• తాజా వార్తలు
  •  

ఫొటోషాప్ వెర్ష‌న్ ఉచితంగా లీగ‌ల్‌గా పొంద‌డం ఎలా? 

ఇమేజింగ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ల‌లో ఫొటోషాప్ అంత పాపుల‌ర‌యింది మ‌రొక‌టి లేదు. ఫొటోషాప్ యూజ‌ర్ ఫ్రెండ్లీగా ఉంటుంది.  మినిమం నాలెడ్జి , క‌నీస‌ ట్రైనింగ్ ఉంటే ఎవ‌రైనా దీన్ని వాడుకోవ‌చ్చు. అందుకే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్నో ర‌కాల ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లు ఉన్నా అత్య‌ధిక మంది ఫొటోషాప్‌నే వాడుతున్నారు. ఫొటోషాప్ త‌యారీదారు అయిన ఆడోబ్ త‌న సీఎస్‌2 వెర్ష‌న్‌ను ఫ్రీగా యూజ‌ర్ల‌కు అందుబాటులోకి తెచ్చింది. ఆడోబ్ అకౌంట్ ఉన్న ఎవ‌రైనా ఈ సీఎస్‌2 వెర్ష‌న్‌ను ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.
ఫొటోషాప్ సీఎస్‌2 వెర్ష‌న్‌ను ఫ్రీగా ఎలా పొందాలంటే..
1) https://accounts.adobe.com/లోకి  వెళ్లండి. అదే పేజీలో Get an Adobe IDమీ ఈమెయిల్ అడ్ర‌స్‌, పేరు, పాస్‌వ‌ర్డ్ వంటి వివ‌రాల‌న్నీ ఎంట‌ర్ చేసి ఆడోబ్ ఐడీ క్రియేట్  చేసుకోండి. 
2) ఇప్పుడు మై ఆడోబ్ (My Adobe) అకౌంట్‌కి సైన్ అప్ అవ్వండి.
3) cs2 downloads pageలోకి వెళ్లండి. cs2 - download అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి.
4)ఇక్కడ మీకు Download Adobe Acrobat 7 and Adobe Creative Suite 2 products ప‌సుపు రంగులో హైలెట్ చేసి ఓ లింక్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. 
5)త‌ర్వాత వ‌చ్చే పేజీలో కిందికి స్క్రోల్ డౌన్‌చేస్తే Download Acrobat 7 and CS2 products అని క‌నిపిస్తుంది. దాని కింద ఉన్న English ఆప్ష‌న్‌నుక్లిక్ చేయండి. అక్క‌డ క‌నిపించే టేబుల్‌లో లాస్ట్ నుంచి రెండోదాన్ని (Photoshop CS2)ను సెలెక్ట్ చేసుకోండి. మీరు మాక్ యూజ‌ర్ అయితే మాక్ వెర్ష‌న్‌, విండోస్ యూజ‌ర్ అయితే విండోస్ వెర్ష‌న్ డౌన్లోడ్‌ చేసుకోండి.
6) మీరు వెర్ష‌న్ డౌన్‌లోడ్ చేసుకునేట‌ప్పుడే ప‌క్క‌న సీరియల్ నెంబ‌ర్ క‌నిపిస్తుంది. దాన్ని కాపీ చేసి పెట్టుకోండి.
7) ఇప్పుడు డౌన్‌లోడ్ చేసిన Photoshop CS2ను డౌన్‌లోడ్ చేయండి. మీ పేరు, కంపెనీ పేరు (ఏదైనా పెట్టుకోవ‌చ్చ‌)  ఎంట‌ర్ చేయండి.  ఇంత‌కు మందు మీరుకాపీ చేసిపెట్టుకున్న‌సీరియ‌ల్ నెంబ‌ర్‌ను కూడా ఎంట‌ర్ చేయాలి.
8) ఇప్పుడు Photoshop CS2 మీ సిస్టంలో ఇన్‌స్టాల్ అవుతుంది.  త‌ర్వాత మీ పేరు వివ‌రాల‌తో రిజిస్ట్రేష‌న్ పూర్తి చేస్తే చాలు మీరు ఫొటోషాప్‌ను లీగ‌ల్‌గా, ఫ్రీగా వాడుకోవ‌చ్చు. 
 

జన రంజకమైన వార్తలు