కాలింగ్ యాప్స్ రేస్‌లో గూగుల్ రోజుకో కొత్త ఫెసిలిటీ తెస్తోంది. ఇప్పటికే గూగుల్ అలో, డుయోలు వాయిస్ కాల్స్ కోసం, చాట్ అండ్ మీట్ కోసం హ్యాంగవుట్స్‌ను తీసుకొచ్చిన గూగుల్ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది.అవతలి వ్యక్తికి గూగుల్ డుయో యాప్ లేకపోయినా కూడా మీరు మీ ఫోన్లోని డుయో యాప్ ద్వారా వాళ్లకు కాల్ చేయొచ్చు.
డుయో లేకున్నా ఉన్నట్లే..
గూగుల్స్యాప్ ప్రివ్యూ మెసేజింగ్ ఫీచర్ ద్వారా గూగుల్డుయో లాంటి యాప్స్ మీ ఫ్రెండ్ ఫోన్లో లేకపోయినా కూడా మీ ఫోన్లో ఉంటే చాలు ఆ యాప్ ద్వారా మీరు వాళ్లకు మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. డుయో యాప్ లేనివారికి కాల్చేసినా కూడా సేమ్ యాప్ ఉన్నవారికి ఎలా స్క్రీన్ మీద కాల్ కనిపిస్తుందో అలాగే కాల్ కనిపిస్తుంది.మీరు దాన్నిఆన్సర్ చేయొచ్చు. హ్యాంగ్చేయోచ్చు లేదంటే మెసేజింగ్ ఆప్షన్‌కు మార్చవచ్చు. అయితే కాల్ అయిపోయాక డుయో యాప్ ఇన్స్టాల్ చేసుకోమని మీకు ఓ రిక్వెస్ట్ కనిపిస్తుంది. మీకు నచ్చకపోతే ఆ కాలర్ మళ్లీ కాల్ చేయకుండా బ్లాక్ కూడా చేయొచ్చు.
ప్రమోషన్లో కొత్త పద్ధతి
గూగుల్ తన డుయో యాప్‌ను ప్రమోట్ చేయడానికి ఈ పద్ధతిని అనుసరిస్తోంది. యాప్ లేనివాళ్లకు కూడా కాల్ అందించి, ఆ తర్వాత యాప్ ఇన్స్టాల్ చేసుకోమని చెబుతోంది. అయితే ఇలా ఆండ్రాయిడ్‌లో మాత్రమే అవతలి వారికి యాప్ లేకున్నా కాల్చేయగలం. ఐవోఎస్ యూజర్లకు ఈ ఫెసిలిటీ అందుబాటులో లేదు.