• తాజా వార్తలు
  •  

మ‌న ప్రైవసీకి పెద్ద త‌ల‌నొప్పిగా త‌యారైన మొబైల్ కీ బోర్డ్స్‌.. విముక్తి ఎలా? 

ఆండ్రాయిడ్‌, ఐవోఎస్ రెండూ కూడా త‌మ ఫోన్ల‌లోని స్టాండ‌ర్డ్ కీబోర్డును థ‌ర్డ్‌పార్టీ కీబోర్డుతో రీప్లేస్ చేసుకునే అవ‌కాశం ఇస్తాయి. ఇది యూజ‌ర్‌కు బాగుంటుంది. స్టాండ‌ర్డ్ కీబోర్డ్‌లో లేని ఎన్నో ఆప్ష‌న్లు ఉంటాయి. తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ లాంటి మ‌న లోక‌ల్ లాంగ్వేజ్‌లు ఉంటాయి. మంచి ఎమోజీలు, స్టిక్క‌ర్స్ ఉంటాయి.   కానీ ప్రైవ‌సీ మాటేమిటి?  ఈ  కీబోర్డ్‌లో మీరు టైప్ చేసే మెసేజ్ నుంచి క్రెడిట్ కార్డ్ నెంబ‌ర్‌, పాస్‌వ‌ర్డ్‌లు అన్నింటికీ మీరు ఫుల్‌ యాక్సెస్ ఇస్తున్న‌ట్లే.  చాలా సంద‌ర్భాల్లో ఇలా మీ ప‌ర్స‌న‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్  కీబోర్డ్స్ డెవ‌ల‌ప‌ర్‌కి చేరే ప్ర‌మాద‌ముంది. అదే జ‌రిగితే దాన్ని ఎలాగైనా మిస్ యూజ్ చేయొచ్చు. ఆండ్రాయిడ్‌, ఐఫోన్ యూజ‌ర్లు ఎక్కువ‌గా డౌన్‌లోడ్ చేసుకుని వాడేది ఏఐ టైప్ కీ బోర్డు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా 4 కోట్ల మంది డెవ‌ల‌ప్ చేసుకున్నారు. ఇందులో 3 కోట్ల మంది డేటా ఆన్‌లైన్‌లో లీకైంది.  దీనికి కార‌ణం ఆ కీ బోర్డ్ డేటా బోస్ క‌నీసం పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్ష‌న్ కూడా లేదు. అంటే ఎవ‌రు కావాల‌న్నా అందులో ఉన్న ఇన్ఫ‌ర్మేష‌న్‌ను యాక్సెస్ చేసుకోవ‌చ్చ‌న్న‌మాట‌.  ఇలా చాలా సంద‌ర్భాల్లో చాలా కీ బోర్డుల నుంచి డేటా లీకైంది. పాపుల‌ర్ స్విఫ్ట్ కీ బోర్డును  మైక్రోసాఫ్ట్ కొన్నాక ఇందులో ఇన్ఫో కూడా లీకైంది. మీరు ఆ కీ బోర్డ్‌లో ఈ మెయిల్ అడ్ర‌స్ టైప్ చేశారు. వేరే యూజ‌ర్ త‌న స్విఫ్ట్ కీబోర్డును యాక్సెస్ చేస్తుంటే మీరు టైప్ చేసిన ఈ మెయిల్ అడ్ర‌స్ అత‌నికి స‌జెష‌న్‌గా క‌నిపిస్తుంది. ఇది ఎంత డేంజ‌రో ఆలోచించారా అంటున్నారు నిపుణులు.   
కార‌ణ‌మేంటి? 
థ‌ర్డ్ పార్టీ కీ బోర్డులు యూజ‌ర్ల‌ను ఆకట్టుకోవ‌డానికి స్మార్ట్‌గా డిజైన్ చేస్తారు.  మామూలు కీ బోర్డ్‌లో మీరు రెండు లెట‌ర్స్ కొట్ట‌గానే వ‌ర్డ్ స‌జెష‌న్స్‌ను చూపిస్తుంది. అయితే  థ‌ర్డ్ పార్టీ కీ బోర్డులు మ‌రింత స్మార్ట్‌గా యాక్ట్ చేసి అడ్వాన్స్‌డ్ టెక్స్ట్ ప్రెడిక్ష‌న్‌, ప‌ర్స‌న‌లైజ్‌డ్ ఆటో క‌రెక్ష‌న్ చూపిస్తాయి.  ఇందుకోసం అవి మీరు టైప్ చేస్తున్న ఇన్ఫ‌ర్మేష‌న్‌ను త‌మ స‌ర్వ‌ర్ల‌లో అప్‌లోడ్ చేస్తాయి. అయితే స‌రైన ప్రొటెక్ష‌న్ లేక‌పోవ‌డంతో ఇవి అంద‌రూ యాక్సెస్ చేయ‌గ‌లుగుతున్నారు. 
ఎలా ప‌రిష్క‌రించాలి? 
* మీరు థ‌ర్డ్ పార్టీ కీబోర్డును ఇన్‌స్టాల్ చేసుకునేట‌ప్పుడు అన్నింటికీ ఫుల్ యాక్సెస్ ఇవ్వ‌ద్దు.
 * గూగుల్ (జీబోర్డ్ ), మైక్రోసాఫ్ట్ లాంటి స్టాండ‌ర్డ్ కంపెనీల కీబోర్డును ఎంచుకోండి. త‌మ కంపెనీ పేరు పాడుకాకూడ‌ద‌న్న ఉద్దేశంతో వాళ్లు చాలా సెక్యూరిటీ మెజ‌ర్స్ పాటిస్తారు. కాబట్టి మీ ఇన్ఫ‌ర్మేష‌న్ మిస్‌యూజ్ అయ్యే ప్ర‌మాదం త‌క్కువ‌. 
* చాలా థ‌ర్డ్ పార్టీ కీబోర్డులు ఇంట‌ర్నెట్ యాక్సెస్ ఉంటేనే ప‌ని చేస్తాయి. అలాంటివాటిని ఎవాయిడ్ చేయ‌డం మంచిది. 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు