• తాజా వార్తలు

గైడ్-ఏమిటి శాంసంగ్ బిక్స్‌బె? ఉప‌యోగించేందుకు గైడ్‌

ప్ర‌పంచంలో ఎక్కువంది ఉప‌యోగించే స్మార్ట్‌ఫోన్ల‌లో శాంసంగ్ కూడా ముందంజ‌లోఉంటుంది.  మారుతున్న కాలానికి త‌గ్గ‌ట్టు, వినియోగ‌దారులకు ఉప‌యోగ‌ప‌డేలా ఫీచ‌ర్ల‌ను తెర మీద‌కు తీసుకు రావ‌డంలో ఈ కొరియా త‌యారీ సంస్థ‌ది అగ్ర‌స్థాన‌మే.  దీనిలో భాగంగానే ఆ సంస్థ ఇటీవ‌లే బిక్స్ బె అనే కొత్త ఫీచ‌ర్‌ను రంగంలోకి తీసుకొచ్చింది.  తాజాగా వ‌చ్చిన ఫీచ‌ర్ వినియోగ‌దారుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. మ‌రి ఏంటి బిక్స్ బె ప్ర‌త్యేక‌త‌?

వాయిస్ అసిస్టెంట్‌
యాపిల్ ఫోన్‌లో సిరి,  అమెజాన్‌లో అలెక్సా,  గూగుల్ అసిస్టెంట్ గురించి మ‌న‌కు తెలుసు.  వీటన్నిటి ప‌ని తీరు  ఒక‌టే. అదే వాయిస్ క‌మాండ్‌. మ‌న మాట‌ల‌ను బట్టి ప‌ని చేయ‌డం వీట‌న్నిటి ప్ర‌త్యేక‌త‌. శాంసంగ్ బిక్స్ బె కూడా ఇదే కోవ‌కు చెందుతుంది. కొత్త వ‌స్తున్న త‌న మోడ‌ల్స్‌లో శాంసంగ్ ఒక అద‌న‌పు బ‌ట‌న్‌ను త‌యారు చేస్తోంది అదే బిక్స్‌బె.  శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8, నోట్ 8 ఫోన్ల‌లో ఈ కొత్త ఫీచ‌ర్‌ను చూడొచ్చు.  ప్ర‌స్తుతానికి కాస్ట్‌లీ ఫోన్ల‌లో మాత్ర‌మే అందుబాటులో ఉన్న ఈ ఫీచ‌ర్ త్వ‌ర‌లో బ‌డ్జెట్ ఫోన్ల‌లోనూ ల‌భ్య‌మ‌య్యే అవ‌కాశాలున్నాయి. 

ట‌చ్ చేయ‌కుండానే...
బిక్స్ బె ప్ర‌త్యేక‌త ఏంటంటే కేవ‌లం మ‌న మాట‌ల్ని క‌మాండ్స్‌గా తీసుకుని  ప‌ని చేయ‌డం మాత్ర‌మే కాదు. ఫోన్లో ఉన్న యాప్‌లు, ఇత‌ర ఫోల్డ‌ర్ల‌ను కూడా నియంత్రించ‌డం. మ‌నం  ఏదైనా యాప్‌ను ఓపెన్ చేయాలంటే దాన్ని ట‌చ్  చేయ‌కుండానే నేరుగా  ఓపెన్ చేయ‌చ్చు. ఇదంతా జ‌స్ట్ వాయిస్ క‌మాండ్ ద్వారా జ‌రిగిపోతుంది. ఇదే కాక ఓపెన్ క్లాక్..సెట్ అలారం ఫ‌ర్ 8 పీఎం  అంటే చాలు అలారం ఆటోమెటిక్‌గా సెట్ అయిపోతుంది.  

15,000 వాయిస్ క‌మాండ్స్‌
బిక్స్‌బె ద్వారా ఏకంగా 15,000 వాయిస్ క‌మాండ్స్ ఇవ్వొచ్చ‌ట‌. ఇది ఆరంభ‌మేన‌ని త్వ‌ర‌లో మ‌రింత మెరుగ్గా ఈ ఫీచ‌ర్‌ను తీసుకొస్తామ‌ని చెబుతోంది శాంసంగ్‌.  ప్ర‌స్తుతానికి డ‌యిల‌ర్‌, వెద‌ర్‌, క్లాక్‌, ఈమెయిల్ లాంటి కీల‌క ఆప్ష‌న్ల‌న్నీ బిక్స్ బె వాయిస్ క‌మాండ్ ద్వారా ప‌ని  చేయించుకోవ‌చ్చు.  ఇదే కాదు రేడియో ఓపెన్ చేసి మ‌న‌కు ఇష్ట‌మైన స్టేష‌న్‌ను కూడా  వినొచ్చు. దీనికిముందుగా  బిక్స్ బెలో క‌మాండ్స్  సెట్ చేసుకోవాలి.  శాంసంగ్‌లో బిక్స్‌బెకు డిఫాల్ట్‌గా లాంచ‌ర్ ప్రొగ్రామ్ ఉంటుంది. దీని ద్వారా  కూడా యాప్‌ల‌ను  ఆప‌రేట్ చేయ‌చ్చు.                                                                                                        

జన రంజకమైన వార్తలు