• తాజా వార్తలు

మన స్టోరేజ్ ను తెగ తినేస్తున్న టాప్ యాప్ లు – వాటికి ఉన్న ప్రత్యామ్నాయాలు . పార్ట్ -1

స్మార్ట్ ఫోన్ యూజర్ లకు తరచుగా ఎదురయ్యే సమస్యలలో ప్రధానమైనది స్టోరేజ్ సమస్య. అవును, మనం ఎంతో ఇష్టపడి ఒక ఏదో ఒక యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుందాం అనుకుంటాం, లేదా ఒక ముఖ్యమైన ఫైల్ ను మన వాట్స్ అప్ నుండి డౌన్ లోడ్ చేసుకుందాం అనుకుంటాం. సరిగ్గా అప్పుడే అవుట్ అఫ్ స్టోరేజ్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. ఎక్కడలేని చికాకు. ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఫోన్ కొంటే స్టోరేజ్ లేదేంట్రా బాబూ అని బాధ పడతాం. మరి ఇంత త్వరగా ఫోన్ లో ఉన్న స్టోరేజ్ అయిపోవడానికి కారణం ఏమిటి? యాప్ లు. అవును, ఖచ్చితంగా యాప్ లే. ఇప్పుడు ప్రతీదానికీ యాప్ లు వచ్చేస్తున్నాయి. ఆసక్తి తోనో, అవసరం తోనో దాదాపు అన్ని యాప్ లనూ మన ఫోన్ లలో ఇన్ స్టాల్ చేస్తాము. మన ఫేవరెట్ యాప్ లు ఒక్కొకటి ఎంత స్టోరేజ్ ను ఆక్రమిస్తాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ స్టోరేజ్ సమస్య నుండి బయటపడడం ఎంతో అవసరం. ఎందుకంటే స్టోరేజ్ నిండిదంటే అది బ్యాటరీ లైఫ్ పైనా, డేటా, RAM పై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ విషయం లో జాగ్రత్తగా ఉండడం అవసరం. ఈ నేపథ్యం లో మన స్టోరేజ్ ను విపరీతంగా తినేస్తున్న యాప్ ల గురించీ మరియు వాటికి గల ప్రత్యామ్నాయాల గురించీ ఈ ఆర్టికల్ మొదటి భాగం రూపం లో చర్చిద్దాం.

క్రోమ్ ( 70 MB )

గూగుల్ క్రోమ్ ఎంత మెమరీ ని అక్రమిస్తుందో PC యూజర్ లకు బాగా తెలుసు. మొబైల్ వెర్షన్ లో కూడా దాదాపు గా ఇదే స్థాయి మెమరీ ని ఇది ఆక్రమిస్తుంది. చూడడానికి తక్కువ మెమరీ నే ఆక్రమిస్తున్నా ఇది RAM ను విపరీతంగా తినేస్తుంది. మీరు ఏదైనా బ్రౌజ్ చేస్తున్నపుడు ఉన్నట్టుండి స్లో అయిందంటే అది ఖచ్చితంగా క్రోమ్ RAM పై చూపిన ప్రభావం గానే భావించవచ్చు. దీనికి డేటా, cache ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఈ క్రోమ్ సైజు సాంకేతికంగా ఒక్కో డివైస్ కూ ఒక్కో రకంగా ఉంటుంది.

ప్రత్యామ్నాయం : ఓపెరా మినీ ( 13- 20 MB )               

గూగుల్ ప్లే స్టోర్ లో రెండు ఓపెరా మినీ యాప్ లు అందుబాటులో ఉన్నాయి. రెండూ కూడా చూడడానికి ఒకే రకంగా ఉంటాయి. పెద్ద తేడాలేమీ కనపడవు. రెండూ కూడా ఓపెరా క్రియేట్ చేసినవే, ఒకే పేరుతో ఉంటాయి కాకపోతే ఒకటి బీటా వెర్షన్. రెండూ కూడా ఆండ్రాయిడ్ సపోర్ట్ తో ఉంటాయి.

ఇవి క్రోమ్ బ్రౌజర్ యాప్ కంటే తక్కువ పరిమాణం లోనే ఉంటాయి. కాబట్టి విపరీతంగా RAM ను తినేసే క్రోమ్ కు బదులుగా ఓపెరా మినీ బ్రౌజర్ ను వాడడం ఒక చక్కటి పరిష్కారం గా భావించవచ్చు.

ఫేస్ బుక్ (69 MB )          

బాగా పాపులర్ అయిన ఫ్రీ ఆండ్రాయిడ్ యాప్ లలో ఫేస్ బుక్ ఒకటి. చాలా డివైస్ లలోఇది ప్రీ ఇన్ స్టాల్ చేయబడి వస్తుంది. ప్రస్తుతం ఉన్న అతి పెద్ద యాప్ లలో ఇది కూడా ఒకటి.  ఇది చూడడానికి 69 MB గా కనిపిస్తున్నప్పటికీ తరచుగా బ్లోట్ అవుతూ ఉంటుంది.  ఇందులో డేటా ఒక్కోసారి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. షియోమీ రెడ్ మీ నోట్ 4 లో ఇది 243 MB ని ఆక్రమించుకోవడమే దీనికి ఉదాహరణ.

ప్రత్యామ్నాయం: ఫేస్ బుక్ లైట్ ( 5 MB )

చాలా ,అంది ఫేస్ బుక్ యూజర్ లు తమ ఎకౌంటు లను మేనేజ్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్ లను ఉపయోగించడానికి అసలు ఇష్టపడరు. అయితే ఇలాంటి వారికోసమే ఫేస్ బుక్ అధికారికంగా ఫేస్ బుక్ లైట్ అనే మరొక యాప్ ను లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం డేటా ను సేవ్ చేయడం. ఇది ఫేస్ బుక్ యొక్క ఫుల్ వెర్షన్ కంటే చాలా తక్కువ గా ఉంటుంది. ఇది కేవలం 5 MB స్పేస్ ను మాత్రమే ఆక్రమిస్తుంది. ఇంత తక్కువ సైజు ఉన్నప్పటికీ ఒరిజినల్ ఫేస్ బుక్ యాప్ లో ఉండే ఫీచర్ లు అన్నీ దాదాపుగా ఇందులో కూడా ఉంటాయి.

మైక్రో సాఫ్ట్ వర్డ్  ( 92 MB )        

మైక్రో సాఫ్ట్ ఆఫీస్ యొక్క వివిధ రకాల యాప్ లను ఇప్పటికే అనేకమంది ఆండ్రాయిడ్ యూజర్ లు ఉపయోగిస్తున్నారు.  ఇవన్నీ ఉచితంగా లభించేవే, అందరూ వాడేవే. అయితే ఎంత పాపులర్ అయినా, ఎంతగా వాడబడుతున్నా వీటిలో కొన్ని మాత్రం విపరీతమైన స్టోరేజ్ ను ఆక్రమిస్తున్నాయి. మిగతా కంపెనీల యాప్ లతో పోలిస్తే చాలా ఎక్కువ సైజు లో ఇవి ఉంటాయి. వీటిలో మైక్రో సాఫ్ట్ వర్డ్ ప్రముఖమైనది. ఇది 92 MB ని ఆక్రమిస్తుంది.

ప్రత్యామ్నాయం : గూగుల్ డాక్స్ ( 25 MB )

గూగుల్ ప్లే స్టోర్ లో అనేక రకాల ఫ్రీ ఆఫీస్ సూట్ లు అందుబాటులో ఉన్నాయి. ఇండివిడ్యువల్ డాక్యుమెంట్ యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం గూగుల్ ప్రత్యేక ఆఫర్ లను అందిస్తుంది. ప్రతీ యాప్ కూడా ఇండివిడ్యువల్ డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు ను కలిగిఉంటుంది. ఇది ఒక్కోకటి 25 MB స్టోరేజ్ వరకూ కలిగి ఉంటుంది. గూగుల్ సూట్ లో షీట్స్ మరియు డాక్స్ రెండు మేజర్ యాప్ లు. ఇవి అనేక మైక్రోసాఫ్ట్ యాప్స్ కు ప్రత్యామ్నాయాలు గ ఉపయోగపడతాయి. ఇందులో పిడిఎఫ్ వ్యూయర్ , స్లయిడ్ షో ప్రజెంటర్ యాప్, నోట్ టేకింగ్ హబ్ లను కూడా కలిగి ఉంటుంది.

పిక్స్ ఆర్ట్ ( 73 MB )

పిక్స్ ఆర్ట్ అనేది ఒక మోస్ట్ పాపులర్ ఫోటో ఎడిటింగ్ యాప్ మాత్రమె కాదు అతి పెద్ద యాప్ కూడా. ఇందులో అనేకరకాల ఫంక్షన్ లు ఉంటాయి. 73 MB స్టోరేజ్ తో ఇది VSCO,స్నాప్ సీడ్ లాంటి ఇతర ప్రముఖ ఫోటో ఎడిటింగ్ యాప్ లకంటే కూడా [పెద్దగా ఉంటుంది.

ప్రత్యామ్నాయం : Pixlr ( 32 MB )       

కేవలం 32 MB స్పేస్ నే ఆక్రమించడం ద్వారా స్టోరేజ్ స్పేస్ విషయం లో ఇది అతి చిన్న ఫోటో ఎడిటింగ్ యాప్ లలో ఒకటిగా నిలిచింది. ఇంత చిన్న సైజు లో ఉన్నప్పటికీ మిగతా ఫోటో ఎడిటింగ్ యాప్ లలో ఉండే ఫీచర్ లు అన్నీ దాదాపుగా ఇందులో కూడా ఉంటాయి. ఇది టెక్స్ట్ మరియు ఓవర్ లే ఫంక్షన్ ను కూడా కలిగి ఉంటుంది.

ఫేస్ బుక్ మెసెంజర్ ( 113 MB )

తమ ఫోన్ లలో తక్కువ స్పేస్ ఉన్నవారికి ఫేస్ బుక్ యాప్ తో పాటు అదనంగా మెసెంజర్ కూడా ఇన్ స్టాల్ చేసుకోవాలంటే అది అదనపు భారంగా ఉంటుంది. ఇది చాలదన్నట్లు ఈ మెసెంజర్ యాప్ 113 MB స్పేస్ ను ఆక్రమిస్తుంది. అనేక మెసేజింగ్ ఫ్లాట్ ఫాం లు ఉన్న ఈ రోజుల్లో అంత మెమరీ తో పరిమిత యూసేజ్ ను మాత్రమే ఉన్న మెసెంజర్ ను వాడడం అంటే ఇబ్బందే. అయితే దీనికికూడా ప్రత్యామ్నాయం ఉంది.

మెసెంజర్ లైట్ యాప్ ( 17 MB )       

దీని ఒరిజినల్ తో పోలిస్తే ఇది చాలా తక్కువగా కేవలం 17 MB మాత్రమే కలిగి ఉంటుంది. పనితీరు లో దీని ఒరిజినల్ కు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. ఆడియో కాలింగ్, ఫోటో సెండింగ్ , ఇన్ స్టంట్ మెసేజింగ్ ఫీచర్ లు కూడా ఇందులో ఉంటాయి. అయితే ఒరిజినల్ వెర్షన్ లో ఉండే వీడియో కాలింగ్ మాత్రం ఇందులో ఉండదు.   

జన రంజకమైన వార్తలు