• తాజా వార్తలు

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్‌క్రిప్ట్ చేసుకోవ‌డం ఎలా!

ఆండ్రాయిడ్ ఫోన్ చేతిలో ఉంటే స‌మ‌స్తం మ‌న చేతిలో ఉన్న‌ట్లే. దీనికి కార‌ణం ఆండ్రాయిడ్ ఫోన్లో ఇంట‌ర్నెట్ వాడ‌డం వ‌ల్ల మ‌నం ఏం కావాల‌న్నా. ఏం చేయాల‌న్నా జ‌స్ట్ కొన్ని క్లిక్‌లతోనే అయిపోతుంది. బ్యాంక్ ట్రాన్సాక్ష‌న్ల ద‌గ్గ‌ర నుంచి అన్ని కీల‌క ట్రాన్సాక్ష‌న్లు ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నాం. అయితే ఇంత కీల‌క లావాదేవీలు నిర్వ‌హించే ఆండ్రాయిడ్ ఫోన్ ఎంత వ‌ర‌కు సేఫ్‌! హ్యాక‌ర్లు విజృంభిస్తున్న వేళ ఆండ్రాయిడ్ ఫోన్ల‌తో ప్ర‌మాదం ఎప్పూడూ పొంచే ఉంటుంది. అందుకే ఫోన్ ఎన్‌క్రిప్ష‌న్ చాలా కీలకం. మ‌రి ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను ఎన్‌క్రిప్ట్ చేసుకోవ‌డం ఎలాగో చూద్దామా!

ఎన్‌క్రిప్ష‌న్‌ ఇలా..
ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఎన్‌క్రిప్ష‌న్ ఒక ఇన్‌బిల్ట్ ఫీచ‌ర్‌గా ఉంటుంది. అంటే దీని కోసం ప్రత్యేకంగా థ‌ర్డ్ పార్టీ అప్లికేషన్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవ‌స‌రం లేదు. మీ ఫోన్ సెట్టింగ్స్ ద్వారానే ఎన్‌క్రిప్ష‌న్ చేసుకోవ‌చ్చు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎన్‌క్రిప్ష‌న్ ఆప్ష‌న్‌ను ఎనేబుల్ చేస్తే చాలు. అయితే ఆండ్రాయిడ్‌ల‌లో వాడే ఓఎస్‌ల‌ను బ‌ట్టి ఇది ఒక్కో ఫోన్లో ఒక్కో స్థానంలో ఉండొచ్చు. ఉదాహ‌ర‌ణ‌కు షియోమి ఫోన్ల‌లో అడిష‌న‌ల్ సెట్టింగ్స్‌లో ప్రైవ‌సీ ఆప్ష‌న్‌లో ఈ ఎన్‌క్రిప్ష‌న్ ఆప్ష‌న్ ఉంటుంది. లేక‌పోతే ఎన్‌క్రిప్ట్ ఫోన్ ఆప్‌ఫన్ మీద ట్యాప్ చేస్తే మిమ్మ‌ల్ని త‌ర్వాత స్క్రీన్‌కు తీసుకెళ్తుంది.

80 శాతం ఛార్జింగ్ అయితేనే..
మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎన్‌క్రిప్ష‌న్ చేయాలంటే మీ బ్యాట‌రీ క‌నీసం 80 శాతం ఛార్జింగ్ అయి ఉండాలి. ఎన్‌క్రిప్ష‌న్ చేయ‌డానికి గంట‌కు పైగా స‌మ‌యం ప‌డుతుంది. అంతేకాదు ఈ ప్రాసెస్ చేసేట‌ప్పుడు మ‌న ఫోన్‌ను ప‌వ‌ర్‌కు ప్ల‌గ్ చేసి ఉంచాల్సి ఉంటుంది. మీ డివైజ్ రూటెడ్ అయితే దాన్ని అన్‌రూట్ చేసి ఎన్‌క్రిప్ష‌న్ చేయాలి. ఎస్‌డీ కార్డ్‌కు కూడా ఎన్‌క్రిప్ష‌న్ చేసుకునే అవ‌కాశం కొన్ని డివైజ్‌ల‌లో ఉంటుంది. మీ ఎన్‌క్రిష్ష‌న్ డేటాలోనే ఎక్స‌ట్ర‌న‌ల్ మెమెరీకి కూడా అనే ఆప్ష‌న్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే స‌రిపోతుంది. ఎన్‌క్రిప్ష‌న్ కోసం ఫింగ‌ర్ ప్రింట్ రీడ‌ర్లు ఉప‌యోగించ‌కూడ‌దు. ప్ర‌తిసారి కొత్త‌గా పిన్ లేదా పాస్‌వ‌ర్డ్ మాత్ర‌మే ఉప‌యోగించాలి.

జన రంజకమైన వార్తలు