• తాజా వార్తలు

గైడ్ - వాట్స‌ప్ లైవ్ లొకేష‌న్ షేరింగ్ మీ ఫేవ‌రెట్ యాప్స్ లోనూ యూజ్ చేయ‌డానికి గైడ్

వాట్స‌ప్ ఇటీవ‌లే తీసుకొచ్చిన అత్యంత ఉప‌యోగ‌క‌ర‌మైన ఆప్ష‌న్ లైవ్ లొకేష‌న్ షేరింగ్‌. దీని ద్వారా మీరు ఎక్క‌డ ఉన్నా.. మీ స్నేహితుల‌కు స‌మాచారం అందుతుంది. ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో ఈ లైవ్ లొకేష‌న్ షేరింగ్ గొప్ప మేలు చేస్తుంది. ఇంత‌టి ఉప‌యోగం ఉన్న‌లైవ్ లొకేష‌న్ షేరింగ్‌ను మీకు ఇష్ట‌మైన యాప్స్‌లోనూ వాడుకోవ‌చ్చు. అదెలా సాధ్యం అంటారా దానికిదే గైడ్‌. 

వాట్స‌ప్‌లో ఇలా..
లైవ్ లొకేష‌న్ షేరింగ్‌ను మీ వాట్స‌ప్‌లో వాడుకోవ‌డం చాలా సుల‌భం.   మీ ఫ్రెండ్ లేదా గ్రూప్‌లో అయినా  చాటింగ్ ఓపెన్ చేసి లైవ్ లొకేష‌న్ షేరింగ్ ఆప్ష‌న్ క్లిక్ చేస్తే చాలు. మీరు ఎక్క‌డికి వెళుతుంది... మీరు ఏ ప్ర‌దేశంలో ఉంది అన్ని వివ‌రాలు మీ స్నేహితుల‌కు తెలిసిపోతాయి. మీరు ఆ ఆప్ష‌న్‌ను డిజేబుల్ చేసే వ‌ర‌కు ఇది ప‌ని చేస్తూనే ఉంటుంది.  అయితే ముందుగానే మీరు ఈ లైవ్ లొకేష‌న్ షేరింగ్ ఎంత‌సేపు ప‌ని చేయాల‌నేది డిసైడ్ చేసుకోవ‌చ్చు. దీనికి కూడా ఆప్ష‌న్ ఉంది.

ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌లో ఇలా..
ఈ ఏడాది మార్చిలోనే ఫేస్‌బుక్ మెసెంజ‌ర్ లైవ్ లొకేష‌న్ షేరింగ్ ఆప్ష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ఫీచ‌ర్‌ను ఉప‌యోగించాంటే ముందుగా క‌న్వ‌ర్షేష‌న్ ఓపెన్ చేసి.. ప్ల‌స్ ఐకామ్ మీద ట్యాప్ చేయాలి. ఆ త‌ర్వాత లొకేష‌న్ ఐకాన్‌ను ఎంపిక చేసుకోవాలి. అప్పుడు ఒక మ్యాప్ క‌నిపిస్తుంది. మీ స్నేహితుడు లేదా గ్రూప్‌కు 60 నిమిషాల పాటు ఆ లొకేష‌న్ క‌నిపించేట‌ట్లు ఆప్ష‌న్ పెట్టుకోవ‌చ్చు. ఆ త‌ర్వాత మీరు స్టాప్ షేరింగ్  అంటే ఇది ఆగిపోతుంది.

గూగుల్ మ్యాప్‌లో ఇలా...
ఈ ఏడాది ఆరంభంలోనే గూగుల్ మ్యాప్ లైవ్ షేరింగ్ ఆప్ష‌న్ అందుబాటులోకి తెచ్చింది. లైవ్ లొకేష‌న్ షేర్ చేయ‌డానికి యాప్ ఓపెన్ చేసి బ్లూ డాట్ మీద క్లిక్ చేయాలి. మీరు ఉన్న లొకేష‌న్ క‌నిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు లొకేష‌న్ లైవ్‌లోనే మారిపోతూ ఉంటుంది. దీన్ని ఎంత సేపు ఉంచుకోవాల‌నేది మీ చేతుల్లోనే ఉంది. 15 నిమిషాల నుంచి గంట పాటు ఇది ప‌ని చేస్తుంది. 

స్నాప్‌చాట్ ద్వారా..
స్నాప్‌చాట్‌లోనూ మ‌నం లైవ్ షేరింగ్ ఆప్ష‌న్ ఉప‌యోగించుకోవ‌చ్చు. ఈ జూన్‌లో ఈ ఆప్ష‌న్‌ను ప్ర‌వేశ‌పెట్టింది ఈ సోష‌ల్ మీడియా సంస్థ‌. మీరున్న లొకేష‌న్‌ను సెమీ లైవ్ మ్యాప్ ద్వారా మీ స్నేహితుల‌కు తెలియ‌జేస్తుంది స్నాప్‌చాట్‌.  బిట్‌మోజి ద్వారా ఈ లైవ్ లొకేష‌న్‌ను పిన్ చేయ‌చ్చు. స్నాప్‌చాట్  ఓపెన్ చేసి కెమెరా స్క్రీన్  మీద పించ్ చేయాలి.                                                                              

జన రంజకమైన వార్తలు