• తాజా వార్తలు
  •  

మార్చి నెల‌లో జియో రీఛార్జ్ క్యాష్‌బ్యాక్ కూప‌న్లు అందిస్తున్న యాప్‌లు ఇవే

ఇప్పుడు జియో హాట్ హాట్‌.. కొత్త కొత్త ఆఫ‌ర్ల‌తో రోజు రోజుకు త‌న ప్ర‌భావాన్ని ఈ సంస్థ ఇంకా పెంచుకుంటూపోతోంది. దీనిలో భాగంగా ఎన్నో భిన్న‌మైన క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ల‌తో పాటు కూప‌న్ల‌ను కూడా అందిస్తోంది. జియో రీఛార్జ్ కూప‌న్ల‌ను, క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ల‌ను మ‌నం కొన్ని యాప్‌ల ద్వారా తెలుసుకునే అవ‌కాశం ఉంది. పేటీఎం, ఫోన్‌పె, అమేజాన్‌, మెబిక్‌విచ్‌, ఫ్రీఛార్జ్‌, నికి, పేజాప్‌, పాకెట్స్ లాంటి యాప్‌లు ఈ విష‌యంలో ముందంజ‌లో ఉన్నాయి. ఈ నెల‌లో అలా జియో కూప‌న్లు, క్యాష్‌బ్యాక్ వివ‌రాలు అందిస్తున్న యాప్‌ల.. ఆ ఆఫ‌ర్ల వివ‌రాలు ఏమిటో తెలుసుకుందాం..

ఫ్రీఛార్జ్ అందిస్తోంది ఫ్లాట్ రూ.80 క్యాష్‌బ్యాక్‌
జియో రీఛార్జ్ చేసుకుంటే రూ.80 వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ పొందే అవ‌కాశాన్నిక‌ల్పిస్తోంది ఫ్రీఛార్జ్ యాప్‌. ఇది పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ కస్ట‌మ‌ర్లంద‌రికి వ‌ర్తించే ఆఫ‌ర్‌. దీనికి న్యూ50, జియో75 అనే కోడ్స్‌ను మీరు ఉప‌యోగించాల్సి ఉంటుంది. రూ.300 పైన రీఛార్జ్‌చేయించుకునే జియో పాత క‌స్ట‌మ‌ర్లు రూ.30 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. దీనికి ఎఫ్ సీ జియో అనే కోడ్‌ను వాడాల్సి ఉంటుంది. ఈ కూప‌న్లు కోడ్‌లు మార్చి 31 వ‌ర‌కు వ్యాలిడ్ అవుతాయి.

పేజాప్ జియో రూ.50 క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్‌
పే జాప్ ద్వారా జియో రీఛార్జ్ చేసుకుంటే రూ.50 క్యాష్ బ్యాక్ పొందే అవ‌కాశం ఉంది. ఈ ఆఫ‌ర్ పొందాలంటే మినిమం రూ.200 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫ‌ర్ మార్చి 1 నుంచి 31 వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది. దీని కోసం ఆర్ఈసీహెచ్25 అనే కూప‌న్ కోడ్‌ను ఉప‌యోగించాల్సి ఉంటుంది. 

కాంపారిఫై ఆఫ‌ర్‌
కాంపారిఫై ఆఫ‌ర్ ద్వారా 10 శాతం క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. జియో రీఛార్జ్ చేసుకుంటే మీకు మాగ్జిమం రూ.40 వ‌ర‌కు క్యాష్‌బ్యాక్ ఇస్తోంది కాంపారిఫై యాప్‌. ఈ యాప్ ద్వారా క్యాష్‌బ్యాక్ రావాలంటే పేమెంట్‌ను ఫోన్‌పే నుంచి చేయాల్సి ఉంటుంది.

నికి యాప్‌తో రూ.145 క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్‌
నికి యాప్ ద్వారా రీఛార్జ్‌లు చేసుకుంటే గ‌రిష్టంగా రూ.145 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.  దీని కోసం ముందుగా నికి యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ కోడ్ ప్రి25ను వాడితే చాలు మీకు రూ.25 క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది. రూ.399తో జియో రీఛార్జ్ చేసుకుంటే మీకు 25 శాతం క్యాష్ బ్యాక్ వ‌స్తుంది. అయితే మీరు పేమెంట్ అమేజాన్ పే బ్యాలెన్స్ నుంచి చేయాలి. అంటే నికి యాప్ డౌన్‌లోడ్‌ ద్వారా 20, ప్రొమో కోడ్ద్వారా 25, అమేజాన్ పే బ్యాలెన్స్ ద్వారా 100 మొత్తం రూ.145 క్యాష్ బ్యాక్ పొందొచ్చు.

ట్రూ బాలెన్స్ ద్వారా..
300డీఈసీ25 ద్వారా రూ.25 క్యాష్‌బ్యాక్‌
జియో999పీ ద్వారా రూ.100 క్యాష్‌బ్యాక్‌
జియో500పీ ద్వారా రూ.51 క్యాష్‌బ్యాక్‌
జియో309పీ ద్వారా రూ.31 క్యాష్‌బ్యాక్‌
జియో200ఎఫ్ఏఎం ద్వారా 5 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు.

 

జన రంజకమైన వార్తలు