• తాజా వార్తలు
  •  

మీ ఐ ఫోన్ లేటెస్టా, రీఫ‌ర్బిష్డా లేక రీ ప్లేస్‌డ్ అని నిర్ధారించుకోవ‌డం ఎలా?

 


 మీరు ఐఫోన్ కొన్నారు.. లేదంటే ఎవ‌రో మీకు గిఫ్ట్‌గా ఇచ్చారు. అయితే అది కొత్త ఫోనా, రీఫ‌ర్బిష్‌డ్ ఫోనా, రీప్లేస్ చేసిందా తెలుసుకోవ‌డానికి ఓ ట్రిక్ ఉంది. అదేంటి ఎవ‌రో అభిమానంతో గిఫ్ట్ ఇస్తే అలా ఎందుకు అనుకోవాలి?  అయినా నేను కొత్త ఫోన్ కొన్న‌ప్పుడు ఆ డౌటెందుకు రావాలి? అని ప్ర‌శ్నిస్తున్నారా? అయినా ఓసారి చెక్ చేసుకుంటే లాసేమీ లేదు క‌దా..అదీకాక మ‌న‌కు ఆ ఫోన్ స్టేట‌స్ ఏంటో కూడా క‌చ్చితంగా తెలిసిపోతుంది కూడా.
ఎలా తెలుసుకోవాలంటే..
1.ఐఫోన్‌లో Settings యాప్‌ను ఓపెన్ చేయండి.
2. General సెక్ష‌న్‌లోకి అక్క‌డి నుంచి About లోకి వెళ్లండి
3. Model చూడండి. ఆ టెక్స్ట్ త‌ర్వాత MN572LL/A ఇలా ఒక ఆల్ఫాన్యూమ‌రిక్ కోడ్ ఒక‌టి ఉంటుంది. దీన్నే మోడ‌ల్ ఐడెంటిఫైయ‌ర్ అంటారు. ఇందులో ఫ‌స్ట్ అక్ష‌రమే మీ ఫోన్ కొత్త‌దా, పాత‌దా చెప్పేస్తుంది. 
M – అని ఉంటే అది బ్రాండ్ న్యూ డివైస్‌. 
F – అని ఉంటే అది రీఫ‌ర్బిష్డ్ పీస్‌. అంటే రీఫ‌ర్బిష్ చేసి ఆ ఫోన్ మీకు అమ్మారు.
N – అంటే రీప్లేస్‌మెంట్ డివైస్‌. ఒరిజిన‌ల్ డివైస్‌ను ఏదైనా ప్రాబ్లం వ‌చ్చి స‌ర్వీస్‌కి ఇస్తే దాన్ని రీప్లేస్ చేసి ఈ ఫోన్ ఇచ్చార‌ని అర్ధం
P – ఇది ప‌ర్స‌న‌లైజ్డ్ డివైజ్‌. అంటే  ఫోన్ కొన్నాక ప‌ర్స‌న‌లైజ్ చేయ‌బడింద‌ని అర్ధం.

జన రంజకమైన వార్తలు