజ్‌లోని డేటాను మౌంట్ చేస్తుంది.

7. ఆ త‌ర్వాత ఫోల్డ‌ర్‌ను డౌన్‌లోడ్ చేయాలి

8. ఆ త‌ర్వాత కుడి షిప్ట్ కీ ప్రెస్ చేయాలి. ఆ త‌ర్వాత ఎక్క‌డైఆ రైట్ క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత ఓపెన్ క‌మాండ్ ఫ్ర‌మ్ హియ‌ర్ అని క‌నిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి.

9. మీ డివైజ్‌ను పీసీకి క‌నెక్ట్ చేసి ఈ కమాండ్‌ను ఎంట‌ర్ చేయాలి.

10. ఇందులో మీకు చాలా ఎటాచ్డ్ డివైజ్‌లు క‌నిపిస్తాయి. ఒక‌వేళ మీ డివైజ్‌ను చూపించ‌క‌పోతే.. స‌రైన డ్రైవ‌ర్ల‌ను ఇన్‌స్టాల్ చేయాలి. అంతేకాదు భిన్న‌మైన యూఎస్‌బీ పోర్ట్‌ల‌తో ట్రై చేయాలి. అప్ప‌టికీ క‌నిపించ‌క‌పోతే భిన్న‌మైన యూఎస్‌బీ కేబుల్‌ను ప్ర‌య‌త్నించాలి.

11. ఆ త‌ర్వాత కోడ్‌ను ఫాస్ట్ బూట్ షెల్‌లో ఒక దాని త‌ర్వాత ఒక‌టి ఎంట‌ర్ చేయాలి

12. ఆ త‌ర్వాత‌ మీ ఫోన్‌ను రీబూట్ చేయాలి. రిక‌వ‌రీ మోడ్ ద్వారా మీరు ఒక రీబూట్ ఆప్ష‌న్ చూడొచ్చు.

13. మీరు అక్క‌డ ప్యాట్ర‌న్ లాక్ చూడొచ్చు. దాన్ని అన్‌లాక్ చేసుకోవ‌చ్చు. లేక‌పోతే ర్యాండ‌మ్ ప్యాట్ర‌న్‌ల ద్వారా కూడా డివైజ్‌ను అన్‌లాక్ చేసుకునే అవ‌కాశం ఉంది. అంతే మీ డేటా పోగొట్టుకోకుండా మీ డివైజ్‌ను అన్‌లాక్ చేసుకోవ‌చ్చు.
 

జన రంజకమైన వార్తలు