• తాజా వార్తలు

ఆధార్ కార్డు పోతే.. మ‌రో కాపీని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేయ‌డం ఎలా?  

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఆధార్ కార్డు అన్నింటికీ అవ‌స‌రం.  ఒక‌వేళ అది పోయినా వేరే కాపీని డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే మీ ఆధార్ కార్డ్ నెంబ‌ర్ క‌చ్చితంగా మీకు తెలిసి ఉండాలి. మీకు ఆధార్ నెంబ‌ర్ గుర్తు లేక‌పోయినా కూడా దానికీ మెథ‌డ్ ఉంది. 
మీ ఆధార్ నెంబ‌ర్ ఎలా తెలుసుకోవాలంటే.. 
1. UIDAI అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి
2.  స్క్రీన్ టాప్‌లో ఉన్న ఆప్ష‌న్ల‌లో నుంచి ఆధార్ నెంబ‌ర్‌ను సెలెక్ట్ చేసుకోండి. 
3.  మీ ఆధార్ కార్డ్ మీద మీ పేరు ఎలా ఉందో అలా మీ పేరు అంతా అక్క‌డ  టైప్ చేయండి.  
4. ఆధార్ ఎన్‌రోల్ చేసుకున్న‌ప్పుడు మెన్ష‌న్ చేసిన ఈ మెయిల్ ఐడీ లేదా  ఫోన్ నెంబ‌ర్ ను టైప్ చేయండి.  
5.  సెక్యూరిటీ కోడ్ పైన వ‌చ్చిన ఇమేజ్‌లో క‌నిపిస్తున్న క్యారెక్ట‌ర్ల‌ను అక్క‌డ ఎంట‌ర్ చేయండి. ఇప్పుడు Get OTPని క్లిక్ చేయండి.  6. మీ మెయిల్ ఐడీ లేదా మొబైల్ నెంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని ఎంట‌ర్ చేసి Verify OTPని క్లిక్ చేయండి.  
7. ఇప్పుడు మీ ఆధార్ నెంబ‌ర్ ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా వ‌స్తుంది. 
ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేయాలంటే.. 
మీ ఆధార్ నెంబ‌ర్ తెలిశాక దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవ‌డం చాలా ఈజీ. 
1. UIDAI అఫీషియ‌ల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. e-Aadhaar  పేజీని ఓపెన్ చేయండి. 
2. I have అనే ఆప్ష‌న్ ప‌క్క‌నున్న  Aadhaarను సెలెక్ట్ చేయండి.  
3. మీ ఆధార్ నెంబ‌ర్‌, ఫుల్ నేమ్‌, మీ రెసిడెన్షియ‌ల్ అడ్ర‌స్ పిన్‌కోడ్ ఎంట‌ర్ చేయండి. 
4. త‌ర్వాత లైన్‌లో ఇమేజ్‌లో క‌నిపించే క్యారెక్ట‌ర్స్‌ను  Enter above Image Text అనే  లైన్‌లో ఉన్న ఖాళీలో ఎంట‌ర్ చేయండి.
5.  Get One Time Passwordను క్లిక్ చేయండి.
6.   Confirm పాప్ అప్‌ను క్లిక్ చేయ‌గానే మీ మొబైల్‌కు ఓటీపీ వ‌స్తుంది. Cancel క్లిక్ చేస్తే మీ మెయిల్ ఐడీకి వ‌స్తుంది.
7. ఓటీపీ ఎంట‌ర్ చేసి  Validate & Download ఆప్ష‌న్‌ను క్లిక్ చేయండి. 
8. మీ ఆధార్ కార్డు పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ అవుతుంది.  దీనికి పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్ష‌న్  ఉంటుంది. మీ  రెసిడెన్షియ‌ల్ అడ్ర‌స్ పిన్ కోడే మీ పాస్‌వ‌ర్డ్‌.  ఓపెన్ చేసి ప్రింటవుట్ తీసుకోవ‌చ్చు.  

జన రంజకమైన వార్తలు