• తాజా వార్తలు
  •  

షియోమీ ఫోన్‌లో  కాంటాక్ట్స్ లిస్ట్‌లో ప్రాబ్ల‌మ్స్ ఉన్నాయా.. ఇదిగో ప‌రిష్కారం 

షియోమి యూజ‌ర్ల‌లో చాలా మందికి కాంటాక్ట్స్ లిస్ట్‌లో డేటా మిస్ మ్యాచ్ అవుతోంది.  మేజ‌ర్ ఓఈఎం డివైస్‌ల‌న్నింటిలోనూ ఈ ప్రాబ్లం వ‌స్తున్న‌ట్లు షియోమికి అందుతున్న కంప్ల‌యింట్స్ ద్వారా తెలుస్తోంది. ఈ మిస్‌మ్యాచ్ వ‌ల్ల కాంటాక్ట్స్ ఇన్ఫ‌ర్మేష‌న్ త‌ప్పుగా క‌నిపిస్తుంది. దీన్ని షియోమి ఇండియా గుర్తించింది.  స‌మ‌స్యకు తాత్కాలికంగా ఓ ప‌ర్మిష‌న్ కూడా తీసుకొచ్చింది.   
ప్రాబ్ల‌మ్ ఏమిటి?
ఎంఐ యూజ‌ర్ల‌లో కొంత మంది కాంటాక్ట్స్ ఇన్‌క‌రెక్ట్ మెర్జింగ్‌తో ప్రాబ్ల‌మ్స్ ఫేస్ చేస్తున్నారని తెలిసింది. దీనిమీద మేం కొంత స్ట‌డీ చేసి, ఇది థ‌ర్డ్‌పార్టీ యాప్స్ వ‌ల్ల వ‌స్తున్న ఇష్యూ అని గుర్తించాం.వాట్సాప్, ట్రూకాల‌ర్స్ నుంచి తీసుకునే కాంటాక్స్ట్‌లోనే ఈ మిస్‌మ్యాచ్ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. దీన్ని బట్టి ఇది థ‌ర్డ్‌పార్టీ ఇష్యూ అని భావిస్తున్నాం. దీనిపై మ‌రింత రీసెర్చి చేయాల్సి ఉంద‌ని షియోమి ఇండియాఫోరం ప్ర‌క‌టించింది. 
టెంప‌ర‌రీ సొల్యూష‌న్ 
 ఈ ప్రాబ్ల‌మ్ గురించి మేం ఇప్ప‌టికే ఆండ్రాయిడ్‌, వాట్సాప్‌ల‌ను సంప్ర‌దించామ‌ని  షియోమి ఇండియాఫోరం చెప్పింది.  దీనికోసం ఓ టెంప‌ర‌రీ సొల్యూష‌న్‌గా ఓ ఏపీకే ఫైల్‌ను రిలీజ్ చేసింది.  ఈ ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకుంటే ప్రాబ్ల‌మ్ సాల్వ్ అయింద‌ని చాలా మంది షియోమి యూజ‌ర్లు ట్వీట్ చేశారు. ఈ ఫైల్ ద్వారా కూడా ప్రాబ్ల‌మ్ క్లియ‌ర్ కాక‌పోతే ఆ యాప్స్‌ను అన్ ఇన్‌స్టాల్ చేసి మ‌ళ్లీ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.  ఆ అకౌంట్స్‌తో కాంటాక్ట్స్ లిస్ట్ సింకింగ్ డిజేబుల్ చేయాలి అని షియోమి స‌జెస్ట్ చేస్తోంది.  త్వర‌లోనే ఈ ప్రాబ్ల‌మ్‌ను క్లియ‌ర్ చేయ‌డానికి శాశ్వ‌త ప‌రిష్కారం క‌నుక్కొంటామ‌ని ప్ర‌క‌టించింది. 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు