• తాజా వార్తలు

హార్డ్ డ్రైవ్ ఫెయిల‌యితే ఏం చేయాలో చెప్పే గైడ్

క్లౌడ్ కంప్యూటింగ్ వ‌చ్చాక కూడా మ‌నలో చాలా మంది హార్డ్ డిస్క్‌ల‌ను వ‌దులుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. 1టీబీ హార్డ్ డిస్క్ కూడా 4వేల‌కే దొరుకుతుండ‌డం, ఎక్క‌డికైనా ఈజీగా తీసుకెళ్ల‌గ‌లిగే సౌక‌ర్యం, మీ ఫైల్స్ మీ ద‌గ్గ‌రే సేఫ్‌గా ఉంటాయ‌న్న భ‌రోసా, ఇంట‌ర్నెట్ క‌నెక్టివిటీ లేక‌పోయినా హార్డ్‌డిస్క్‌లో స్టోర‌యిన వాటిని యాక్సెస్ చేసుకోగలిగే ఫెసిలిటీ , క్లౌడ్‌లో మాదిరిగా స‌బ్‌స్క్రిప్ష‌న్ ఫీజులు, మంత్లీ రెంట‌ల్స్ బాధ లేక‌పోవ‌డం.. ఇవ‌న్నీ  హార్డ్ డిస్క్‌మీద మ‌న న‌మ్మ‌కానికి కార‌ణాలు . కానీ విలువైన డేటా దాచుకున్న హార్డ్‌డిస్క్ ఫెయిల‌యితేవామ్మో ఊహించ‌డమే క‌ష్టం క‌దా.. అయితే అలా ఫెయిల‌యినా మన మార్గాలు మ‌న‌కున్నాయి. 

 ఫెయిల్యూర్‌ను ఎలా నిరోధించాలి

* క్వాలిటీ హార్డ్‌డిస్క్ నే కొనండి.

* ఫిజిక‌ల్ డ్యామేజ్ నుంచి కాపాడుకోవాలంటే స్లిమ్‌గా ఉండేవాటికంటే  ర‌ఫ్ ప్రొఫైల్ ఉన్న‌వాటినే సెలెక్ట్ చేసుకోండి.  మిల‌ట్రీ గ్రేడ్ టాప్ ప్రొడ‌క్ష‌న్ ఉన్న Transcend StoreJet 25M3 లాంటివి మంచి హార్డ్‌డిస్క్ అని ఎక్స్‌ప‌ర్ట్‌లు చెబుతున్నారు. 

ఒక వేళ ఫెయిల్ అయితే.. 

అప్ప‌టికీ మీ హార్డ్‌డిస్క్ ఫెయిల‌యితే త‌క్ష‌ణం చేయాల్సిన ప‌నులివీ

1. మీ డివైస్ వారంటీలో ఉందోలేదో చూసుకోండి. చాలా హార్డ్‌డిస్క్ ల‌కు కంపెనీలు క‌నీసం మూడేళ్ల వారంటీ ఇస్తాయి. వారంటీలో ఉంటే కంపెనీని క‌న్స‌ల్ట్ చేస్తే రిపేర్ లేదా రీప్లేస్ చేస్తారు. 

2. అలా కంపెనీకి మీ హార్డ్‌డిస్క్ ఇచ్చేట‌ప్పుడు మీ డేటాను రిట్రీవ్ చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి. మీరు డేటాను ఆల్రెడీ వేరేచోట బ్యాక‌ప్ తీసుకుంటే వెల్ అండ్ గుడ్‌. మీ డేటాను మీరు పీసీ నుంచి పూర్తిగా డిలీట్ చేస్తే ఏంచేయ‌లేక‌పోవ‌చ్చుగానీ  ఆ ప్రాసెస్‌లో మీరురెండు, మూడుసార్లు ఎక్క‌డైనా రైట్ చేసి ఉంటే మీ ఫైల్ రిక‌వ‌రీ సాధ్య‌మే.  మీ కంప్యూట‌ర్‌లో హార్డ్ డ్రైవ్ యుటిలిటీని ఓపెన్ చేసి ఆ యుటిలిటీ మీ డ్రైవ్‌ను రిక‌గ్నైజ్ చేస్తుందో లేదో అబ్జ‌ర్వ్ చేయండి.  విండోస్‌లో అయితే    Mini Tool Partition Wizardనుమ్యాక్ లేదా లిన‌క్స్‌లో అయితే  Disk Utility appను దీనికి ఉప‌యోగించుకోవ‌చ్చు.  మీ డ్రైవ్ ఆ ప్రోగ్రామ్‌లో క‌నిపిస్తే అది క‌రెప్ట్ అయినట్టే. వెంట‌నే దాన్నిఫార్మాట్ చేయండి.  కనిపించ‌క‌పోతే అది సీరియ‌స్ ప్రాబ్లం కాబ‌ట్టి టెక్నీషియ‌న్‌కు ఇవ్వండి. 

3.   హార్డ్ డ్రైవ్ ఫార్మాట్ అయి తిరిగి ఫంక్షనింగ్ ప్రారంభించాక రిక‌వరీ ప్రాసెస్‌ను స్టార్ట్ చేయండి.  విండోస్‌లో అయితే  Recuva,   మ్యాక్‌లో అయితే  Stellar Phoenix Data Recovery ఆప్ష‌న్లు ఉప‌యోగించుకోండి. రిక‌వ‌రీకి కొన్నిగంట‌ల టైం ప‌డుతుంది కాబ‌ట్టి మీరు ప‌డుకునేముందు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మార్నింగ్‌క‌ల్లా రిక‌వ‌రీ పూర్త‌వుతుంది.

4. మీ డ్రైవ్‌ను ప్ల‌గిన్ చేసి ప్రోగ్రామ్‌ను లంచ్ చేయండి. మీ ఫైల్స్‌లో 70 -80% రిక‌వ‌ర్ అవుతాయి. కానీ మొత్తం పోయిన‌దానికంటే ఇది చాలా బెట‌ర్ క‌దా. 

ఏమైనా డేటా లాస్ అయితే చాలా ఇబ్బంది కాబ‌ట్టి డ్రైవ్స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బ్యాక‌ప్ తీసుకోవ‌డం మ‌ర్చిపోకండి. 

జన రంజకమైన వార్తలు