• తాజా వార్తలు
  •  

ప్రతీ ఒక్క ఎమోజి గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ గైడ్ మీకోసం

ప్రస్తుత సోషల్ మీడియా లో ఎమోజిలు ఒక భాగం అయిపోయాయి. మన భావాలను వ్యక్తం చేయడానికి టెక్స్ట్ కు బదులు ఎమోజీ లను వాడుతూ ఉంటాము. అయితే చాలా వరకూ ఆయా ఎమోజి ల అసలు అర్థం మనకు తెలియదు. మనం వాడే ఎమోజీ లు వాటి యొక్క అసలు అర్థాల గురించి తెలియజేసే కొన్ని వెబ్ సైట్ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరిగింది.

Emojimeanings.com

మీరు వాడే ఎమోజి ల యొక్క అసలైన అర్థాలను ఈ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. ఇందులో సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీకు కావలసిన పదాన్ని టైపు చేస్తే దానికి సంబందించిన ఎమోజీ మీకు కనపడుతుంది. ఇందులో కేటగరీ, మోస్ట్ పాపులర్, న్యూ ఎమోజీ అనే మూడు సెక్షన్ లు ఉంటాయి. అంటే మీరు వర్డ్ టైపు చేయడం ద్వారా సెర్చ్ చేయవచ్చు మరియు కేటగరీ లో కూడా చూడవచ్చు.

emojipedia.org

ఎమోజీ లకు సంబందించిన దాదాపు ప్రతీ సమాచారాన్ని ఇచ్చే మరొక వెబ్ సైట్ ఈ emojipedia.org . ఇక్కడకూడా మీకు కావలసిన పదాన్ని టైపు చేసి దానికి సంబందించిన ఎమోజీ లను చూడవచ్చు. మరే వెబ్సైట్ కూడా ఇవ్వలేని రీతిలో ఇది మీకు ఎమోజిలకు సంబందించిన సమాచారాన్ని ఇస్తుంది.

iEmoji.com

సాధారణంగా ఎమోజి లు మన మొబైల్ లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. వీటిని కంప్యూటర్ లో వాడడానికి ఏ విధమైన డైరెక్ట్ మార్గం లేదు. దీనికి ఇన్ డైరెక్ట్ మార్గాన్ని ఈ వెబ్ సైట్ అందిస్తుంది. ఇక ఎమోజీ మీనింగ్ విషయానికొస్తే ఎమోజీ లకు సంబందించిన సమస్త సమాచారం ఇక్కడ ఉంటుంది.

whatmoji

ఎమోజీ మీనింగ్ లను కనుగొనడం లో ఒక ఫన్ వెబ్ సైట్ గా దీనిని చెప్పుకోవచ్చు. ఇది చిన్నదే గానీ చాలా సూటిగా ఉంటుంది. మీరు ఏదైనా ఎమోజీ కోసం సెర్చ్ చేసినపుడు దాని మీనింగ్ తో పాటు ఇతర సమాచారం కూడా మీకు లభిస్తుంది. ఇదంతా మీకు ఆ ఎమోజీ గురించిన ఒక స్పష్టమైన అవగాహనను  ఇస్తుంది.

emojimeanings.net

ఎమోజీ మీనింగ్ లను తెలుసుకోవడానికి ఇది ఒక మంచి వెబ్సైట్.. దాదాపు అన్ని వాట్స్ అప్ ఎమోజీ లకు ఇది మీనింగ్ లను అందిస్తుంది. మిగతావాటి లాగా ఇందులో సెర్చ్ టూల్ ఉండదు. ఎమోజీలు అన్నీ వివిధ రకాల కేటగరీ లలో లిస్టు చేయబడి ఉంటాయి. స్మైలీ, పీపుల్, యానిమల్స్, నేచర్ ఇలాంటి విభాగాలలో ఎమోజి లు ఉంటాయి.

HotEmoji.com

ఇక్కడ కూడా అన్ని ఎమోజీలు వివిధ కేటగరీ లలో లిస్టు చేయబడి ఉంటాయి. వాటి పక్కనే ఒక టెక్స్ట్ కూడా లేబుల్ చేయబడి ఉంటుంది. ఎమోజీ యొక్క అసలైన అర్థాన్ని ఈ లేబుల్ ఇస్తుంది. ఎమోజీ మీనింగ్ తో పాటు ఎమోజీ కాపీ అండ్ పేస్ట్, ఎమోజీ కీ బోర్డు అనే రెండు రకాల ఆప్షన్ లు కూడా ఇందులో ఉంటాయి.

Typography.guru

టైపోగ్రఫీ , లెటరింగ్, కాలిగ్రఫే లాంటివాటి గురించి నేర్చుకోవడానికి ఇది ఒక బెస్ట్ వెబ్ సైట్. వీటన్నింటితో పాటు ఎమోజీ లకు సంబందించిన సమాచారాన్ని కూడా ఇస్తుంది. ఇక్కడకూడా ఎమోజీ లు వివిధ కేటగరీలలో ఉంటాయి. వాటిలో మనకు కావలసిన ఎమోజీని చూడవచ్చు.

unicode.org

వివిధ రకాల లాంగ్వేజ్ లు, స్క్రిప్ట్ లు, సాఫ్ట్ వేర్ లు మరియు ఫ్లాట్ ఫాం ల గురించిన సమాచారాన్ని ఈ వెబ్ సైట్ అందిస్తుంది.వీటితో పాటు ఎమోజీ లకు సంబందించిన డేటా చార్ట్ కూడా ఇందులో ఉంటుంది.