• తాజా వార్తలు

మీ కంప్యూట‌ర్‌లో హార్డ్‌డ్రైవ్ ఫెయిల్ అయితే తక్షణం ఏం చేయాలి?

కంప్యూట‌ర్‌కు ప్రాణం హార్డ్‌డ్రైవ్. కీల‌క‌మైన డేటా అంతా ఉండేది  ఇందులోనే.  మ‌రి  అంత‌టి కీల‌క‌మైన హార్డ్‌డ్రైవ్ విఫ‌లం అయితే ఏంటి ప‌రిస్థితి? అస‌లు మ‌న‌కు తెలియ‌కుండానే..  ఎలాంటి సూచ‌న‌లు లేకుండానే డ్రైవ్ పాడైపోతే ఏంటి ప‌రిస్థితి.  మ‌న డేటా అంతా గ‌ల్లంతు అయిపోయిన‌ట్లేనా!! మ‌రి కంప్యూట‌ర్‌కు ఎంతో కీల‌క‌మైన హార్డ్ డ్రైవ్‌ను ఫెయిల్ కాక‌ముందే కాపాడుకోవ‌డం ఎలా?  దీనికి మ‌నం ఏం చేయాలి?

సంకేతాలు లేకుండానే..

డ్రైవ్ ఫెయిల్ కావ‌డం చాలా రకాలుగా జ‌రుగుతుంది. కొన్నిసార్లు డ్రైవ్ ఎప్పుడు ఫెయిల్ అవుతుందో మ‌న‌కు అస‌లు తెలియ‌దు. దీనికి ఎలాంటి సంకేతాలు ఉండ‌వు, కంప్యూట‌ర్ కూడా ఈ సంకేతాల‌ను గుర్తించ‌లేదు. అక‌స్మాత్తుగా బూటింగ్ ప్రాసెస్ ఆగిపోవ‌డం.. ఉన్న‌ట్టుండి రీస్టార్ట్ కావ‌డం లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.  మ‌రో టైపు డ్రైవ్ ఫెయిల్యూర్స్‌లో అయితే డ్రైవ్ ప‌ని చేస్తున్న‌ట్లే మ‌నకు క‌నిపిస్తుంది. కానీ లోప‌ల ప్రాబ్లమ్ మాత్రం అలాగే ఉంటుంది. మీ పీసీ ఉన్న‌ట్టుండి ఫ్రీజ్ అయిపోతుంది. డ్రైవ్ నుంచి చిత్ర‌మైన సౌండ్స్ కూడా వ‌స్తాయి. డేటా క‌రెప్ట్ అయిపోవ‌డం లాంటి ఇబ్బందులు కూడా త‌లెత్తుతాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో డ్రైవ్ పూర్తిగా డ్యామేజ్ కాకుండా ఉండ‌డం కోసం కంప్యూట‌ర్‌ను ష‌ట్‌డౌన్ చేయాలి

స్మార్ట్ చెక్ చేయాలి
హార్డ్‌డ్రైవ్ ఫెయిల్ అయిన సంద‌ర్భంలో ముందుగా స్మార్ట్ చెక్ స్టెట‌స్ చూసుకోవాలి. స్మార్ట్ అంటే సెల్ఫ్ మానిట‌రింగ్ అనాల‌సిస్ అండ్ రిపోర్టింగ్ టెక్నాల‌జీ.  ఇది మీ హార్డ్ డ్రైవ్‌లో ఉండే టెక్నాల‌జీ. మీ డ్రైవ్ ఫెయిల్ అయిందో లేదో ఇది చెక్ చేసి చెబుతుంది. హార్డ్‌డ్రైవ్ పూర్తిగా ఫెయిల్ అయిపోతే ఇది ఎలాంటి వార్నింగ్‌లు ఇవ్వ‌దు. అదే అప్పుడ‌ప్పుడే డ్రైవ్ ఫెయిల్ స్టార్ట్ అవుతుంటే మాత్రం వార్నింగ్స్ ఇవ్వ‌డం మొద‌లుపెడుతుంది. ఇది తెలియాలంటే మ‌నం స్మార్ట్ చెక్ చేయాలి. స్మార్ట్ చెక్ చేయాలంటే క్రిస్ట‌ల్‌డిస్క్ఇన్ఫో లాంటి థ‌ర్డ్ పార్టీ యాప్ మీకు కావాలి. మీకు బ్యాడ్ హెల్త్ స్టేట‌స్ క‌నిపిస్తే వెంట‌నే జాగ్ర‌త్త పడాలి.  విండోస్ ఇన్‌స్టాల‌ర్ లేదా లైవ్ లినక్స్ సిస్ట‌మ్ ద్వారా మీ హార్డ్‌డ్రైవ్‌లో ఉన్న డేటాను సేవ్ చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ ఏమైనా డేటా అప్ప‌టికే పోయి ఉంటే డేటా రిక‌వ‌రీ సాఫ్ట్‌వేర్ ద్వారా తిరిగి పొందొచ్చు.

జన రంజకమైన వార్తలు