• తాజా వార్తలు
  •  

కంప్యూటర్ మెయింటెనెన్స్ కు వన్&ఓన్లీ గైడ్ పార్ట్ -2

మీ కంప్యూటర్ లేదా లాప్ టాప్ యొక్క సరైన మెయింటెనెన్స్ గురించి మన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిన్నటి ఆర్టికల్ లో పార్ట్ 1 ద్వారా కొన్నింటిని తెలుసుకునియున్నాము. మరికొన్ని జాగ్రత్తలను ఈ రోజు ఆర్టికల్ లో పార్ట్ 2 లో చూద్దాం.

యాంటి మాల్ వేర్ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించండి

యాంటి మాల్ వేర్ ల కూ మరియు యాంటి వైరస్ సాఫ్ట్ వేర్ లకూ మధ్య చిన్న తేడా ఉంది. అన్ని మాల్ వేర్ లూ వైరస్ లు కాదు. కానీ అన్ని వైరస్ లూ మాల్ వేర్ లే. అంటే కొన్నిసార్లు మీ యాంటి వైరస్ సాఫ్ట్ వేర్ మాల్ వేర్ లను కనిపెట్టలేకపోవచ్చు. అలాంటి సందర్భాలలో మీ సిస్టం లో యాంటి మాల్ వేర్ వైరస్ ఉంటే ఎలాంటి మాల్ వేర్ లనూ మీ pc లోనికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.

మీ డివైస్ డ్రైవర్ లను అప్ డేట్ చేయండి

కంప్యూటర్ లలో ఉండే విడిభాగాలు కూడా ఒక్కోసారి డేటా లాస్ కు కారణం కావచ్చు. కాబట్టి మీ సిస్టం లోపల ఉండే డ్రైవర్ లను ఎప్పటికప్పుడు అడ్వాన్స్డ్ వెర్షన్ లో ఉండేలా చూసుకోవడం మంచిది. మౌస్ దగ్గరనుండీ గ్రాఫిక్ కార్డు ల వరకూ అన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఈ అప్ డేటెడ్ డ్రైవర్ లు మంచి పెర్ఫార్మన్స్ ను ఇవ్వడమే గాక ఏవైనా ఇష్యూ లు ఉంటే వాటిని సాల్వ్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలి అంటే మీ కంప్యూటర్ లోని సాఫ్ట్ వేర్ పార్ట్ ను ఇవి మెయింటెయిన్ చేస్తాయి.

జంక్ ఫైల్స్ కు దూరంగా ఉండడం

మన pc పెర్ఫార్మన్స్ ను స్లో చేసే కారకాలలో జంక్ ఫైల్స్ కూడా ఒకటి. కాబట్టి మీ కంప్యూటర్ చక్కగా పనిచేయాలంటే రెగ్యులర్ గా జంక్ ఫైల్స్ ను క్లీన్ చేస్తూ ఉండాలి. టెంపరరీ మరియు అబ్సలేట్ ఫైల్స్ ఈకువ స్పేస్ ను ఆక్రమిస్తాయి.Ccleaner లాంటి టూల్ కిట్ లను ఉపయోగించడం ద్వారా ఇలాంటి జంక్ ఫైల్స్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు.

ఇంటర్ నెట్ ఫైల్స్ ను డిలీట్ చేయండి

మీరు ఇంటర్ నెట్ ను బ్రౌజ్ చేసినపుడు చాలా ఫైల్ లు మీ స్టోరేజ్ లో ఉండిపోతాయి. వాటిలో కాచే ఫైల్స్,ఇంటర్ నెట్ కుకీస్, పాస్ వర్డ్ లు మరియు ఇతరత్రా ఫైల్ లు ఉండవచ్చు.కొన్నిసార్లు ఈ ఫైల్ లు మీ డేటా ను తస్కరించడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇలాంటి ఇంటర్ నెట్ ఫైల్ లను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా మంచిది.

మీ HDD ని డీ ఫ్రాగ్ మెంట్ చేయండి

ఎప్పుడైనా మీ హార్డ్ డిస్క్ డ్రైవ్ స్లో అయినట్లు అనిపిస్తుందా? అయితే అది ఖచ్చితంగా ఫైల్స్ యొక్క ఫ్రాగ్మెంటేషన్ వలన అయి ఉండవచ్చు. కాబట్టి మీ HDD లో ఉన్న ఫైల్ లను డీ ఫ్రాగ్మెంటేషన్ చేయడం వలన మీ హార్డ్ డిస్క్ స్పీడ్ ను పెంచుకోవచ్చు.

ఉపయోగించని సాఫ్ట్ వేర్ ను క్లీన్ చేయండి.

మీ కంప్యూటర్ లో అనేక రకాల సాఫ్ట్ వేర్ లను మీరు ఇన్ స్టాల్ చేసి ఉండవచ్చు. అయితే మనం సాధారణంగా వాటిగురించి మరచిపోతాము. ఒక్కసారి వాడిన తర్వాత వాటి అవసరo మనకు ఉండకపోవచ్చు. అయితే వాటిని అన్ ఇన్ స్టాల్ చేయకుండా అలాగే ఉంచడం వలన అవి మన కంప్యూటర్ స్పీడ్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. కావున మన సిస్టం లో ఉన్న అవసరం లేని సాఫ్ట్ వేర్ లను ఎప్పటికప్పుడు అన్ ఇన్ స్టాల్ చేయడం మంచిది.

ఆటో స్టార్ట్ అప్ ప్రోగ్రాం లను చెక్ చేసుకోండి.

ఒక్కోసారి మీ లాప్ టాప్ బూట్ అప్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అటో స్టార్టింగ్ ప్రోగ్రామ్స్ కూడా దీనికి ఒక కారణం కావచ్చు. కాబట్టి మీరు మీ సిస్టం కు ఎలాంటి సాఫ్ట్ వేర్ పర్మిషన్ లు ఇచ్చారో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ ప్రోగ్రామ్స్ ఆటోమాటిక్ గా స్టార్ట్ అవడం ఇక అవసరం లేదు అనుకుంటే వాటిని తొలగించడమే మంచిది.

 మీ pc ని రీసెట్ చేసుకోండి

విండోస్ 10 ను వాడేవారికి ఇది సులభంగా సాధ్యం అయ్యే అంశం. pc రీసెట్ కోసం విండోస్ 10 లో డిఫాల్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎటువంటి CD లు, ISO లు లేకుండా మీ విండోస్ OS ను మీరు రీ ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.కొంత డేటా లాస్ అయినప్పటికీ ఇలా రీసెట్ చేసుకోవడం వలన మీ కంప్యూటర్ పెర్ఫార్మన్స్ మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీ చెక్ చేయండి

మీ లాప్ ట్యాప్ యొక్క బ్యాటరీ ని చెక్ చేసుకోవడానికి విండోస్ ఒక ఇన్ బిల్ట్ యుటిలిటీ ని కలిగి ఉంది.దీనిని ఉపయోగించి మీ బ్యాటరీ కరెంటు కెపాసిటీ,ఛార్జింగ్ పాటర్న్,బ్యాటరీ వేల్యూ లో తగ్గుదల లాంటివి మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. దీనిని బట్టి మీ బ్యాటరీ ని వాడే విధానాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది.

ఉపయోగించని పెద్ద పెద్ద ఫైల్ లను డిలీట్ చేయండి

మీ కంప్యూటర్ లో ఉపయోగించని పెద్ద సైజు లో ఉండే ఫైల్స్ ఉన్నాయా? అయితే మీకంపుటర్ స్లో అవ్వడానికి ఇది కూడా ఒక కారణం. ఉపయోగించని పెద్ద పెద్ద ఫైల్ లను కూడా ఎప్పటికప్పుడు మీ కంప్యూటర్ లోనుండి రిమూవ్ చేసుకోవడం ద్వారా పెర్ఫార్మన్స్ ను మెరుగుపరచుకోవచ్చు.

టాస్క్ మేనేజర్ ను గమనిoచండి.

విండోస్ టాస్క్ మేనేజర్ ను ఉపయోగించడం ద్వారా మీ కంప్యూటర్ లో ఇన్ స్టాల్ అయిన హెవీ డ్యూటీ ప్రోగ్రాం ల గురించి తెలుసుకోవచ్చు. మీ కంప్యూటర్ లో ఏవైనా అసాధారణ యాక్టివిటీ లు కనిపిస్తే టాస్క్ మేనేజర్ ను ఉపయోగించి చెక్ చేసుకోవాలి.

మీ RAM ను అప్ గ్రేడ్ చేసుకోండి

గూగుల్ క్రోమ్ లాంటి ప్రోగ్రాం లు RAM ను విపరీతంగా తినేస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీ RAM ను అప్ గ్రేడ్ చేసుకోవాలి. ర్యాం లో ఎప్పుడూ ఎక్స్ ట్రా స్లాట్ ఉండేలా చూసుకోవాలి. మీ RAM ఎంత ఫ్రీ గాఉంటే మీరు అంత ఫ్రీ గా పనులను చేసుకోగలుగుతారు.

క్లౌడ్ స్టోరేజ్ ను ఉపయోగించండి

ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ ను అందించే అనేకరకాల సర్వీస్ లు ప్రస్తుతం అందుబాటులో  ఉన్నాయి. దీనికి మీకు కావలసిందల్లా ఇంటర్ నెట్ కనెక్టివిటీ మరియు ఈ మెయిల్ ఐడి. మీ డేటా బ్యాక్ అప్ చేసుకోవడానికి క్లౌడ్ స్టోరేజ్ ను ఉపయోగించడం వలన మీ సిస్టం పై పడే అదనపు ఒత్తిడి తగ్గుతుంది.