• తాజా వార్తలు

మన స్టోరేజ్ ను తెగ తినేస్తున్న టాప్ యాప్ లు. వాటికి ఉన్న ప్రత్యామ్నాయాలు. పార్ట్-2

మన స్మార్ట్ ఫోన్ లలో ఉన్న స్టోరేజ్ ను విపరీతంగా తినేస్తున్న టాప్ యాప్ ల గురించి నిన్నటి ఆర్టికల్ లో చదువుకున్నాము. మా కంప్యూటర్ విజ్ఞానం పాఠకులను ఈ ఆర్టికల్ విశేషంగా ఆకట్టుకుందని భావిస్తూ ఈ ఆర్టికల్ లో రెండవ భాగం, అనగా మీ ఫోన్ లలో ఉండే స్టోరేజ్ ను విపరీతంగా తినేసే యాప్ లు, వాటి ప్రత్యామ్నాయాలు పార్ట్-2 ను ఈ రోజు ఆర్టికల్ లో చూద్దాం.

స్కైప్  70 MB

ఈ లిస్టు లో ఇంతకుముందు చెప్పుకున్న యాప్ లతో పోలిస్తే ఈ స్కైప్ యాప్ ఏమంత ఎక్కువ స్పేస్ ను ఆక్రమించేదిగా అనిపించదు. దీనిలో ఉండే ఫీచర్ లు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అయితే ఇది దీని స్థాయికి తగ్గ రీతిలో స్ట్రీమ్ లైన్ అవ్వలేదు. ఈ నేపథ్యం లో స్కైప్ కు ప్రత్యమ్నాయంగా అనేకరకాల వీడియో కాలింగ్ యాప్ లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ వీటిని వాడాలంటే మళ్ళీ మళ్ళీ కొత్త ఎకౌంటు ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? దీనికి ఒకేఒక్క పరిష్కారం స్కైప్ లైట్ యాప్.

ప్రత్యామ్నాయం : స్కైప్ లైట్  50 MB

ఇది ఇంకా బీటా వెర్షన్ లోనే ఉన్నది. అయినప్పటికీ మరింత వీడియో స్ట్రీమ్ లైన్ కావాలి అనుకునే ఆండ్రాయిడ్ యూజర్ లు దీనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.డేటా సేవ్ చేయడం, తక్కువ నెట్ వర్క్ కండిషన్ లలో కూడా పని చేయడమే ప్రధానలక్ష్యాలుగా ఇది డెవలప్ చేయబడింది. అందుకనే దీని ఒరిజినల్ వెర్షన్ కంటే ఇది కేవలం 20 MB మాత్రమే తక్కువ ఉంటుంది. 1MB స్పేస్ కూడా RAM విపరీత ప్రభావం చూపుతున్న పరిస్థితులలో 20MB తేడా అంటే పరిగణన లోనికి తీసుకోవలసిందే. అయినా సరే మీరు సంతృప్తి చెందకపోతే వాట్స్ అప్ వీడియో కాలింగ్ లాంటి వీడియో కాలింగ్ యాప్ లను కూడా ఉపయోగించుకోవచ్చు.

స్పూటిఫై  93 MB

ప్రాథమికంగా ఈ స్పూటిఫై ను కేవలం ఒక మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ గా మాత్రమే పరిగణన లోనికి తీసుకుంటే ఇది ఆక్రమించే స్పేస్ అంత లెక్కలోనిదిగా అనిపించకపోవచ్చు. కానీ ఆండ్రాయిడ్ స్టోరేజ్ ను విపరీతంగా తినేసే యాప్ ల లిస్టు లో ఇది మొదటి స్థానం లో ఉన్నదని తెలిస్తే మాత్రం తప్పకుండా ఆలోచిస్తారు. స్మార్ట్ ఫోన్ లలో స్టోరేజ్ ను విపరీతంగా తినేసే యాప్ ల గురించి AVG నిర్వహించిన సర్వే లో ఇది మొదటి స్థానం లో నిలిచింది. అదిమాత్రమే గాక స్మార్ట్ ఫోన్ పెర్ఫార్మన్స్ ను దెబ్బతీసే యాప్ లలో రెండవ స్థానం లోనూ, బ్యాటరీ డ్రైనింగ్ యాప్ లలో ఆరవ స్థానం లో నిలిచిందంటే దీని పరాక్రమం అర్థం చేసుకోవచ్చు.

ప్రత్యామ్నాయం : గూగుల్ ప్లే మ్యూజిక్ 35 MB

స్పూటిఫై, గూగుల్ ప్లే మ్యూజిక్ లలో ఏది ఎంపిక చేసుకోవాలి అంటే మాత్రం నిస్సందేహంగా తక్కువ స్పేస్ ఆక్రమించేదానికే ఓటు వేయవచ్చు. గూగుల్ ప్లే మ్యూజిక్ కేవలం 35MB మాత్రమే ఉంటుంది. మీరు సాంగ్స్ ను డౌన్ లోడ్ చేసుకున్నపుడూ, మ్యూజిక్ స్ట్రీమ్ చేసేటపుడూ కాచే ను మరియు డేటా స్టోరేజ్ ను ఇది ఆక్రమిస్తుంది. ఓవర్ ఆల్ స్టోరేజ్ ఆప్షన్ లలో చూసుకుంటే మాత్రం స్పూటిఫై కంటే ఇది బెటర్ అని మాత్రం చెప్పవచ్చు.

మైక్రో సాఫ్ట్ అవుట్ లుక్  71 MB                   

మైక్రోసాఫ్ట్ ఈమెయిలు ఎక్స్చేంజి సర్వర్ లను ఉపయోగించేవారికి ఈ అవుట్ లుక్ యాప్ బాగా ఉపయోగపడుతుంది. అయితే AVG విడుదల చేసిన చెత్త యాప్ ల లిస్టు లో ఇది కూడా మొదటివరుసలోనే ఉంది. దీనిని కేవలం ఇన్ స్టాల్ చేసుకుంటేనే 71 MB ఉంటుంది. ఇంకా ఎక్స్ ట్రా కాచే, మీరు మీ ఈమెయిలు చెక్ చేసుకున్నపుడు వచ్చే సేవ్డ్ డేటా లతో పోలిస్తే ఇంకా ఎక్కువ మెమరీ నే ఇది ఆక్రమిస్తుంది.

ప్రత్యామ్నాయం: ఆక్వా మెయిల్ 18 MB

ఈ ఆక్వా మెయిల్ యాప్ లో జి మెయిల్, అవుట్ లుక్,యాహు మరియు ఇతర మెయిల్ ఫంక్షన్ లన్నీ కేవలం 18 MB స్పేస్ లోనే ఇమిడి ఉంటాయి. అంటే అవుట్ లుక్ తో పోలిస్తే అందులో కేవలం పావు వంతు మాత్రమే ఇది ఉంటుంది. దీనికి ఉన్న ఒకేఒక ప్రతికూలత ఏమిటంటే మైక్రో సాఫ్ట్ బిజినెస్ ఈమెయిలు ఎకౌంటు ఇందులో లాక్ చేయబడి ఉంటుంది.

మైక్రోసాఫ్ట్ ఎక్సెల్  84 MB

మీ ఫోన్ లోని స్పేస్ ను విపరీతంగా తినేసే పాపులర్ యాప్ లలో ఈ ఎక్సెల్ కూడా ఒకటి. సైజు విషయం లో పూర్తి ఆఫీస్ సూట్ ఆక్రమించే స్పేసు ను ఇది ఒక్కటే ఆక్రమిస్తుంది. ఇందులో ఉండే మోర్ అడ్వాన్స్డ్ ఫీచర్ లు, అల్గోరిథం దీనికి కారణం కావచ్చు.

ప్రత్యామ్నాయం: గూగుల్ షీట్స్  25 MB

ఈ గూగుల్ షీట్స్ యాప్ గూగుల్ డాక్స్ ను పోలి ఉంది మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ కంటే తక్కువ సైజు ను కలిగిఉంటుంది. కానీ ఇందులో ఫీచర్ లు ఎక్కువ ఉంటాయి. చార్ట్ లు, స్ప్రెడ్ షీట్ లు, విజువలైజేషన్ లు ఇందులో ఉంటాయి. గూగుల్ డ్రైవ్ లో ఉండే డిఫాల్ట్ స్ప్రెడ్ షీట్ యాప్ కూడా ఒక ప్రత్యామ్నాయంగా భావించవచ్చు.

ట్విట్టర్  70 MB

ప్రస్తుతం సోషల్ మీడియా యాప్ లతో పోలిస్తే ట్విట్టర్ కొంచెం ఎక్కువ స్పేస్ నే ఆక్రమిస్తుంది. 70 MB స్పేస్ తో ఇంచుమించు ఫేస్ బుక్ ఆక్రమించే స్పేస్ నే ఇది కూడా ఆక్రమిస్తుంది. అయితే ఇందులో ఫీచర్ లు ఎక్కువగా ఉండడం వలన డేటా మరింత వాడబడే అవకాశం ఉంది.

ప్రత్యామ్నాయం : స్లిమ్ సోషల్ ఫర్ ట్విట్టర్ 1.5 MB

టెక్నికల్ గా చూసుకుంటే  ట్విట్టర్ కోసం  లైట్ యాప్ ఒకటి ఉంది. అయితే అది ఇంకా డెవలప్ మెంట్ స్టేజి లోనే ఉంది. ఇది పరిమిత రోల్ అవుట్ ను కలిగిఉంది. అంటే చాలా చోట్ల ఇది అందుబాటులో ఉండదు. ఇక్కడే మరొక యాప్ యొక్క అవసరం వస్తుంది. అదే స్లిమ్ సోషల్  ఫర్ ట్విట్టర్, ఇది ఒక థర్డ్ పార్టీ యాప్. ట్విట్టర్ యొక్క  అధికారిక యాప్ కాదు. చాలా చోట్ల అందుబాటులో ఉంటుంది. ఫేస్ బుక్ కోసం స్లిమ్ సోషల్ ను డిజైన్ చేసిన వారే దీనినికూడా డెవలప్ చేశారు. ఇది కేవలం 1.5 MB మాత్రమే ఉంటుంది. అయితే ఇది అనధికారిక యాప్ అయినందువలన ట్విట్టర్ లైట్ తో పోలిస్తే సెక్యూరిటీ కి గ్యారంటీ మాత్రం లభించదు.

 

 

జన రంజకమైన వార్తలు