• తాజా వార్తలు

ట్రూకాల‌ర్ లో ఉన్న సూప‌ర్‌ ఫీచ‌ర్లు తెలియ‌జెప్పే గైడ్

తెలియ‌ని వ్య‌క్తులు ఫోన్ చేస్తే గుర్తించ‌డానికి వాడే కాల‌ర్ ఐడీ యాప్ ట్రూ కాల‌ర్‌.  ఎంత‌గా పాపుల‌ర‌యిందంటే స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్స్‌లో అత్య‌ధికంగా వాడే కాల‌ర్ ఐడీ యాప్ ఇదే. అయితే ట్రూ కాల‌ర్‌తో కాల‌ర్ ఐడెంటిఫికేష‌న్ మాత్ర‌మే కాదు. ఇంకా చాలా ప‌నులు చేయొచ్చు. ట్రూ కాల‌ర్‌తో ఉన్న ఆ ఉప‌యోగాలేంటో చూడండి. 
1. ఒక్క‌దానిలో మూడు యాప్స్  
ట్రూ కాల‌ర్ యాప్ ఇన్‌స్టాల్ చేయ‌గానే డ‌య‌ల‌ర్‌, మెసేజ్‌లు, కాంటాక్ట్‌లకు సంబంధించి మూడు షార్ట్‌క‌ట్‌లు మీ హోం స్క్రీన్‌కు యాడ్ అవుతాయి. అయితే ఈ మూడు కూడా ట్రూ ఆక‌ల‌ర్ యాప్‌లో భాగ‌మే.  అయితే మూడు షార్ట్ క‌ట్స్ ఉండ‌డం వ‌ల్ల ఈ ఫీచ‌ర్ల‌ను వాడుకోవ‌డం ఈజీగా ఉంటుంది. అంతేకాదు యాప్‌లోనే ఒక‌దాని నుంచి మ‌రొక‌దానికి ఈజీగా జంప్ కావ‌చ్చు.  ట్రూ కాల‌ర్ యాప్ ఓపెన్ చేయ‌గానే బాట‌మ్‌లో ఫోన్ ఐకాన్ క‌నిపిస్తుంది. అంటే మీరు ఫోన్ సెక్ష‌న్‌లో ఉన్నారు. మెసేజ్ బ‌బుల్‌ను క్లిక్ చేస్తే మెసేజ్‌లోకి వెళ‌తారు. కాంటాక్ట్స్ ఐకాన్‌ను క్లిక్ చేస్తే కాంటాక్ట్స్‌లోకి వెళ్లొచ్చు.  
2. ఎస్ఎంఎస్ ఫిల్ట‌రింగ్‌
ఇండియాలో ఎస్ఎంఎస్ స్పామ్ స‌ర్వీస్ ఘోరంగా ఉంటుంది. మీ ఫోన్ నెంబ‌ర్‌తో సైన్ అయి ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసినా, ఏదైనా వెబ్‌సైట్‌లోకి వెళ్లినా ఇక మీకు స్పామ్ వ‌ర‌ద‌లా వ‌చ్చి ప‌డుతుంది. ఇలాంటివి ఫిల్ట‌ర్ చేయ‌డానికి ట్రూ కాల‌ర్ ఎస్ఎంఎస్ స్పామ్ ఫిల్ట‌రింగ్ తీసుకొచ్చింది.  ఈ ఫీచ‌ర్‌ను మీరు ట‌ర్న్ ఆన్ చేసుకుంటే మెసేజ్ సెక్ష‌న్‌లో టాప్ లో ఇన్‌బాక్స్‌, స్పామ్  అనే రెండు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. వ‌చ్చిన మెసేజ్ క్లియ‌ర్‌గా స్పామ్ అని తెలుస్తుంటే దాన్ని టిక్ చేయండి. మ‌రోసారి ఆ మెసేజ్ రాకుండా ట్రూ కాల‌ర్ అడ్డుకుంటుంది. అదే టైంలో ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ వంటి సంస్థ‌ల నుంచి వ‌చ్చే డెలివ‌రీ అప్‌డేట్ మెసేజ్‌ల‌ను త‌ప్పుగా ఐడెంటిఫై చేసి స్పామ్‌లోకి నెట్టేసే ప్ర‌మాద‌ముంది. అందుకే ఆ మెసేజ్ క‌న్వ‌ర్సేష‌న్ కింద ఉన్న నాట్ స్పామ్ బ‌ట‌న్‌ను టాప్ చేయండి.  
3. ఫోన్ యూఐ క‌స్ట‌మైజ్ 
 ట్రూ కాల‌ర్‌ను డ‌య‌ల‌ర్‌గా వాడుతుంటే మీరు కొన్ని యాక్ష‌న్స్‌ను క‌స్ట‌మైజ్ చేసుకోగ‌లుగుతారు.  కాంటాక్ట్స్ లిస్ట్‌లోకి వెళ్లి నెంబ‌ర్‌ను రైట్‌కు స్వైప్ చేసి మెసేజ్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్‌కి స్వైప్ చేస్తే డైరెక్ట్‌గా కాల్ వెళుతుంది.   మిస్‌డ‌య‌ల్స్‌ను కంట్రోల్ చేయ‌డానికి కూడా ఓ ఆప్ష‌న్ ఉంది. ట్రూ కాల‌ర్‌లో Settings > General > call historyలో్కి వెళ్లి View Profile సెట్ చేయండి. దీంతో మీరు ప్రొఫైల్ చూస్తారు కాబ‌ట్టి మిస్ డ‌య‌ల్‌కి అవ‌కాశం ఉండ‌దు. 
4.  కెమెరాతో నెంబ‌ర్ స్కానింగ్ 
సైడ్ బార్‌ను ఓపెన్ చేస్తే (స్క్రీన్ మీద లెఫ్ట్‌కు స్వైప్ చేస్తే) టాప్‌లో  ఓ చిన్న  ప్రివ్యూ క‌నిపిస్తుంది.  దానిమీద టాప్ చేస్తే కెమెరా యాక్సెస్ అవుతుంది. దీన్ని ఇప్పుడు ఏదైనా ఫోన్ నెంబ‌ర్ రాసిన పేప‌ర్ లేదా  స్క్రీన్ మీద ఫోక‌స్ చేస్తే ట్రూ కాల‌ర్ ఆ నెంబ‌ర్‌ను త‌న డేటాబేస్‌లో ఉందేమో చెక్ చేస్తుంది. ఆ డిటెయిల్స‌న్నీ మీకు చూపిస్తుంది. అక్క‌డి నుంచే మీరు డైరెక్ట్‌గా ఆ నెంబ‌ర్‌కు కాల్ చేసే ఆప్ష‌న్ కూడా ఉంది.  
5. థీమ్ మార్చుకోవ‌చ్చు 
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు  OLED డిస్‌ప్లే ఉంటే ట్రూ కాల‌ర్‌ను డార్క్ థీమ్‌లోకి మార్చుకోవ‌చ్చు.  Settingsలోకి వెళ్లి  select Appearance క్లిక్ చేస్తే ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవ‌చ్చు.  
6. ట్వీక్ సెట్టింగ్స్ 
Settingsలో  General sectionకి వెళ్లి  Flash messaging feature ని టాగిల్ చేయ‌వ‌చ్చు. మీ ఎవాయిల‌బులిటీని డిసేబుల్ చేయొచ్చు. కిందికి వెళ్లి  Remind me of missed calls featureని కూడా డిసేబుల్ చేస్తే నోటిఫికేష‌న్ల బాధ త‌ప్పుతుంది.  

7. ట్రూకాల‌ర్‌తో మ‌నీ సెండ్ చేయొచ్చు 
ట్రూ కాల‌ర్ తో యూపీఐని యూజ్ చేసి మ‌రో ట్రూ కాల‌ర్ యూజ‌ర్‌కు మ‌నీ డైరెక్ట్‌గా సెండ్ చేయొచ్చు. అంతేకాదు వీడియో కాలింగ్ యాప్ గూగుల్ డుయోను కూడా ఇంటిగ్రేట్ చేసుకోవ‌చ్చు.  

నెల‌కు 30 రూపాయ‌లు ఖ‌ర్చు పెట్ట‌గ‌లిగితే ట్రూ కాల‌ర్ ప్రీమియం వెర్ష‌న్ తీసుకోవ‌చ్చు. దీనిలో మ‌రిన్ని ప్రీమియం ఫీచ‌ర్లు అందుబాటులో ఉన్నాయి. 

జన రంజకమైన వార్తలు