• తాజా వార్తలు
  •  

అస‌లైన బ్రాడ్‌బ్యాండ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌ను గుర్తించ‌డానికి అల్టిమేట్ గైడ్‌

ఒక‌ప్పుడు ఆఫీస్‌ల‌కి, ఆర్గ‌నైజేష‌న్ల‌లో మాత్ర‌మే బ్రాడ్‌బ్యాండ్ వాడేవారు.  ఇప్పుడు టెక్నాల‌జీ అవ‌స‌రాలు పెర‌గ‌డంతో ఇళ్ల‌లోనూ  బ్రాడ్‌బ్యాండ్ వినియోగం బాగా పెరిగింది. చ‌దువుకునే పిల్ల‌లున్న ఇళ్ల‌లోనూ, వ‌ర్క్ ఫ్రం హోం చేసేవాళ్ల‌కు బ్రాడ్‌బ్యాండ్ త‌ప్ప‌నిస‌రి అవ‌స‌రంగా మారింది.  బ్రాడ్‌బ్యాండ్ అవ‌స‌రాల‌తోపాటే వాటిని అందించే స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరిగారు. రిల‌య‌న్స్‌, ఎయిర్‌టెల్ లాంటి పెద్ద కంపెనీల నుంచి లోక‌ల్‌గా ఐదారు వంద‌ల క‌నెక్ష‌న్ల‌తో న‌డిచే స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల వ‌ర‌కూ బోల్డ‌న్ని స‌ర్వీసులు అందుబాటులోకి వ‌చ్చేశాయి. అయితే మీకు స్పీడ్‌, క‌చ్చిత‌మైన డేటా, ఎఫ్‌యూపీ లిమిట్ ఇవ‌న్నీ స‌మ‌కూరాలంటే స‌రైన సర్వీస్ ప్రొవైడ‌ర్ ఉండాలి.అలాంటి ప్రొవైడ‌ర్‌ను గుర్తించ‌డానికి ఈ టిప్స్ చ‌ద‌వండి
కాప‌రా? ఫైబ‌రా?
ఇండియాలో బ్రాడ్‌బ్యాండ్ లైన్లు కాప‌ర్‌తో త‌యారుచేసిన‌వే ఎక్కువ‌గా అందుబాటులో ఉన్నాయి. లాండ్‌లైన్ల ఫోన్ల నాటి నుంచి కాప‌ర్ వినియోగ‌మే ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.అయితే ప్ర‌స్తుతం స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు చెబుతున్న‌ట్లుగా 40 ఎంబీపీఎస్‌, 60 ఎంబీపీఎస్‌, 100 ఎంబీపీఎస్ స్పీడ్‌ను అందుకోవ‌డం కాప‌ర్ కేబుల్‌తో క‌ష్ట‌మే.  ఫైబ‌ర్ ఆప్టిక్ కేబుల్ అయితే లేటెస్ట్ టెక్నాల‌జీకి అనుగుణంగా వ‌చ్చింది కాబ‌ట్టి ఎంత స్పీడ్ అయినా రీచ్ అవ‌గ‌లుగుతుంది.కాబ‌ట్టి మీ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్ వాడుతున్నాడా లేడా చెక్‌చేసుకోండి. అది ఉంటేనే క‌నెక్ష‌న్ తీసుకోండి.
యూసేజ్ లిమిట్స్ 
మ‌న ద‌గ్గ‌ర ఎక్కువ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు ఫెయిర్ యూసేజ్ పాల‌సీ (FUP) ఫాలో  అవుతున్నారు. అంటే డేటా యూసేజ్‌కి ఒక ప‌రిమితి ఉంటుంది. చాలా కంపెనీలు డౌన్‌లోడ్‌, అప్‌లోడ్ క‌లిపి డేటా లిమిట్‌గా ఫిక్స్‌చేస్తాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో డేటా త్వ‌ర‌గా అయిపోయి చికాకు తెప్పిస్తుంది. అందుకే మీ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ ఎంత డేటా ఇస్తారు?  డౌన్‌లోడ్ లిమిట్ ఎంత‌? అప్‌లోడ్ లిమిట్ ఎంత‌? అన్‌లిమిటెడ్ డేటా అంటే దేనికి ఎంత ఇస్తారో ప‌క్క‌గా తెలుసుకోండి.
కంటెంట్ రేషియో
ఒక లైన్‌లో ఉన్న బ్యాండ్ విడ్త్ మీద ఎన్ని బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్లు ఉన్నాయో దాన్నో కంటెంట్ రేషియో అంటారు. క‌నెక్ష‌న్ల సంఖ్య పెరిగే కొద్దీ నెట్ స్పీడ్ త‌గ్గిపోతుంది. ముఖ్యంగా పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, వెంచ‌ర్లున్న‌చోట ఈ ప‌రిస్థితి ఎక్కువ‌గా ఉంటుంది. కాబట్టి కంటెంట్ రేషియో (క‌నెక్ష‌న్ల సంఖ్య)ఎవ‌రికి ఎక్కువ‌గా ఉందో చూసి దాన్ని బ‌ట్టి నిర్ణ‌యం తీసుకోండి.
అప్‌లోడ్ స్పీడ్‌
చాలామంది బ్రాడ్‌బ్యాండ్ క‌నెక్ష‌న్ తీసుకునేట‌ప్పుడు డౌన్‌లోడ్ స్పీడ్‌చూస్తారే త‌ప్ప అప్‌లోడ్ స్పీడ్ గురించి ప‌ట్టించుకోరు. ఫైల్స్ షేరింగ్‌, యూట్యూబ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేయ‌డం, వీడియో కాలింగ్ వంటి పెరుగుతున్న ప‌రిస్థితుల్లో అప్‌లోడ్ స్పీడ్ కూడా కీల‌క‌మే.  కాబ‌ట్టి అప్‌లోడ్ స్పీడ్ బాగున్న స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌నే సెలెక్ట్ చేసుకోండి.
వాల్యూ యాడెడ్ స‌ర్వీసులు
ఇప్పుడు మ‌న‌కు చాలామంది ప్రొవైడ‌ర్లున్నారు.. కాంపిటీష‌న్‌లో ముందుండ‌డానికి అంద‌రూ ఆఫ‌ర్లు తెస్తున్నారు.అందులో బెస్ట్ ఏమిటో చూడండి.ఎక్కువ డేటా, డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్ మాత్ర‌మే కాదు.. మీకు ఈ నెల‌లో మిగిలిన బ్యాల‌న్స్ త‌ర్వాత నెల‌కు మీ అకౌంట్‌లో యాడ్‌చేయడం (డేటా క్యారీ ఓవ‌ర్‌) వంటి ఫెసిలిటీలు కూడా క‌ల్పిస్తున్నాయి. ఇలాంటి వాల్యూ యాడెడ్ స‌ర్వీసులు ఏవి ఎక్కువ‌గా ఇస్తున్నాయో చూసి ఎంచుకోండి.
మొబైల్ యాప్‌
బ్రాడ్‌బ్యాండ్‌లో మీ యూసేజ్ తెలుసుకోవ‌డం, బిల్స్ క‌ట్ట‌డం, కంప్ల‌యింట్ ఇవ్వ‌డం.. ఇలాంటి ప‌నుల కోసం కొన్ని స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు మొబైల్ యాప్స్‌ను కూడా తీసుకొస్తున్నాయి. యాక్ట్ ఫైబ‌ర్‌నెట్‌, ఎయిర్‌టెల్, యూ బ్రాడ్‌బ్యాండ్ లాంటివి ఇప్ప‌టికే మొబైల్ యాప్స్ తెచ్చాయి.
స‌ర్వీస్ 
బ్రాడ్‌బ్యాండ్ అంటే లైన్‌మీద న‌డిచేది కాబ‌ట్టి గాలీ, వాన‌కు కూడా స‌ర్వీస్ ఎఫెక్ట్ కావ‌చ్చు. కాబ‌ట్టి ప్రాబ్లం వ‌స్తే వెంట‌నే క్లియ‌ర్ చేయ‌గ‌లిగే స‌ర్వీస్ ఉందా లేదా చూసుకోండి.
ధ‌ర‌
అన్నింటికంటే ముఖ్య‌మైన‌ది ధ‌ర‌. మీరు పెట్టే మ‌నీకి వాల్యూ గ‌ల స‌ర్వీస్ ఇస్తున్నారా లేదా చూసుకోండి. పై ఫ్యాక్ట‌ర్ల‌న్నీచెక్‌చేసుకుని ప్రైస్ కూడా బేరీజు వేసుకుని స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌ను ఎంచుకోండి.

జన రంజకమైన వార్తలు