• తాజా వార్తలు

ఓలా మ‌నీ, ఫ్రీఛార్జి క్యాష్ బ్యాక్‌ను బ్యాంక్ అకౌంట్‌కు పంప‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

పేటీఎం, ఫ్రీఛార్జి,  మొబీక్విక్ ఇలా ఈ-వాలెట్ల‌న్నీ యూజ‌ర్ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి క్యాష్ బ్యాక్స్ ఇస్తుంటాయి. వీటిని మ‌ళ్లీ అదే వాలెట్ ద్వారా ఏదైనా కొనుక్కోవడానికో,  స‌ర్వీస్‌కో వాడుకోవ‌డానికి అవ‌కాశ‌మిస్తాయి. అయితే ఇలా క్యాష్‌బ్యాక్ వ‌చ్చిన అమౌంట్‌ను బ్యాంక్ అకౌంట్‌కు కూడా ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునే ఫీచ‌ర్ గ‌తంలో పేటీఎంలో ఉండేది. ఇప్పుడు ఫ్రీ ఛార్జి వాలెట్‌తో, ఓలా మ‌నీలో వ‌చ్చే క్యాష్ బ్యాక్‌ను బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. అది ఎలా చేయాలో ఈ ఆర్టిక‌ల్‌లో చ‌దవండి.
2% ఛార్జి ప‌డుతుంది
క్యాష్ బ్యాక్‌లుగా వ‌చ్చే అమౌంట్‌ను బ్యాంక్ అకౌంట్‌కు పంప‌డానికి గ‌తంలో వాలెట్లు 3% ఛార్జి కింద తీసుకునేవి.  అయితే ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే ప‌ద్ధ‌తుల్లో 2% ఛార్జితోనే క్యాష్ బ్యాక్ అమౌంట్‌ను బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు.  ఈ ప‌ద్ధ‌తిలో ఇండియాలోని ఏ బ్యాంక్ అకౌంట్‌కైనా, ఎంత అమౌంట్ అయినా ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు.
పేయూనౌ యాప్ (Payunow)
పేమెంట్స్ అగ్రిగేట‌ర్ పేయూ డెవ‌ల‌ప్ చేసిన యాప్ ఇది.
* ప్లే స్టోర్ నుంచి Payunow యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
* ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయండి.రిజిస్ట‌ర్ అయి లాగిన్ అవ్వండి.
* క్యాష్‌బ్యాక్‌ను బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలంటే KYC ( నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్‌) ప్రాసెస్ పూర్తి చేయాలి.
* కేవైసీ కంప్లీట్ అయ్యాక మీరు పేమెంట్ లింక్ జ‌న‌రేట్ చేసుకోవ‌చ్చు.
* లింక్ జ‌lరేట్ అయ్యాక దీన్ని ఏ బ్రౌజ‌ర్‌లోన‌యినా ఓపెన్ చేసి ఓలామ‌నీ లేదా ఫ్రీ ఛార్జి ద్వారా పేమెంట్ చేయొచ్చు.
* ఇప్పుడు మీ వాలెట్లో ఉన్న మ‌నీ పేయూనౌ అకౌంట్లోకి వ‌స్తుంది.
*  దీన్ని వెంట‌నే మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు.
జ‌స్ట్ డ‌య‌ల్‌ యాప్ (Justdial)
అడ్ర‌స్‌లు, ఫోన్ నెంబ‌ర్లు, ప్లేస్‌లు సెర్చ్‌చేయ‌డం కోసం మ‌నం వాడే జ‌స్ట్ డ‌య‌ల్ యాప్‌లో కూడా ఈ ఫీచ‌ర్ ఉంది.
* ప్లే స్టోర్ నుంచి Justdial యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
* ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయండి.రిజిస్ట‌ర్ అయి లాగిన్ అవ్వండి.
* క్యాష్‌బ్యాక్‌ను బ్యాంక్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలంటే KYC ( నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్‌) ప్రాసెస్ పూర్తి చేయాలి.
* కేవైసీ కంప్లీట్ అయ్యాక మీరు JD pay ఐకాన్‌ను క్లిక్ చేసి పేమెంట్ లింక్ జ‌న‌రేట్ చేసుకోవ‌చ్చు.
* లింక్ జ‌lరేట్ అయ్యాక దీన్ని ఏ బ్రౌజ‌ర్‌లోన‌యినా ఓపెన్ చేసి ఓలామ‌నీ లేదా ఫ్రీ ఛార్జి ద్వారా పేమెంట్ చేయొచ్చు.
* ఇప్పుడు మీ వాలెట్లో ఉన్న మ‌నీ  జ‌స్ట్ డ‌య‌ల్ అకౌంట్లోకి వ‌స్తుంది.
*  దీన్ని వెంట‌నే మీ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. 
 
జన రంజకమైన వార్తలు