• తాజా వార్తలు
  •  

కూపన్స్ వాడి షాపింగ్‌లో పొదుపు చేయ‌డానికి గైడ్‌

షాపింగ్‌కు వెళ్లామంటే మ‌న‌కు చాలా ఖ‌ర్చే. ఎంత త‌క్కువ ఖర్చు చేద్దామ‌న‌కున్నా కుద‌ర‌దు. బిల్ మీద బిల్లు ప‌డిపోతూనే ఉంటుంది. మ‌న జేబు గుల్ల అవుతూనే ఉంటుంది. అయితే షాపింగ్ వెళ్లినప్పుడు ఖ‌ర్చులో ఎంతో కొంత ఆదా అయితే!! ఈ మాటే ఆనందంగా అనిపిస్తుంది క‌దా! అయితే చాలా షాపింగ్ మాల్స్‌, కంపెనీలు త‌మ ప్రొడ‌క్టుల‌పై కూప‌న్లు ఇస్తూ ఉంటాయి. వీట‌ని జాగ్ర‌త్త‌గా ఉప‌యోగించుంటే చాలా వ‌ర‌కు బిల్లులో ఆదా అవుతుంది. మ‌రి డిస్కౌంట్ కూప‌న్ల‌ను వాడి బిల్లు ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసా?

కూప‌న్లు ఎక్క‌డినుంచి వ‌స్తాయంటే...
న్యూస్‌పేప‌ర్లు
: మ‌న‌కు షాపింగ్ కూప‌న్లు కావాలంటే మీ ఆదివారం న్యూస్ పేప‌ర్ స‌రైన మార్గం.  చాలా కంపెనీలు న్యూస్ పేప‌ర్ల ద్వారా యాడ్స్ ఇస్తాయి. వీటిలోనే కూప‌న్లు కూడా ఇచ్చేస్తాయి. వాటిని మ‌నం జాగ్ర‌త్త‌గా కట్ చేసుకుని ఆయా షాప్‌ల‌కు తీసుకెళ్లాలి.

మ్యాగ‌జైన్లు: మ‌్యాగ‌జైన్లు కూడా కూప‌న్ల‌కు వేదిక‌. ఉమెన్స్ డే, ఫ్యామిలీ స‌ర్కిల్‌, రెడ్ బుక్ లాంటి మ్యాగ‌జైన్ల‌లో మ‌నం ఎన్నో కూప‌న్ల‌ను చూడొచ్చు.  వీటిని క‌ట్ చేసుకుని ఆయా బ్రాండ్ స్టోర్స్‌కు వెళితే చాలు మ‌న‌కు వెంట‌నే డిస్కౌంట్ వ‌చ్చేస్తుంది. ఈ కూప‌న్ల‌కు టైమ్ లిమిట్ ఉంటుంది.

గ్రాస‌రీ, డ్ర‌గ్ స్టోర్ వెబ్‌సైట్లు:  కూప‌న్ల‌ను పొందేందుకు గ్రాస‌రీ, డ్ర‌గ్‌స్టోర్ వెబ్‌సైట్లు కూడా మంచి మార్గం. చాలా సైట్ల‌లో మ‌నం నేరుగా కూప‌న్ల‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఎప్పుడైనా వాడుకోవ‌చ్చు.  ఈ కూప‌న్ల‌ను రీడిమ్ చేసుకుని మ‌రోసారి సైట్ విజిట్ చేస్తే మ‌ళ్లీ కూప‌న్లు మీకు అందుబాటులో ఉంటాయి.

కూప‌న్స్‌.కామ్‌: ప‌్ర‌త్యేకించి కూప‌న్ల కోస‌మే ఉంది కూప‌న్స్‌.కామ్‌. దీనిలో వంద‌ల సంఖ్య‌లో ప్రింట్ చేసిన గ్రాస‌రీ కూప‌న్స్‌ను మీరు పొందొచ్చు. ఆయా స్టోర్ల‌కు వెళ్లి మీరు ఈ కూప‌న్లు ఇస్తే చాలు. డిస్కౌంట్ అప్లై అవుతుంది. 

ఇలా సేవ్ చేసుకోండి
మీరు ఎక్కువ ఆదా చేసుకోవాలంటే ఎంతో ఓపిగ్గా ఉండాలి. మంచి ఆఫ‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాలి. ప్ర‌తి వారం క‌చ్చితంగా ఒక మంచి డిస్కౌంట్ ఉంటుంద‌ని అనుకోవ‌డానికి లేదు. అందుకే ఆయా స్టోర్లు మంచి డిస్కౌంట్‌ను ప్ర‌క‌టించే వ‌ర‌కు వెయిట్ చేయాలి. ఈ స‌మ‌యాల్లో షాపింగ్ చేస్తేనే మ‌నం సిస‌లైన ఆదా పొంద‌గ‌లం.  చాలామంది కూప‌న్స్ చేతిలో ఉన్నా వాడ‌రు. దీన్ని స‌మ‌ర్థంగా వాడుకోవ‌డం కూడా ఒక క‌ళే. అందుకే మీ చేతిలో ఉన్న కూప‌న్ల‌ను, అందుబాటులో ఉండే కూప‌న్ల‌ను ఎట్టి ప‌రిస్థితిల్లో వ‌ద‌ల‌కుండా వాడుకోవాలి. మ‌రిచిపోవ‌డం లాంటివి చేస్తే ఆ కూప‌న్లు వృథా అయిపోతాయి. వీలైనంత వెరైటీగా స్టోర్ల‌ను ఎంచుకుని షాపింగ్ చేయాలి. దీని వ‌ల్ల మీకు ఎక్కువ డిస్కౌంట్లు పొందే అవ‌కాశం ఉంటుంది. ప‌దే ప‌దే ఒకే స్టోర్లో షాపింగ్ చేయ‌డం అన‌వ‌స‌రం. ఎందుకంటే కొత్త క‌స్ట‌మ‌ర్ల‌కు సాధార‌ణంగా స్టోర్లు డిస్కౌంట్లు ఇస్తాయి. వాళ్లు మ‌ళ్లీ వ‌స్తార‌నే ఉద్దేశంతో. దీన్ని మ‌నం ఉప‌యోగించుకోవాలి.