• తాజా వార్తలు
  •  

ఉచితంగా, సులువుగా విదేశీ భాషలు నేర్చుకోవడానికి గైడ్

విదేశీ భాషలు నేర్చుకోవాలంటే....కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కేవలం మీకు ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే చాలు...విదేశీ భాషలను అద్భుతంగా నేర్చుకోవచ్చు. కొన్ని బెస్ట్ లాంగ్వేజేస్ యాప్స్ ద్వారా విదేశీ భాషలను సులభంగా నేర్చుకోవచ్చు. ఆన్ లైన్లో ఫ్రీగా విదేశీ భాషలను నేర్చుకునేందుకు సహాయపడే యాప్స్ మీకోసం అందిస్తున్నాం. ఓ సారి చెక్ చేయండి.

డౌలింగో   (Duolingo)

 డౌలింగో...అత్యంత ప్రజాదరణ పొందిన బహుభాషా యాప్ ఇది. ఆన్ లైన్లో ఫ్రీగా అందుబాటులో ఉంటుంది. పాఠాలను చిన్నచిన్నగా విభజించి...గేమ్ మాదిరిగా ఉంటుంది. నిత్యజీవితంలో వాడే పదాలను, వస్తువులను ఉదాహరణలుగా వివరిస్తూ...భాషను నేర్చుకునే అవకాశం కల్పిస్తుంది. చిన్న ప్రశ్నలతో మీలో సంభాషణ నైపుణ్యాన్ని కూడా పెంచుతుంది. డ్యూలింగోతో కొత్త భాషను నేర్చుకోవడం చాలా సులభం.

హెల్లోటాక్ (hellotalk)

విదేశీ భాషలు నేర్చుకోవడానికి చాలా యాప్ ఉన్నాయి. అందులో హెల్లో టాక్ ఒకటి. వ్యాకరణం, వ్యాసరచన వంటి నైపుణ్యాలపై అవగాహనకు ఈ యాప్ మంచి వేదిక అని చెప్పవచ్చు. ఆయా భాషలు ఎలా ఉచ్చరించాలో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్ పై ఉచితంగా పొందవచ్చు.

మైండ్ స్నాక్స్ (mindsnacks)

ఈయాప్ ద్వారా ఏడు భాషలను సులభంగా నేర్చుకోవచ్చు. చక్కగా నేర్చుకోవడానికి 8నుంచి9 ఆటలను అందిస్తుంది. వ్యాకరణం, ఉచ్చారణను పరిపూర్ణంగా మెరుగుపరచడానికి చాలా గేమ్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని గేమ్స్ ప్రీమియమ్ వెర్షన్ లో అందుబాటులో ఉన్నాయి. కానీ మీరు భాషను నేర్చుకోవడానిని ప్రాథమిక వెర్షన్ సరిపోతుంది.

మెమ్రైజ్ (memrise)

మెమ్రైజ్ లో విదేశీ భాషలకు చెందిన పలు లెవల్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన పదాలను ట్రాన్స్ లేషన్ సహా ఈ యాప్ అందిస్తుంది. పర్యాయపదేలే కాదు...ఎలా ఉచ్చరించాలన్నా విషయం కూడా తెలుసుకోవడం చాలా సులభం. కొన్ని చిత్రాలను ఉపయోగించి పరభాషా పదాలను చూపిస్తుంది కూడా. దీంతో మీరు విదేశీ భాషలను ఎంచక్కా నేర్చుకోవచ్చు.

బుస్సు (bussu)

విదేశీ భాషలకు సంబంధించిన బేసిక్స్ నేర్చుకునేందుకు ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది. స్థానికులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు అవసరమయ్యే భాష తెలిస్తే సరిపోతుంది. ఈ యాప్ సహాయంతో చాలా విదేశీ భాషలను నేర్చుకోవచ్చు. ఈ యాప్ లో కేవలం 12 భాషలు మాత్రమే ఉంటాయి. కానీ మీరు నేర్చుకోవాలనుకున్న భాష ఈ జాబితాలో ఉంటే సులభంగా నేర్చుకోవచ్చు.

టెన్డమ్ (tandam)

 మీరు నేర్చుకునే భాష...స్ధానికంగా మాట్లాడేవారితో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఆడియో, వీడియో చాట్ ఆప్షన్స్ కూడా ఉంటుంది. టెక్స్టింగ్ ఫీచర్ను కూడా అందిస్తుంది ఈ యాప్. మీరు మాట్లాడటం, రాయడం, వినడం వంటివి ఈ యాప్ ద్వారా నేర్చుకోవచ్చు. ఈ యాప్ దాదాపు 150 భాషలను అందిస్తుంది.

క్లోజ్ మాస్టర్ (clozemaster)

ఈయాప్ విదేశీ భాషలను ఒక ఆటలా నేర్చుకునేందుకు సహాయపడుతుంది. కానీ క్లోజ్ మాస్టర్ ఒక గేమ్ లాంటిది. దాదాపు వందకు పైగా భాషలను అందిస్తుంది. అన్ లాక్ చేయడానికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మీరు డ్యూలింగ్ లేదా బుస్సు యాప్స్ గురించి విన్నంతగా...క్లోజ్ మాస్టర్ యాప్ గురించి వినలేకపోవచ్చు. కానీ ఈ యాప్స్ ద్వారా సరదాగా విదేశీ భాషలను నేర్చుకోవచ్చు.

Hinata

విదేశీ భాషలు నేర్చుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడే యాప్ ఇది. ఒక పదం ఉచ్చారణ, పూర్తి అనువాదాల కోసం సరైన అప్లికేషన్ గురించి స్థానికంగా అడగవచ్చు. మీరు ఇతర అభ్యాసకులతో సంప్రదించవచ్చు.

Fluent

ఒక భాష నేర్చుకోవడానికి బెస్ట్ యాప్ ఇది. వీడియోల కోసం మీరు యూట్యూబ్ లో డబ్బుతో పాటు సమయాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ యాప్ ద్వారా ఈ రెండూ ఆదా అవుతాయి. మీకు కావాల్సిన వీడియోలను ట్రాన్స్ లేషన్ తో సహా అందిస్తుంది. ఈ యాప్ ద్వారా మీరు విదేశీ భాషలను నేర్చుకోవడం చాలా సులభం అవుతుంది.