• తాజా వార్తలు
  •  

మీ పీసీని చల్ల‌ప‌ర‌డానికి అల్టిమేట్ గైడ్ ఇదే

మ‌న ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ వేడెక్కి పొగ‌లు వ‌చ్చేస్తుంటుంది చాలాసార్లు. దీనికి కార‌ణం మ‌న వాడ‌క‌మే. ఎన్నో ఆప‌రేషన్లు...ఎన్నో ఫైల్స్, ఎన్నో వీడియోలు.. వీట‌న్నిటి ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఇలా నిరంత‌రాయంగా ప‌ని చేయ‌డం వ‌ల్ల కంప్యూట‌ర్ వేడెక్కిపోతుంది. ఇలాగే ప‌ని చేస్తూ పోతే ఏదో ఒక‌రోజు ప‌ని చేయ‌డం ఆగిపోతుంది. అంటే హ్యాంగ్ అయిపోవ‌డ‌మో  లేక పూర్తిగా ఆగిపోవ‌డ‌మో జ‌రుగుతుంది. మ‌రి పీసీ ఇలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి. మ‌న పీసీని చ‌ల్ల‌గా ఉంచాలంటే ఏ చిట్కాలు పాటించాలి మ‌న పీసీని కూల్‌గా ఉంచ‌డానికి గైడ్ ఇదే.

ఓవ‌ర్ క్లాకింగ్, ఎగ్జిస్టింగ్ హార్డ్‌వేర్‌
మీ పీసీ గేమింగ్ పీసీ కాక‌పోతే మీ ప్రాసెస‌ర్‌, జీపీయూని ఓవ‌ర్ క్లాకింగ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. కానీ చాలా పీసీల్లో ఓవ‌ర్ క్లాకింగ్ స‌మ‌స్య ఉంటుంది. దీనిలో ఉండే యాడ్స్ వ‌ల్ల కూడా మ‌న పీసీ బాగా వేడెక్కిపోతుంది. అందుకే ఓవ‌ర్ క్లాకింగ్ ఆప్ష‌న్ తీసేయాలి. దీంతో పాటు పాత హార్డ్‌వేర్ ఎక్కువ‌కాలం ఉప‌యోగించ‌డం కూడా ఒక కార‌ణ‌మే. కూలింగ్ సిస్ట‌మ్ గురించి ఆలోచించ‌డం క‌న్నా పాత‌బ‌డిన హార్డ్‌వేర్‌ను మార్చుకోవ‌డం ఉత్త‌మం. కూలింగ్ సిస్ట‌మ్ మీద 200 డాల‌ర్ల నుంచి 300 డాల‌ర్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టే బ‌దులు.. హార్డ్‌వేర్‌కు 100 డాల‌ర్లు పెడితే స‌రిపోతుంది. 

కామ‌న్‌సెన్స్‌
సిస్ట‌మ్‌ను కూలింగ్‌గా ఉంచ‌డం కోసం బుర్ర‌లు బద్ద‌లు కొట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు. జ‌స్ట్ కామ‌న్‌సెన్స్ ఉప‌యోగిస్తే చాలు. అంటే మీరు అస‌లు పీసీ ఎక్క‌డ పెట్టారు. దానికి గాలి స‌రిగా అందుతుందా? ..వేడి గాలిని బ‌య‌ట‌కు వ‌దిలి చ‌ల్లి గాలిని స్వీక‌రించే వాతావ‌ర‌ణ ప‌రిస్తితి ఉందా అనేది ముందు ఆలోచించాలి. కూలింగ్ ఫాన్స్‌కు వెనుక చాలినంత స్థ‌లం ఉంచాలి. క్యాబినెట్‌ను విశాల‌మైన స్థ‌లం ఇవ్వాలి. వైర్లు బ్లాక్ అయ్యాయోమో చూసుకోవాలి.  సిస్ట‌మ్‌ను క‌ప్పి ఉంచే కొన్ని నాసిర‌కం క‌వ‌ర్ల వ‌ల్ల కూడా ఇబ్బందులు త‌లెత్తుతాయి.

కేబినేట్స్ క్లీనింగ్
పీసీలో చాలా కీల‌క‌మైన‌వి కేబినేట్సే. వీటిని వీలైనంత క్లీన్‌గా ఉంచుకోవాలి. డ‌స్ట్ వెళ్ల‌కుండా జాగ్ర‌త్త‌ప‌డాలి.  మీ క్యాబినేట్ ఓపెన్ చేస్తే విప‌రీత‌మైన డ‌స్ట్ ఉంటుంది. ముఖ్యంగా సీపీయూ, జీపీయూ, ర్యామ్‌ల‌ను ఇది క‌ప్పేస్తుంది. ఈ దుమ్మును క్లీన్ చేయ‌డం సుల‌భ‌మే. అయితే ఫ్యాన్‌లో చిక్కుకున్న దుమ్ముధూళి వ‌ల్లే అస‌లు ఇబ్బంది. దీని కోసం ప్ర‌తి కాంపోనెంట్‌ను జాగ్ర‌త్త‌గా తీసి కంప్రెస్డ్ ఎయిర్ ద్వారా డ‌స్ట్ క్లీన్ చేయాలి. 

ప‌వ‌ర్ స‌ప్ల‌య్‌
కేబినేట్‌ను వ‌దిలేస్తే మ‌నం బాగా గ‌మ‌నించాల్సింది ప‌వ‌ర్ స‌ప్ల‌య్‌ని. ఎందుకంటే పీసీకి ప్రాణం ఇదే. ప‌వ‌ర్ వ‌చ్చే ఇక్క‌డి నుంచే. ఎక్కువ‌మంది నాసిర‌కం ప‌వ‌ర్ కేబుల్స్ వాడ‌తారు. పాత‌వైనా వాటిన మార్చ‌రు. ఇక్క‌డే పీసీ దెబ్బ తింటుంది. ప‌వ‌ర్ స‌రిగా అంద‌క హీట్ ఎక్కిపోతుంది. ఇలాంటి సంద‌ర్భంలో ప‌వ‌ర్ స‌ప్ల‌యి స‌రిగా వ‌స్తుందో లేదా ఎప్ప‌టిక‌ప్పుడు చూసుకోవాలి. అవ‌స‌ర‌మైతే కేబుల్స్ మార్చుకోవాలి. 

జన రంజకమైన వార్తలు