• తాజా వార్తలు
  •  

బ్రౌజ‌ర్ మార్చ‌కుండా, లాగ‌వుట్ అవ‌కుండా.. ఒకేసారి రెండు అకౌంట్లు వాడ‌డం ఎలా?

మీకు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, జీ మెయిల్ ఇలా ర‌క‌రకాల స‌ర్వీసుల్లో ఒక‌టి కంటే ఎక్కువ అకౌంట్లు ఉండొచ్చు. ప‌ర్స‌న‌ల్‌, ప్రొఫెష‌న‌ల్ అవ‌స‌రాల‌కు రెండేసి వాడేవాళ్లు చాలామందే ఉంటారు. కానీ ఒక బ్రౌజ‌ర్‌లో ఒక  అకౌంట్  ఓపెన్ చేస్తే సేమ్ అదే స‌ర్వీస్‌లో ఇంకో అకౌంట్‌ను ఓపెన్ చేయ‌లేం. అంటే బ్రౌజ‌ర్‌లో ఆఫీస్ మెయిల్ ఓపెన్ చేస్తే మీప‌ర్స‌న‌ల్ మెయిల్ ఓపెన్ చేయ‌లేరు.  ఒక‌టి లాగ‌వుట్ అయితేనే రెండోదానితో లాగిన్ కాగ‌ల‌రు. లేదంటే రెండు డిఫ‌రెంట్ బ్రౌజ‌ర్లు (క్రోమ్‌, ఫైర్‌ఫాక్స‌) తీసుకుని వాటిలో రెండు డిఫరెంట్ ఎకౌంట్స్ ఓపెన్ చేయాలి.  అలా కాకుండా ఒకే బ్రౌజ‌ర్‌లో ఒకే స‌ర్వీసువి ఒక‌టి కంటే ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవ‌డానికి ఓ మార్గం ఉంది. అదే టెంప‌రరీ కంటెయినర్స్‌.
ఏమిటీ టెంప‌ర‌రీ కంటెయినర్స్‌? 
ఇదొక బ్రౌజ‌ర్ యాడ్ ఆన్.  ఫైర్‌ఫాక్స్‌, క్రోమ్ బ్రౌజ‌ర్స్‌లో ప‌ని చేస్తుంది. దీన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే ఒకే బ్రౌజ‌ర్‌లో డిఫ‌రెంట్ ట్యాబ్స్‌లో ఒకే స‌ర్వీసువి డిఫ‌రెంట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవ‌చ్చు.  ఈ టెంప‌ర‌రీ కంటెయిన‌ర్స్ యాడ్ ఆన్‌కు ఇంట‌ర్‌ఫేస్ లేదు. మీ బ్రౌజ‌ర్‌లోనే రైట్ సైడ్ టాప్ బార్‌లో ఈ యాడ్ ఆన్ క‌నిపిస్తుంది.   
ఎలా వాడుకోవాలి? 
1.  Temporary Containers యాడ్ ఆన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇప్పుడు మీ అడ్ర‌స్ బార్‌లో  TemporaryContainers యాడ్ ఆన్ అవుతుంది.  
2  ఇప్పుడు మీరు కొత్త ట్యాబ్ ఓపెన్ చేయ‌గానే యాడాన్ లేబుల్  కంటెయినర్ నెంబ‌ర్‌తో స‌ఙా క‌నిపిస్తుంది. ఒక అకౌంట్ వాడుతుండ‌గానే మ‌రో టాబ్ ఓపెన్ చేసి మ‌రో కొత్త అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవ‌చ్చు.  
 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు