• తాజా వార్తలు

మీ సొంత ఫాంట్ ఉచితంగా క్రియేట్ చేసుకోవడానికి గైడ్

మీ అంతట మీరే సొంతంగా ఫాంట్ లను ఉచితంగా క్రియేట్ చేసుకోవడానికి ఉన్న వెబ్ టూల్ ల గురించి ఈ ఆర్టికల్ లో ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఉపయోగించి మీరు గ్లిఫ్స్ ను డిజైన్ చేసుకోవచ్చు, టైప్ ఫేసెస్ ను క్రియేట్ చేయవచ్చు మరియు ఫాంట్ లను బిల్డ్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం .

ఫాంట్ స్ట్రక్ట్

ఇది చాలా సూటిగా ఉండే ఆన్ లైన్ ఫాంట్ క్రియేటర్ వెబ్ టూల్. దీనిని ఉపయోగించాలి అంటే ముందుగా మీరు ఒక ఎకౌంటు ను క్రియేట్ చేసుకోవాలి. ఆన్ లైన్ లో ఫాంట్ ను క్రియేట్ చేయడానికి ఇది చిన్న చిన్న జ్యామెట్రికల్ ఆకృతులను కలిగి ఉంటుంది. ఈ ఆకృతులను ఒక నిర్దిష్ట పద్దతి లో అమర్చడం ద్వారా మీకు కావలసిన క్యారక్టర్ లను క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కస్టమ్ ఫాంట్ ల కోసం డ్రా,ఎరేజ్, డ్రా లైన్, డ్రా రెక్టాoగిల్, సెలెక్ట్, పాన్ ది వ్యూ అనే 6 రకాల బేసిక్ టూల్ లను కలిగి ఉంటుంది.

ఫాంట్ ను క్రియేట్ చేసేందుకు ఎడిటర్ యొక్క అడుగు భాగం లో ఒక యూని కోడ్ బేసిక్ లాటిన్ క్యారెక్టర్ సెట్ ఉంటుంది. దీనిని సెలెక్ట్ చేసుకుని ఫాంట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి క్యారెక్టర్ సెట్ లు మొత్తం 20 ఉంటాయి. మీ ప్రోగ్రెస్ అంతా ఆన్ లైన్ లో సేవ్ చేయబడుతుంది. మీరు మీ ఫాంట్ ను ప్రివ్యూ చూసి నచ్చితే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది జిప్ ఫైల్ రూపం లో డౌన్ లోడ్ చేయబడుతుంది.

ప్రోటో టైపు

కస్టమ్ ఫాంట్ లను డిజైన్ చేయడానికి ఈ ప్రోటో టైపు అనేది ఒక ఆన్ లైన్ టూల్. ఒక యూనికోడ్ బేసిక్ లాటిన్ క్యారెక్టర్ సెట్ ఇందులో ఇన్ బిల్ట్ గా ఉంటుంది. 20 కంటే ఎక్కువ పారామీటర్ ల ద్వారా మీరు ప్రతీ క్యారెక్టర్ ను ఉపయోగించవచ్చు. ఈ పారామీటర్ లను 4 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి సెట్టింగ్, ఫంక్షన్, స్టైల్, సెరిఫ్. ప్రతీ పారామీటర్ లోనూ అనేకరకాల ఆప్షన్ లు ఉంటాయి. ఇన్ని రకాల కస్టమైజేషన్ ఆప్షన్ ల ద్వారా మీరు చాలా సులభంగా మీకు నచ్చిన ఫాంట్ ను క్రియేట్ చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసిన ఈ ఫాంట్ అనేది ఎక్స్ టెన్షన్ ద్వారా డైరెక్ట్ గా మీ వెబ్ సైట్ లేదా బ్లాగ్ కు ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఫాంట్ ను మీ కంప్యూటర్ కు ఎక్స్ పోర్ట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం దీని ప్రీమియం ప్యాక్ కు సబ్ స్క్రైబ్ చేసుకోవాలి.

బిట్ ఫాంట్ మేకర్ 2

ఇక్కడ మనం చెప్పుకుంటున్న లిస్టు లో అత్యంత వేగంగా ఫాంట్ లను సెలెక్ట్ చేసే ఆన్ లైన్ టూల్ ఈ బిట్ ఫాంట్ మేకర్ 2. ఇది దీనికి కుడి వైపున ఒక యూనికోడ్ బేసిక్ లాటిన్ క్యారెక్టర్ సెట్ ను కలిగిఉంటుంది. ఎడిటర్ లో డ్రా చేసేందుకు ఇక్కడ మీరు ఇక క్యారెక్టర్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యారెక్టర్ సెట్ క్రింద ఉండే ‘ డ్రా ‘ అనే బటన్ ను క్లిక్ చేయడం ద్వారా మీరు మీ ఫాంట్ ను ప్రివ్యూ చూసుకోవచ్చు. బిట్ మ్యాప్ క్యారెక్టర్ ను ఆటోమాటిక్ గా డ్రా చేసుకునేందుకు వాండ్ టూల్ ను ఇది కలిగిఉంటుంది. దీనికి ఏ విధమైన లాగ్ ఇన్ లు అవసరం లేదు. మీకు నచ్చిన ఫాంట్ ను మీరు ఉచితంగా క్రియేట్ చేసుకోవచ్చు.

ఫాంట్ ఆర్క్

ఇది కూడా ఒక వెబ్ బేస్డ్ ఆన్ లైన్ ఫాంట్ క్రియేటర్. ఆన్ లైన్ లో సరికొత్త ఫాంట్ లను క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక ఫుల్ ప్యాక్ సొల్యూషన్ లను కలిగి ఉంటుంది. ఇందులో అనేకరకాల ప్రొఫెషనల్ టూల్ లు ఉంటాయి. ఈ టూల్ లతో ఎలా ఫాంట్ లను క్రియేట్ చేసుకోవాలో తెలిపేందుకు ఒక క్రమ పద్దతితో కూడిన వీడియో ట్యుటోరియల్ లు కూడా అందుబాటులో ఉంటాయి. దీనిని ఉపయోగించి ఒక అందమైన ఫాంట్ ను క్రియేట్ చేసుకోవడమే గాక ఇన్ స్టంట్ గా ప్రివ్యూ ను కూడా చూడవచ్చు. ఒక్క క్లిక్ తో షాడో లను మరియు అవుట్ లైన్ లను యాడ్ చేసుకోవచ్చు.ఓపెన్ టైపు ఫాంట్ ఫార్మాట్ లో మీ ఫాంట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇది పూర్తి ఉచితంగా లభిస్తుంది కానీ గూగుల్ క్రోమ్ మరియు సఫారీ బ్రౌజర్ లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

గ్లిఫర్ స్టూడియో

ఈ టూల్ ద్వారా మీరు ఫాంట్ లను క్రియేట్ చేసుకోవడమే గాక ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఒక ఫాంట్ ఎడిటర్ కు ఉండవలసిన బేసిక్ ఫీచర్ లు అన్నీ దీనికి ఉన్నాయి. క్యారెక్టర్ డిజైన్ లో లేయర్ లు క్రియేట్ చేసుకోవచ్చు, గ్లిఫ్స్ షేప్ లను ఒకే మొత్తం లో ట్రాన్స్ ఫాం చేసుకోవచ్చు, కస్టమ్ గైడ్ లైన్ లను క్రియేట్ చేయవచ్చు మరియు యాక్షన్ హిస్టరీ ని చూడగలగడం లాంటి ఎన్నో రకాల పనులను ఇక్కడ చేయవచ్చు.

ఎడిటింగ్ టూల్స్, కంపోనెంట్, టెస్ట్ డ్రైవ్, లిగేచర్, కెర్నింగ్, ఇంపోర్ట్ SVG, యూనికోడ్ –ఎ- పలూజా, టు స్క్రీన్ మోడ్ లాంటి అనేక రకాల టూల్ లు ఇందులో ఉంటాయి.

కాలిగ్రాఫర్

హ్యాండ్  రిటెన్ ఫాంట్ లను క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ వెబ్ సైట్. ఇక్కడ మీ హ్యాండ్ రిటెన్ క్యారెక్టర్ లను వెక్టార్ ఫాంట్ ల లాగా మార్చుకోవచ్చు.దీనికంటే ముందు మీరు ఇందులో ఎకౌంటు ను క్రియేట్ చేసుకోవాలి. ఆ తరవాత న్యూ ఫాంట్ ను సెలెక్ట్ చేసుకుని టెంప్లేట్ PDF ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఈ పిడిఎఫ్ లో యూనికోడ్ లాటిన్ క్యారెక్టర్ సెట్ ఉంటుంది. మీరు ప్రతీ క్యారెక్టర్ ను డ్రా చేసిన ప్రతీసారీ పిడిఎఫ్ ను సేవ్ చేసుకోవాలి. టెంప్లేట్ పిడిఎఫ్ ను అప్ లోడ్ చేసిన తర్వాత మళ్ళీ కాలిగ్రాఫర్ కు తిరిగి రావాలి. ఇది మీ హ్యాండ్ రిటెన్ క్యారెక్టర్ లను పరిశోదించి వాటితో ఒక ఫాంట్ ను తయారుచేస్తుంది. మీ ఫాంట్ ను మీరు ఆన్ లైన్ లో ప్రివ్యూ చేయవచ్చు.

 

జన రంజకమైన వార్తలు