• తాజా వార్తలు

ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్‌లో  వాడ‌కుండా మిగిలిన డేటా ఎంతో తెలుసుకోవ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

మీరు ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ వాడుతున్నారా?  మీకు రోజువారీ డేటా యూసేజ్  త‌క్కువ‌గానే ఉందా?  లేదంటే ఈ మ‌ధ్య‌లో అవుటాఫ్ స్టేష‌న్ వెళ్ల‌డం వ‌ల్ల మీ డేటా పెద్ద‌గా ఖ‌ర్చ‌వలేదా?  కానీ ఏం చేస్తాం?  బిల్ సైకిల్ కంప్లీట్ అవ‌గానే అలా వాడ‌కుండా మిగిలిపోయిన డేటా అంతా పోయిన‌ట్లేక‌దా. ఇలా చాలా మంది బాధ‌ప‌డుతుంటారు. అయితే ఇలాంటి అన్‌యూజ్డ్ డేటాను త‌ర్వాత నెల‌కు క్యారీ ఫార్వ‌ర్డ్ చేసుకునేందుకు ఎయిర్‌టెల్ డేటా రోల్ఓవ‌ర్ స్కీం తీసుకొచ్చింది.

మొబైల్ యూజ‌ర్ల‌తో మొద‌లైంది
గ‌త సంవ‌త్స‌రం జులైలో ఎయిర్‌టెల్ త‌న పోస్ట్‌పెయిడ్ మొబైల్ యూజ‌ర్ల‌కు  ఈ డేటా రోల్ఓవ‌ర్ స్కీమ్‌ను తీసుకొచ్చింది.దీంతో మీరు వాడ‌కుండా మిగిలిపోయిన డేటా త‌ర్వాత నెల మీ డేటాలో యాడ్ అవుతుంది. 200జీబీ వ‌ర‌కు ఇలా అన్‌యూజ్డ్ డేటాను క్యారీ ఫార్వ‌ర్డ్ చేసుకోవ‌చ్చు. ఇప్పుడు అదే స్కీమ్‌ను హోం బ్రాడ్‌బ్యాండ్ యూజ‌ర్ల‌కు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్రాడ్‌బ్యాండ్ యూజ‌ర్లు 1000 జీబీ వ‌ర‌కు డేటాను త‌ర్వాత నెల‌కు క్యారీ ఫార్వ‌ర్డ్ చేసుకోవ‌చ్చు. మ‌న ప్లాన్ కంటే ఎక్కువ డేటా అవ‌స‌ర‌మైన‌ప్పుడు టాప్ అప్‌చేయించుకునే ప‌ని లేకుండా వీటిని వాడుకోవ‌చ్చు. అంతెందుకు  వ‌చ్చే నెల‌లో పిల్ల‌ల‌కు స‌మ్మ‌ర్ హాలీడేస్ ఇచ్చేస్తారు. వాళ్లు ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడుకున్నా దీంతో డేటా అయిపోద్ద‌ని బాధ‌ప‌డ‌క్క‌ర్లేదు.
ఎలా చూసుకోవాలి?
MyAirtel యాప్‌లో  ఈఫీచ‌ర్ ఉండేది. అయితే దాన్ని ఇటీవ‌ల రిమూవ్ చేసింది. అయితే డెస్క్‌టాప్‌, మొబైల్‌లో మీ డేటా యూసేజ్ తెలుసుకోవ‌డానికి మార్గాలివీ..
డెస్క్‌టాప్‌లో.. 
www.airtel.in/smartbyte-s/page.htmlలోకి వెళ్లండి. ఆ వెబ్‌పేజీ మీ అకౌంట్ డిటెయిల్స్‌, క‌రెంట్ బిల్ సైకిల్‌తోపాటు ఎంత డేటా యూజ్ చేశారు? ఎంత డేటా క్యారీ ఓవ‌ర్ అయిందీ చూపిస్తుంది. మొబైల్ యూజ‌ర్లు  Smartbytes సైట్‌ను త‌మ ఫోన్ హోం స్క్రీన్ మీద షార్ట్ క‌ట్‌గా పెట్టుకుంటే యూసేజ్‌ను త‌ర‌చుగా చెక్ చేసుకోవ‌డం ఈజీ అవుతుంది. 
ఆండ్రాయిడ్ యాప్‌లో..
Home Broadband Usage అనే ఆండ్రాయిడ్ యాప్‌తో మీ బ్రాడ్‌బ్యాండ్ డేటా యూసేజ్ డిటెయిల్స్‌ను మీ మొబైల్ ద్వారానే తెలుసుకోవ‌చ్చు. ఈ యాప్  మీ ఎయిర్‌టెల్ అకౌంట్లోకి లాగిన్ అయ్యే ప‌ని లేకుండానే ఎయిర్‌టెల్ స్మార్ట్‌బైట్స్ వెబ్‌పేజీ ద్వారా మీ అకౌంట్‌లోని టోట‌ల్ మంత్లీ డేటా, యూజ్డ్ అండ్ రిమైనింగ్ హై స్పీడ్ డేటా,  బిల్ సైకిల్ ఎన్ని రోజులు ఉంది?  రిక‌మండెడ్ రోజువారీ యూసేజ్ అయింది?  యావ‌రేజ్‌న రోజుకు ఎంత వినియోగిస్తున్నారు వంటి వివ‌రాల‌న్నీచూపిస్తుంది.

జన రంజకమైన వార్తలు