• తాజా వార్తలు
  •  

చిటికెలో మీ ఐడి కార్డును మీరే తయారుచేసుకోవడానికి గైడ్

 

పాఠశాల ఐడి కార్డులు, ఆర్గనైజేషన్ ఐడి కార్డులు, బిజినెస్ కార్డులు...ఇలా చాలా చూస్తుంటాం. వీటిని తయారు చేసేందుకు చాలా ఖర్చు చేస్తాం. కానీ పైసా ఖర్చు లేకుండా ఆన్ లైన్లో ఫ్రీగా ఐడి కార్డులను తయారుచేసే వెబ్ సైట్లు చాలా ఉన్నాయి. అందులో కొన్ని బెస్ట్ వెబ్ సైట్స్ మీకోసం.

1. ID FLOW....

ఇది విండోస్ కోసం తయారు చేసిన ఫ్రీ ఐడి కార్డ్ మేకర్ సాఫ్ట్ వేర్. ఈ సాఫ్ట్ వేర్ను స్కూల్, కాలేజ్, ఎంప్లాయిస్, ఇతర ప్రొఫెష్నల్స్ కోసం ఐడి కార్డులను డిజైన్ చేసేందుకు ఉపయోగిస్తారు. అంతేకాదు దీంతో సెమీ కస్టమ్, ఫుల్ కస్టమ్ ఐడీ కార్డును కూడా క్రియేట్ చేయవచ్చు. ఒక ఐడి కార్డును క్రియేట్ చేయాలంటే.... దానిపై ఉద్యోగికి సంబంధించిన పూర్తి వివరాలను యాడ్ చేయాలి. మీకు నచ్చిన కలర్స్, ఫాంట్స్, టెక్ట్స్, ఇమేజ్, సైజ్ తో ఐడి కార్డును తయారు చేసుకోవచ్చు. డిజైన్ను పూర్తి చేసినక...PDF పైల్గా కూడా సేవ్ చేసుకోవచ్చు.

సెమీ కస్టమ్ ఐడి కార్డును క్రియేట్ చేయాలంటే...వర్క్ స్టేషన్ మెనూలోకి వెళ్లి....మీకు కావాల్సిన ఆఫ్షన్స్ సెలక్ట్ చేసుకోవాలి. అందులో ఐడి మెనేజ్ మెంట్, ఐడి కార్డ్ మేకింగ్ ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో ఉన్న ఆప్షన్స్ నుంచి సెలక్ట్ చేసుకుని ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, టైటిల్, డిపార్ట్ మెంట్ ఇలాంటి వివరాలన్నింటిని నమోదు చేయాలి. ఇప్పుడు కార్డుపై ఉద్యోగి ఫోటోను కూడా యాడ్ చేయాలి. ఇలా పూర్తి చేసిన ఐడి కార్డును ప్రింట్ ఆఫ్షన్ ద్వారా PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు.

కొత్త డిజైన్ ఫైల్, డేటాబేస్ సెట్టింగ్స్, కార్డ్ టెంప్లేట్ PVC, పేపర్ బ్యాడ్జ్స్, రిపోర్ట్ షిట్లు కూడా క్రియేట్ చేసుకున్నాక PDF ఫార్మాట్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

2. CardDesir

ఇది విండోస్ కోసం మరో ఫ్రీ ఐడి కార్డు మేకర్ సాఫ్ట్ వేర్. దీన్ని ఉపయోగించి మీకు కావాల్సిన ఐడి కార్డులను తయారు చేయవచ్చు.

ఐడి కార్డులను డిజైన్ చేయడానికి, ఫ్రీవేర్ ఎడిటింగ్ సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్ ఒకేసారి ఐడి కార్డుకు ముందు, వెనక భాగాన్ని డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇమేజ్, బార్ కోడ్, టెక్స్ట్ యాడ్ చేయడం వంటివి సాఫ్ట్ వేర్ లోని టూల్ బార్లో ఉంటాయి. టెక్ట్స్, ఇమేజ్, బ్యాక్ గ్రౌండ్ కు సంబంధించి ఎడిటర్ యాడ్ చేసినప్పుడు, కొత్త సెట్టింగ్స్ ప్యానెల్ ద్వారా ఇంటర్పేస్ కుడివైపు ఓపెన్ చేయబడుతుంది. మీరు ఐడికార్డు డిజైన్ పూర్తిచేశాక, ఫాంట్, కలర్ ఫాంట్, బ్రైట్నెస్, కలర్ అడ్జెస్ట్ మెంట్స్ , ఎక్స్ ప్లోజర్ వంటివి కార్డు ప్రాపర్టిస్ ను మార్చుకోవచ్చు. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా క్రియేట్ చేసిన ఐడి కార్డును ప్రింట్ ఆప్షన్ ఉపయోగించిన PDF ఫైల్ గా సేవ్ చేయరాదు.

3. Formtec design pro....

ఫార్మ్ టెక్ డిజైన్ ప్రో అనేది విండోస్ కోసం రూపొందించిన మరో ఫ్రీ ఐడి కార్డ్ మేకర్ సాఫ్ట్ వేర్. ఈ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఐడి కార్డులతోపాటు, బిజినెస్ కార్డులు, మీడియా లేబుల్లు, బార్ కోడ్ లేబుల్లు, ఫోటో స్టిక్కర్లు ఇలా వాటికి సంబంధించిన కార్డులను క్రియేట్ చేయవచ్చు.

సాఫ్ట్ వేర్ ను ఓపెన్ చేసినప్పుడు...ఎలాంటి కార్డును డిజైన్ చేస్తారని అడుగుతుంది. మీకు కావాల్సిన ఐడి కార్డును ఎంచుకోండి. ఉద్యోగి ఫోటో, వ్యక్తిగత సమాచారం, బ్యాక్ గ్రౌండ్ కలర్ ఇలాంటివి కార్డు క్రియేట్ చేయడానికి అడుగుతుంది. ఇలా అన్ని వివరాలతో పూర్తి చేశాక, ఐడి కార్డును ప్రివ్యూ రూపంలో కూడా చూడవచ్చు. ఐడి కార్డును సేవ్ చేయడానికి మీకు కావాల్సిన ఆప్షన్స్ ఉపయోగించి సేవ్ చేసుకోవచ్చు.

4. Clickable card....

ఇది విండోస్ కోసం ఫ్రీ, పోర్టబుల్ ఐడి కార్డు తయారుచేసే సాఫ్ట్ వేర్. ఐడి కార్డులు, బ్యానర్లు, బిజినెస్ కార్డులను క్రియేట్ చేయడానికి సాఫ్ట్ వేర్ చాలా సులభంగా ఉంటుంది. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ఐడి కార్డును క్రియేట్ చేశాక... AAC ప్రాజెక్ట్ ఫార్మాట్లో ఐడి కార్డును సేవ్ చేసుకోవచ్చు. లేదా దానిని ఒక ఇమేజ్ JPG, BMP, GIFగా కూడా షేర్ చేసుకోవచ్చు. దీన్ని బెస్ట్ సాఫ్ట్ వేర్ గా గుర్తించినప్పటికీ.... ఇందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి.

5. ఫ్రీ బిజినెస్ కార్డ్ మేకర్.....

విండోస్ ద్వారా ఫ్రీగా బిజినెస్ కార్డు తయారు చేసేందుకు ఇది బెస్ట్ సాఫ్ట్ వేర్. ఐడి కార్డును డిజైన్ చేయడానికి సులభంగా ఉంటుంది. యూజర్ ఇమేజ్, వ్యక్తిగత సమాచారం, కార్డు సైజ్ యాడ్ చేయడానికి అవసరమైన టూల్స్ అన్నీకూడా అందుబాటులో ఉంటాయి.

ఐడికార్డును డిజైన్ చేసే ముందు, మీరు సెట్టింగ్స్ లో మెను నుండి ఎత్తు/వెడల్పు, కార్డు కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు. తర్వాత మీకు కావాల్సిన టెక్ట్స్ ఇమేజ్ యాడ్ చేయాలి. ఇలా కార్డును పూర్తి చేసిన తర్వాత ప్రింట్ ఆప్షన్ ద్వారా Fbcrd ఫార్మాట్ కానీ PDFగా కానీ సేవ్ చేయవచ్చు.

 

 

జన రంజకమైన వార్తలు