సుదూర ప్రాంతాల కమ్యూనికేషన్ ను వాట్స్ అప్ చాలా దగ్గర చేసింది. sms టెక్స్ట్ లా కాకుండా ఇంటర్ నెట్ కనెక్షన్ సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ వేగవంతమైన మరియు అత్యంత సులువైన మెసేజింగ్ ను ఇవ్వడం లో వాట్స్ అప్ పాత్ర మరువలేనిది. అయితే చూడడానికి ఇది కేవలం మెసేజింగ్ సర్వీస్ లా మాత్రమే కనిపించినా దీనియొక్క అసలైన పనితీరు ఈ మెయిల్, ఫేస్ బుక్ మరియు స్కైప్ కాల్ ల లాంటి వాటికి చాలా భిన్నంగా ఉంటుంది.
దీనియొక్క విశిష్టత ఏమిటంటే అత్యంత సులువైన మరియు ప్రైవేటు కమ్యూనికేషన్ ను ఇది అందిస్తుంది. ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టే 2014 వ సంవత్సరం లో ఫేస్ బుక్ దీనిని 19 బిలియన్ డాలర్ లకు కొనుగోలు చేసింది. అందులో ఏమీ ఆశ్చర్యం లేదు. ఒక సంవత్సరం లోపే ఇది వాట్స్ అప్ వెబ్ అనే ఒక అద్భుతమైన ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఇది మీ మెసేజ్ లను మీ ఫోన్ మరియు కంప్యూటర్ ల మధ్య అనుసంధానం చేస్తుంది. ఈ ఫీచర్ ను ఉపయోగించి నేడు అనేక మంది యూజర్ లు తమ ఫోన్ లలోని వాట్స్ అప్ ఎకౌంటు లను కంప్యూటర్ లను కనెక్ట్ చేసుకుంటున్నారు.
అయితే ఈ ఫీచర్ కు కూడా కొన్ని ప్రతికూలతలు లేకపోలేదు. ఒక్కోసారి కనెక్షన్ ఆటోమాటిక్ గా కట్ అవుతూ ఉంటుంది. అంతకుమించిన సమస్య ఏమిటంటే మీరు ఈ సేర్వ్చీ ను ఉపయోగించాలి అంటే మీ కంప్యూటర్ పక్కనే మీ స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలి. ఏ మాత్రం దూరంగా ఉన్న సరే కనెక్షన్ కట్ అవుతుంది. అలా అని ప్రతీసారి మీరు కంప్యూటర్ ముందు కూర్చోలేరు కదా! మీ కంప్యూటర్ లో ఉన్న మంచి ఫోటో లను మీ ఫ్రెండ్స్ కి వాట్స్ అప్ ద్వారా షేర్ చేయాలి అనుకుంటున్నారు, మీరేమో కంప్యూటర్ కు దూరంగా ఉన్నారు. ఇప్పుడెలా?ఇకపై అలాంటి సమస్య ఎదురవదు. ఎందుకంటే యునిటి యాప్ వచ్చేసింది.
యునిటి అంటే ఏమిటి?
యునిటి అనేది ఒక మీడియా సర్వర్ యాప్. ఇది మొబైల్ పరికరాలు మరియు కంప్యూటర్ హార్డ్ డ్రైవ్ ల మధ్య కనెక్షన్ సృష్టిస్తుంది.ఈ యునిటి ని ఉపయోగించి మీ కంప్యూటర్ లో ఉన్న అన్నిరకాల ఫైల్ లకు మీ మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ ను పొందవచ్చు.మీరు మీ వీడియో లను, ఫోటో లను, మ్యూజిక్ ఇలా దేన్నైనా స్ట్రీమ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు మరియు డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు.మీ కంప్యూటర్ ఆన్ అయ్యి వైఫై కి కనెక్ట్ అయిన మరుక్షణం మీరు దానికి నిరంతరాయమైన యాక్సెస్ ను పొందుతారు.
ఇందులో ఫైల్ సైజు కి పరిమితులు ఏవీ లేవు, మీ కంప్యూటర్ లో స్టోర్ అయిఉన్న దేనికైనా మీరు చాలా సులువుగా యాక్సెస్ ను పొందుతారు. ఈ యాప్ ను వాట్స్ అప్ ద్వారా ఎలా ఉపయోగించాలో చూద్దాం.
ఐ ఒ ఎస్
1. మీ మొబైల్ లో యునిటి యాప్ ను ఓపెన్ చేయాలి.
2. మీరు షేర్ చేయాలి అనుకున్న ఫోటో ను సెలెక్ట్ చేసుకోవాలి.
3. మీ స్క్రీన్ కు కుడి వైపు క్రింద ఉన్న ఓపెన్ ఇన్ అనే ఐకాన్ పై క్లిక్ ట్యాప్ చేయాలి.
4. పై భాగం లో వాట్స్ అప్ అనే దానిని కనుగొని సెలెక్ట్ చేయాలి.
5. ఎవరికి మీరు ఫోటో షేర్ చేయాలో వారిని సెలక్ట్ చేయాలి.
6. ఫోటో తో పాటు ఏదైనా మెసేజ్ ను టైపు చేయాలి.
7. సెండ్ పై ట్యాప్ చేయాలి. అంతే
ఆండ్రాయిడ్
1. మీ ఆండ్రాయిడ్ డివైస్ లో యునిటి యాప్ ను ఓపెన్ చేయాలి.
2. మీరు షేర్ చేయాలి అనుకున్న ఫోటో ను సెలెక్ట్ చేసుకోవాలి
3. ఆ ఫోటో కి కుడి వైపు ఉండే మూడు చుక్కల ఐకాన్ పై ట్యాప్ చేయండి.
4. ఎక్స్ పోర్ట్ ను సెలక్ట్ చేయాలి
5. వాట్స్ అప్ ను సెలెక్ట్ చేయాలి.
6. ఎవరికి మీరు ఫోటో షేర్ చేయాలో వారిని సెలక్ట్ చేయాలి.
7. ఫోటో తో పాటు ఏదైనా మెసేజ్ ను టైపు చేయాలి.
8. సెండ్ పై ట్యాప్ చేయాలి. అంతే