• తాజా వార్తలు
  •  

ఒక క్లిక్‌తో ఆండ్రాయిడ్ ఫోన్‌ను రూటింగ్ చేయ‌డానికి గైడ్‌

ఆండ్రాయిడ్ ఫోన్‌తో ఎంత ఆనందమో..అంత బాధా ఉంటుంది. న‌డిచినంత కాలం ఇది బాగానే ఉంటుంది.  కానీ ఏదైనా ఇబ్బంది  త‌లెత్తితే ఇంకా అంతే. ఆండ్రాయిడ్ రూట్ చేయ‌డం కూడా ఇలాంటిదే. దీని కోసం చాలామంది యాప్‌లు వాడుతుంటారు. దీని వల్ల ఆండ్రాయిడ్ ఫోన్‌కే ప్ర‌మాదం త‌లెత్తే అవ‌కాశం ఉంది. దీనికి రాంగ్ ఫ‌ర్మ్‌వేరే కార‌ణం. అయితే ఒక చిన్న ట్రిక్ పాటించ‌డం వ‌ల్ల మ‌నం సుల‌భంగా ఆండ్రాయిడ్ ఫోన్‌ను రూటింగ్ చేసుకోవ‌చ్చు.  రూటింగ్ అంటే మొబైల్ ఫ‌ర్మ్‌వేర్‌ను మార్చుకోవ‌చ్చు. మ‌రి  ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎలా రూట్ చేయ‌చ్చో చూద్దామా..
వన్ క్లిక్ రూట్ యాప్ ద్వారా ఎలా చేయాలంటే..
1.ఒకే క్లిక్ ద్వారా ఆండ్రాయిడ్‌ను రూట్ చేయ‌డానికి వ‌న్ క్లిక్ రూట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2 వ‌న్ క్లిక్ రూట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి
3. పీసీకి క‌నెక్ట్ చేసి యూఎస్‌బీ డీబ‌గ్గింగ్‌ను అనేబుల్ చేయాలి. 
4. ఆ త‌ర్వాత రూట్ అనే ఆప్ష‌న్  మీద క్లిక్ చేయాలి.
5. కాసేటికే మీ మొబైల్ ఎలాంటి ఎర్ర‌ర్స్ లేకుండా రూట్ అయిపోతుంది.
జీనియ‌స్ వ‌న్ క్లిక్‌
1. జీనియ‌స్ వ‌న్ క్లిక్ యాప్ కూడా రూటింగ్‌కు వాడేదే
2. ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి
3. దాన్ని ఫోన్‌కు క‌నెక్ట్ చేసుకోవాలి. క‌నెక్ట్ అయిన త‌ర్వాత ఇది డిటెక్ట్ చేస్తుంది
4. అగ్రిమెంట్‌ను యాక్సెప్ట్ చేసి రూట్ అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి. 
5. మిగిలిన ప‌నిని యాప్ చూసుకుంటుంది
పీసీని ఉప‌యోగించి ఎలా చేయాలంటే..
1.పీసీని ఉప‌యోగించి ఆండ్రాయిడ్ మొబైల్‌ను రూట్ చేయాలంటే ముందుగా కింగో రూట్‌ను మీ విండోస్ పీసీలోకి డౌన్‌లోడ్ చేసుకోవాలి
2.  ఇన్‌స్టాల్ చేసి దానిపై డ‌బుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయాలి
3. ఆ త‌ర్వాత మీ మొబైల్ ఫోన్‌ను యూఎస్‌బీ కేబుల్ ద్వారా క‌నెక్ట్ చేసి డెల‌ప‌ర్స్ ఆప్ష‌న్‌లో ఉన్న యూఎస్‌బీ డీబ‌గ్గింగ్‌ను ఎనేబుల్ చేయాలి
4. రూట్ అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేయ‌గానే మీకు హోమ్ స్క్రీన్ మీద కింగో రూట్ అని క‌నిపిస్తుంది
5. మీ మొబైల్‌లో ప‌ర్మిష‌న్లు అడిగితే అన్నింటికి ఎస్ అని క్లిక్ చేయాలి
6. ఒక్కోసారి ఈ ప్రాసెస్‌లో మీ మొబైల్ రీబూట్ కూడా కావొచ్చు. మీకు ఆఖ‌ర్లో స్క్రీన్ మీద కింగో రూట్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌స్తుంది. 

జన రంజకమైన వార్తలు