• తాజా వార్తలు
  •  

జియో టీవీ, జియో సినిమాను కంప్యూట‌ర్లో వీక్షించ‌డం ఎలా? 

జియో అంటే చౌకగా డేటా, కాల్స్ ఇవే గుర్తొస్తాయి. ఇప్పుడు జియోతో పోటీగా మిగిలిన కంపెనీల‌న్నీ ఇలాంటి ఆఫ‌ర్లు తెచ్చినా ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ జియోనే కొట్టేసింది. అయితే జియో కాల్స్‌, డేటా స‌ర్వీస్‌ల‌తోపాటు జియో సినిమా, జియో టీవీలాంటి వీడియో స్ట్రీమింగ్ సర్వీసులు కూడా బాగానే ఆక‌ట్టుకుంటున్నాయి.  జియో టీవీలో ర‌క‌ర‌కాల ఛాన‌ళ్ల‌లో ప్రసార‌మ‌య్యే షోల‌ను చూడొచ్చు. అలాగే జియో సినిమాలో వివిధ భాష‌ల సినిమా కాట‌లాగ్ ఉంటుంది. దానిలో నుంచి కావాల్సిన సినిమాను సెలెక్ట్ చేసుకుని ఫ్రీగా చూడొచ్చు. వీటికి కావల్సింద‌ల్లా మీ జియో ఫోన్‌లో నెట్ బ్యాల‌న్స్ మాత్ర‌మే. అయితే ఈ వీడియో స్ట్రీమింగ్‌కు వెబ్ ఆప్ష‌న్లు కూడా ఇచ్చింది జియో. 
జియో టీవీ , జియో సినిమా వెబ్  
మొబైల్ లైవ్ స్ట్రీమింగ్ లో బాగా పాపుల‌ర్ అయిన  హాట్‌స్టార్‌ను జియో టీవీ వెబ్ టార్గెట్ చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. హాట్‌స్టార్‌లో మెయిన్‌గా లైవ్ క్రికెట్ మ్యాచెస్ వ‌స్తుంటాయి. జియో టీవీలో 550కు పైగా ఛానల్స్‌లోని ప్రోగ్రామ్స్‌ను చూడొచ్చు. దీంతోపాటు జియో సినిమా వెబ్‌లో తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ లాంటి లోక‌ల్ లాంగ్వేజ్‌ల సినిమాల‌తో పాటు బాలీవుడ్‌, హాలీవుడ్ సినిమాలు కూడా వ‌స్తాయి. వీట‌న్నింటినీ  జియో మొబైల్‌లో యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుని చూస్తున్నారు. అయితే వీటి వెబ్ వెర్ష‌న్ల‌ను కూడా జియో రీసెంట్‌గా తీసుకొచ్చింది. 

ఎలా చూడాలి?

జియో టీవీ, జియో సినిమా వెబ్‌సైట్ల‌ను జియోటీవీ. కామ్‌, జియోసినిమా.కామ్  లింక్స్ ద్వారా బ్రౌజ‌ర్‌లో బ్రౌజ్ చేసుకుని చూడొచ్చు. దీనికోసం మీ జియో నెంబ‌ర్‌తో ఎంట‌రవ్వాలి. నెట్‌వ‌ర్క్ ఎవాయ‌ల‌బిలిటీని బ‌ట్టి స్టాండ‌ర్డ్ డెఫినీష‌న్ (SD), హై డెఫినీష‌న్ (HD)ల్లో వీటిని చూడొచ్చు. 
* భ‌విష్య‌త్తులో నాన్ జియో యూజ‌ర్ల‌కు కూడా ఈ ఎంట‌ర్‌టైన్‌మెంట్ చూసేలా జియో ఏర్పాట్లు చేస్తోంది.  ఇది క్లిక్క‌యితే కేబుల్ ఆప‌రేట‌ర్ల‌కు క‌ష్ట‌కాల‌మే.

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు