• తాజా వార్తలు
  •  

ఏమిటీ API.. వన్ & ఓన్లీ గైడ్ మీకోసం

ఇటీవ‌ల కాలంలో మ‌నం ఏపీఐ అనే ప‌దాన్ని  వింటున్నాం.  ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌, వెబ్ బ్రౌజ‌ర్‌, యాప్ అప్‌డేట్స్ త‌రుచూ ప్ర‌క‌టిస్తూ ఉంటాయి డెవ‌ల‌ప‌ర్స్ కోసం ఒక కొత్త ఏపీఐ అందుబాటులో ఉంద‌ని. కానీ ఏపీఐ అంటే ఏమిటి? ..దీనికి అప్లికేష‌న్స్‌కు ఏంటి సంబంధం. దీనికి బ్రౌజ‌ర్‌కు ఉన్న రిలేష‌న్ ఏమిటి?.. దీనికి ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? 

అప్లికేష‌న్ ప్రొగ్రామింగ్ ఇంట‌ర్‌ఫేస్‌
ఏపీఐ పూర్తి పేరు అప్లికేష‌న్ ప్రొగ్రామింగ్ ఇంట‌ర్‌ఫేస్. అంటే హోట‌ల్లో మెనూ లాంటిది ఈ ఏపీఐ. అంటే మెనూలో మ‌న‌కు కావాల్సిన ఎన్నో ర‌కాల డిష్‌లు ఉంటాయి. వాటిలో మ‌న‌కు న‌చ్చిన వాటిని మనం ఎంచుకుంటాం. అలాగే ఏపీఐ కూడా డెవ‌ల‌ప‌ర్స్‌కు అవ‌స‌ర‌మైన ఎన్నో ఆప‌రేష‌న్స్‌ను చేసి పెడుతుంది. ఒక జాబితాను వాళ్ల ముందంచి అన్ని ప‌నులు చ‌క‌చ‌కా చేసేస్తుంది. ఒక ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌లో మీకు సేవ్ యాజ్ డైలాగ్ బాక్స్ కావాలంటే మీరు అప్లికేష‌న్ ప్రొగ్రామింగ్ ఇంట‌ర్‌ఫేస్ ద్వారా త‌యారు చేసుకోవ‌చ్చు. అంటే ఏపీఐ అంటే మ‌న‌కు మ‌నం చేసుకునే వంట లాంటిది. ఇది వంట సామ‌గ్రిని అంత‌టిని అందిస్తుంది. త‌మ‌కు కావాల్సిన ఫ‌లితాల కోసం డెవ‌ల‌ప‌ర్స్ ఏపీఐ ద్వారా డేటాను ఇవ్వొచ్చు.

డెవ‌ల‌ప‌ర్స్ ప‌ని సుల‌భం
ఐ ఫోన్ కోసం ఒక యాప్ డెవ‌ల‌ప్ చేయాలంటే యాపిల్ ఐవోఎస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ పెద్ద సంఖ్యలో ఏపీఐల‌ను అందిస్తుంది. దీని వ‌ల్ల డెవ‌ల‌ప‌ర్ ప‌ని చాలా సుల‌భం అయిపోతుంది. వెబ్ బ్రౌజ‌ర్‌ను ఎంబెడ్ చేయాల‌నుకుంటే మీ సొంత బ్రౌజ‌ర్ ద్వారా ప్రొగ్రామ్ చేయాల్సిన అవ‌సరం లేదు. ఒక అప్లికేష‌న్ ఉప‌యోగిస్తే స‌రిపోతుంది. మీరు డ‌బ్ల్యూవెబ్‌వ్యూ అనే ఏపీఐని బ్రౌజ‌ర్‌ను అజెక్ట్ అప్లికేష‌న్ కోసం ఉప‌యోగించొచ్చు. ఐఫోన్ కెమెరా నుంచి ఫొటోలు, వీడియోలు కాప్చ‌ర్ చేయాలంటే మీ కెమెరా ఇంట‌ర్‌ఫేస్‌తో చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇవ‌న్నీ ఏపీఐతో చేయ‌డం చాలా సుల‌భం. లేక‌పోతే డెవ‌ల‌ప‌ర్స్ ప్ర‌తి దానికి ఒక సాఫ్ట్‌వేర్‌ను త‌యారు చేసుకోవాల్సి వ‌చ్చేది. ప్ర‌తి ప‌నికి ఒక అప్లికేష‌న్‌ను రూపొందించాల్సి వ‌చ్చేది. 

క‌మ్యునికేష‌న్ కోసం కూడా..
అప్లికేష‌న్లు, బ్రౌజ‌ర్ల కోసం మాత్రమే కాదు క‌మ్యునికేష‌న్ కోసం కూడా ఏపీఐ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక వెబ్‌సైట్లో మీరు గూగుల్ మ్యాప్ ఆబ్జెక్ట్ ఎంబడెడ్‌గా ఉంటే.. ఆ వెబ్‌సైట్  గూగుల్ మ్యాప్స్ ఏపీఐ టు ఎంబ‌డెడ్‌గా ఉప‌యోగిస్తున్న‌ట్లు అర్ధం. డెవ‌ల‌ప‌ర్సో కోస‌మే గూగుల్ ఏపీఐని వెలుగులోకి తీసుకొచ్చింది. ఏపీఐ ఉండ‌డం వ‌ల్ల థ‌ర్డ్‌పార్టీ వెబ్‌సైట్ల‌లో గూగుల్ మ్యాప్‌ల కూడా గూగుల్ నియంత్రించ‌గ‌లుగుతుంది. చాలా ఆన్‌లైన్  స‌ర్వీసుల‌కు కూడా ఏపీఐ ఉప‌యోగ‌ప‌డుతుంది. 

జన రంజకమైన వార్తలు