• తాజా వార్తలు
  •  

గైడ్‌: డేటా ఓన్లీ సిమ్‌ల‌కు ఓన్లీ వ‌న్ గైడ్‌

మొబైల్ డేటా వాడ‌ని ఫోన్లు ఇప్పుడు క‌న‌బ‌డుతున్నాయా? అస‌లు ఇంట‌ర్నెట్ వాడ‌కం లేని ఫోన్ వినియోగ‌దారులు ఉన్నారా?.. చివ‌రికి ప‌ల్లెల్లో సైతం డేటా వాడ‌కం పెరిగిపోయింది. ముఖ్యంగా జియో వ‌చ్చిన త‌ర్వాత డేటాకు అర్ధ‌మే మారిపోయింది. ఒక‌ప్పుడు డ‌బ్బులు ఉన్న‌వాళ్లు మాత్రమే ఇంట‌ర్నెట్ వాడ‌గ‌ల‌ర‌ని.. సామాన్యులు వాడ‌లేర‌ని అనుకునేవాళ్లు కానీ ఎవ‌రైనా ఇంట‌ర్నెట్ వాడొచ్చ‌ని.. డేటాను ఉచితంగా ఇచ్చేసింది జియో. అంతేకాదు ఇప్పుడు ప్రత్యేకించి డేటా ఓన్లీ సిమ్‌లు కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. వీటి ప‌ని కేవ‌లం డేటా అందించ‌డ‌మే. మ‌రి ఏంటి ఈ డేటా ఓన్లీ సిమ్‌లు. ఏమా కథ క‌మామిషు చూద్దామా..

వాడకం చాలా సరళం 
సాధార‌ణంగా సిమ్ కార్డులు ఎక్క‌డ వాడ‌తారా? ఏంటి ప్ర‌శ్న అనుకుంటున్నారా! కానీ డేటా ఓన్లీ సిమ్‌ల‌కు మామూలు సిమ్‌ల‌కు ఇక్క‌డే తేడా ఉంది మ‌రి. ఇది కేవ‌లం ఫోన్లో మాత్ర‌మే కాదు ల్యాప్‌టాప్‌, ట్యాబ్స్‌లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవ‌చ్చు. అయితే ఇది కేవ‌లం వైఫై ఉంటేనే ప‌ని చేస్తుంది. ఇది ఎంతో స‌ర‌ళ‌మైన‌, సుల‌భ‌మైన ఆప్ష‌న్‌గా నిపుణులు చెబుతున్నారు. త‌క్కువ క‌నెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోనూ మ‌న‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా డేటాను అందించ‌గ‌ల‌గ‌డం ఈ  సిమ్‌ల మ‌రో ప్ర‌త్యేక‌త‌.

ఏంటి ప్ర‌త్యేక‌త‌లు
ఫ్లెక్సిబిలిటి దీనిలో ఉన్న‌ ఈ డేటా ఓన్లీ సిమ్‌ల‌తో మీరు కాంట్రాక్ట్స్ టెర్మ్‌, డేటా కెపాసిటీ, నెట్‌వ‌ర్క్‌, డివైజ్‌ల‌ను మీరే ఎంచుకునే అవ‌కాశం ఉంటుంది. అంతేకాదు ప్ర‌త్యేకించి సిమ్ కార్డును కొన‌డం వ‌ల్ల మీరు అనుకున్న డివైజ్‌లో దీన్ని వాడుకోవ‌చ్చు. అంతేకాదు మీకు కావాల్సిన డివైజ్‌లోకి స్విచ్ కూడా చేసుకోవ‌చ్చు. మీరు డివైజ్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవ‌డానికి కూడా మ‌రింత స్వేచ్ఛ ఉంటుంది. మంత్లీ రోలింగ్ కాంట్రాక్ట్స్ ప్రాతిప‌దిక‌న మీరే  డేటాను పొందొచ్చు.  ఎంత డేటా కావాల‌నేది మీ ఇష్టం.  డ్యుయ‌ల్ సిమ్ ఆప్ష‌న్ కూడా దీనిలో ఉంది.  దీని వ‌ల్ల బిజినెస్, ప‌ర్స‌న‌ల్ సిమ్‌ల‌ను మెయిన్‌టెన్ చేయ‌చ్చు.

ఎక్క‌డ వాడొచ్చంటే..
ఫోన్లు..  డేటా సిమ్‌ల‌ను వాడ‌టానికి ఫోన్ల‌కు మించి ఆప్ష‌న్ వేరేది లేదు. దీని వ‌ల్ల యూజ‌ర్లు 3జీ డేటాను ప్యాకేజ్ ద్వారా పొందొచ్చు.  ఇప్పుడు డేటా సిమ్‌ల కోసం ఎన్నో ప్యాకేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. మ‌న‌కు అవ‌స‌ర‌మైన ప్యాక్‌ను ఎంచుకోవ‌చ్చు. ట్యాబ్లెట్ల‌లోనూ డేటా సిమ్‌ల‌ను వాడుకోవ‌చ్చు. ఐప్యాడ్‌లు కూడా యూసేజ్‌కు అనువైన‌వే. ఇదే కాదు ల్యాప్‌టాప్‌కు కూడా వాడుకునే అవ‌కాశం ఉండ‌డం కూడా ఈ డేటా సిమ్‌ల  మ‌రో ప్ర‌త్యేక‌త‌. ప‌ర్స‌న‌ల్ యూజ్‌కు మాత్ర‌మే కాదు ఆఫీస్ అవ‌స‌రాల‌కు కూడా ఈ డేటా సిమ్‌ల‌ను ల్యాప్‌టాప్‌ల‌కు క‌నెక్ట్ చేసుకుని వాడుకునే అవ‌కాశం ఉంది.

విజ్ఞానం బార్ విశేషాలు