• తాజా వార్తలు
  •  

గైడ్‌: మన ఫోన్లో ఎరోప్లేన్ మోడ్ గురించి వన్ & ఓన్లీ గైడ్‌

ఆండ్రాయిడ్‌లో ఉన్న ఎయిరోప్లేన్ మోడ్ గురించి అంద‌రికి తెలిసిందే. అయితే ఏ ఆప్ష‌న్‌ను మాత్రం అంద‌రూ ఉప‌యోగించ‌రు. ఎందుకంటే విమానాల్లో వెళ్లే వాళ్లు మాత్ర‌మే ఈ ఆప్ష‌న్ ఉప‌యోగిస్తార‌ని అంద‌రూ అనుకుంటారు. అందుకే ఆ జోలికే వెళ్ల‌రు. కానీ అస‌లు విష‌యం ఏమిటంటే ఎయిరోప్లేన్ మోడ్‌ను కేవ‌లం విమానాల్లో మాత్ర‌మే కాదు బ‌య‌ట కూడా ఉప‌యోగించొచ్చు అన్న విష‌యం తెలిసింది కొంత‌మందికే. మ‌రి ఎయిరో ప్లేన్ మోడ్‌ను ఎందులో ఎలా ఉప‌యోగించాలో తెలుసుకుందామా!

రేడియో ఫ్రీక్వెన్సీ ట‌ర్న్ ఆఫ్ చేయ‌డం
ఎయిరో ప్లేయిన్ మోడ్ సాయంతో మ‌నం చాలా ప‌నులు చేయ‌చ్చు. అందులో ప్ర‌ధాన‌మైంది మీ సెల్యుల‌ర్‌ను ట‌ర్న్ఆఫ్ చేయ‌డం. రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్న‌ల్స్‌ను ఆపేయ‌డం. అంటే మీ స్మార్ట్‌ఫోన్‌కు ట్రాన్స్‌మిట్ అయ్యే రేడియో త‌రంగాల‌ను ఆపేయ‌చ్చు. దీని వ‌ల్ల ఫోన్ ప‌ని చేయ‌కుండా ఆపే అవ‌కాశం ఉంటుంది.  దీంతో మీ ఫోన్ మొబైల్ డేటా సిగ్న‌ల్‌, వైఫై, బ్లూటూత్ సిగ్న‌ల్ కూడా ట‌ర్న్ ఆఫ్ అయిపోతాయి. మీ ఎయిరోప్లేన్ మోడ్ ఆఫ్ చేసేంత‌వ‌ర‌కు స‌మీపంలో ఉన్న ఏ సెల్‌ఫోన్ ట‌వ‌ర్స్‌, శాటిలైట్స్ త‌రంగాలు మీ ఫోన్‌ను చేరుకోలేవు. 

మీ ఫోన్ వేగంగా ఛార్జ్ చేయ‌డానికి...
మీరు వేగంగా ఫోన్ ఛార్జింగ్ చేయాల‌ని అనుకుంటున్నారా? అయితే వెంట‌నే ఎయిరోప్లేన్ మోడ్‌ను ఆన్ చేసేయండి. దీని వ‌ల్ల మీ ఫోన్‌కు వ‌చ్చే ట్రాన్స్‌మిష‌న్స్ అన్ని వెంట‌నే డిజేబుల్ అయిపోతాయి. త‌క్కువ స‌మ‌యంలోనే మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇది నిజం. ఒక‌సారి మీరు ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించొచ్చు కూడా.  వేగంగా ఛార్జింగ్ కావాలంటే ఇంత‌కుమించి బెస్ట్ ఆప్ష‌న్ మ‌రొక‌టి ఉండ‌దు.

యాడ్స్ లేకుండా ఆఫ్‌లైన్‌లో గేమ్స్ ఆడ‌డం
దాదాపు అన్ని ఆండ్రాయిడ్ గేమ్స్‌లో యాడ్స్‌తో నిండి ఉంటాయి. అయితే చాలా సంద‌ర్భాల్లో ఈ యాడ్స్ మ‌న‌కు అడ్డంకిగా మార‌తాయి. కీల‌క స‌మ‌యాల్లో మ‌న గేమ్స్‌ను కూడా దెబ్బ తీస్తాయి. ముఖ్యంగా వీడియో యాడ్స్ మీ డేటాను బాగా లాగేస్తాయి.  అందుకే ఎయిరోప్లేన్ మోడ్‌ను అనేబుల్ చేస్తే మీకు యాడ్స్ లేకుండానే గేమ్స్ ఆడే అవ‌కాశం ఉంటుంది.

బ్యాట‌రీ సేవ్ చేయ‌డానికి..
బ్యాట‌రీ సేవ్ చేయ‌డానికి మ‌న‌కు ఎయిరో ప్లేన్ మోడ్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. సెల్యుల‌ర్ సిగ్న‌ల్స్ వీక్‌గా ఉన్న‌ప్పుడు, వైఫై క‌నెక్టివీటి స‌రిగా లేన‌ప్పుడు మీరు ఎయిరో ప్లేన్ మోడ్‌ను యాక్టివేట్ చేయ‌చ్చు. అయితే ఈ స‌మ‌యంలో మీరు ఫోన్ కాల్స్ చేసుకోలేరు. వైఫై క‌నెక్టివిటీ ఉండ‌దు.  బ్యాట‌రీ సేవ్ చేసుకోవ‌డానికి మాత్ర‌మే ఈ ఆప్ష‌న్ వాడాలి. అంటే ఎమ‌ర్జెన్సీలో మాత్ర‌మే.