• తాజా వార్తలు

గైడ్‌:  ఐఎంఈఐ  నంబ‌ర్‌కి ఏ టు జెడ్ గైడ్‌

ఆన్‌లైన్‌లో మీరు ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తుంటే క‌చ్చితంగా ఐఎంఈఐ నంబ‌ర్ అవ‌స‌రం ఉంటుంది. చాలామంది ఈఎంఈఐ నంబ‌ర్ అంటే ఏమిటో తెలియ‌దు. దాన్ని ఎందుకు ఎలా ఉపయోగిస్తారో ఇంకా తెలియ‌దు. కానీ ఐఎంఈఐ నంబ‌ర్ అంటే మీదే. మీకు  సంబంధించిందే. ఎందుకంటే మీరు       ఒక ఫోన్‌ను వాడుతున్నారు కాబ‌ట్టి. ఏళ్ల త‌ర‌బ‌డి ఆ డివైజ్ మీతోనే ఉంది కాబ‌ట్టి. అస‌లు ఏంటి ఈఎంఈఐ నంబ‌ర్‌? ....దాన్ని ఎందుకు ఉప‌యోగిస్తారు.. దీని వ‌ల్ల ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాలు ఏమైనా ఉన్నాయా? అస‌లు ఈ ఐఎంఈఐ నంబ‌ర్ ఎక్క‌డ ఉంటుంది అనే విష‌యాల‌కు ఏ టు జెడ్ గైడ్ ఇదే.

ఏమిటి ఐఎంఈఐ?
ద ఇంట‌ర్నేష‌న‌ల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ అంటే ఎవ‌రికీ అర్ధం కాదు. అదే ఐఎంఈఐ అంటే కాస్త‌యినా అర్ధం అవుతుంది. ఐఎంఈఐ అనేది ఒక మొబైల్ డివైజ్‌లో ఉండే యునిక్ న్యుమ‌రిక‌ల్ ఐడింటిఫ‌య‌ర్‌. ఇది ఒక మొబైల్‌ను మ‌రో మొబైల్‌కు ఉండే ప్ర‌త్యేక‌మైన గీత లాంటిది.  ఐఎంఈఐ నంబ‌ర్‌ను ట్రాక్ చేసి మ‌న  డేటాను కొట్టేసే ప్ర‌మాదాలు కూడా  ఉంటాయి. 2016లో ఐఫోన్ 7 మోడ‌ల్  విష‌యంలో ఇలాంటి ఇబ్బందులే త‌లెత్తాయి.  ఐఎంఈఐ నంబ‌ర్ 14 స్ట్రింగ్స్‌గా ఉంటుంది.  దీంతో పాటు 15వ డిజిట్ మొత్తం స్ట్రింగ్‌ను వెరిఫై చేస్తుంది.అందులో ఉండే 16వ డిజిట్లో మొత్తం ఇన్ఫ‌ర్మేష‌న్‌ను దాచి పెడుతుంది.  2004 నుంచి ఐఎంఈఐ నంబ‌ర్‌ను ఎఎ-బిబిబిబిబిబి-సీసీసీసీసీసీసీ-డీ ఫార్మాట్‌లో వ‌స్తోంది. ఇందులో ఎ, బీ అంటే టైప్ అలాకేష‌న్ కోడ్స్‌.  ఆరు సీ లు ఇందులో ఉండే యునిక్ సిరీయ‌ల్ నంబ‌ర్‌ను రిప్ర‌జెంట్ చేస్తుంది. 

ఐఎంఈఐ ఎలా తెలుసుకోవాలి?
మీ ఫోన్‌కు సంబంధించిన ఐఎంఈఐ నంబ‌ర్‌ను తెలుసుకోవడం ఎలా?  ఐఎంఈఐ నంబ‌ర్‌ను తెలుసుకోవ‌డం చాలా సుల‌భం మీ ఫోన్ డ‌య‌ల్ ప్యాడ్‌లో స్టార్ టైప్ చేసి  ఆ త‌ర్వాత యాష్ కొట్టి.. జీరో సిక్స్ టైప్ చేసి యాష్ కొట్టాలి.  అప్పుడు మీ డివైజ్ స్క్రీన్ మీద ఐఎంఈఐ నంబ‌ర్ ప్ర‌త్యేక్షం అవుతుంది.  మీరు రెండు  సిమ్‌లు వాడుతుంటే రెండు ఐఎంఈఐ నంబ‌ర్లు క‌నిపిస్తాయి.

ఉప‌యోగం ఏంటీ?
 ఐఎంఈఐ నంబ‌ర్‌ను ప్ర‌ధానంగా ఉప‌యోగించేది ప్ర‌తి డివైజ్‌కు ఐడింటిటీ క‌ల్పించ‌డం కోస‌మే.  అంటే మ‌నం వెహిక‌ల్స్ వాడుతుంటాం. ప్ర‌తి వెహిక‌ల్‌కు ఒక్కో నంబ‌ర్ ఉంటుంది. దాన్ని బ‌ట్టే మ‌నం ఆ వెహిక‌ల్‌ను గుర్తిస్తాం. అలాగే ఐఎంఈఐ నంబ‌ర్ కూడా అంతే.  ఇది సిమ్ నంబ‌ర్ వేరు ఐఎంఈఐ నంబ‌ర్ వేరు.సిమ్ నంబ‌ర్లు మారతాయోమో కానీ ఐఎంఈఐ నంబ‌ర్లు మాత్రం ఛేంజ్ కావు. మీ ఫోన్ పోయిన‌ప్పుడో లేదా  మీ ఫోన్‌ను ఎవ‌రైనా కొట్టేసిన‌ప్పుడు మీ ద‌గ్గ‌ర ఐఎంఈఐ నంబ‌ర్ ఉంటే చాలు. దాని ఆధారంగా పోలీసులు ఫోన్‌ను ట్రేస్ చేసే ఛాన్స్ ఉంటుంది.

జన రంజకమైన వార్తలు