పండగల సీజన్ వస్తే ఈ-కామర్స్ పోర్టల్స్ ఎలాంటి ఆఫర్లు పెడతాయా? ఏ ఐటమ్స్ తక్కువ ప్రైస్‌కు వస్తాయా అని యూజర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇప్పుడా ట్రెండ్ మారుతోంది. ఎంత ఆఫర్ ఇచ్చి, ఎంత డిఫరెంట్ ఆప్షన్లు ఇచ్చి కస్టమర్లను తమవైపు తిప్పుకోవాలా అని కంపెనీలే ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్ జెయింట్స్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల మధ్య ఈ కాంపిటీషన్ మరీ ఎక్కువైంది. బిగ్ బిలియన్ డేస్‌తో ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించింది. దీనికిపోటీగా రేపటి నుంచి అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ గ్రేట్ ఇండియన్ సేల్‌లో ఇప్పుడు కొని వచ్చే సంవత్సరం పే చేసే బై నౌ.. పే నెక్స్ట్ ఇయర్ ఆఫర్‌తో అమెజాన్ మరోకొత్త రకం పోటీకి తెరతీసింది.
ఏంటీ ఆఫర్?
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఇప్పుడు కొని 2018 (నెక్స్ట్ ఇయర్) జనవరి నుంచి ఇన్స్టాల్మెంట్స్ పే చేయోచ్చు. అంటే మూడు నెలల టైం దొరుకుతుందన్నమాట. ఇది ఓన్లీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు మాత్రమే. ఇప్పటికే ఈ సేల్‌లో హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ తో పర్చేజ్ చేస్తే 10% డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.. దీనికి బై నౌ.. పే లేటర్ ఆఫర్‌ను కూడా జత చేసింది.
సేల్స్ పెంచుకోవడానికే..
దసరా, దీపావళిల సీజన్ అమెజాన్‌కు చాలా ఇంపార్టెంట్. ఫ్లిప్‌కార్ట్‌తో నెక్ టు నెక్ టు పోటీ పడుతున్న అమెజాన్ ఈ గ్రేట్ ఇండియన్ సేల్‌లో 40 వేల ఆఫర్లను అందుబాటులో పెడుతోంది. మొబైల్స్‌పై 40% వరకు డిస్కౌంట్ ఇస్తామని యూత్‌ను టార్గెట్ చేసింది. ఇప్పుడు బై నౌ.. పే లేటర్‌తో పేమెంట్‌కు మూడు నెలలు టైం దొరుకుతుంది కాబట్టి మరింత ఎక్కువ మంది , ఎక్కువ మొత్తంలో కొంటారన్నది అమెజాన్ ఆలోచన. అయితే హెచ్డీఎఫ్సీ క్రెడిట్‌కార్డ్స్ ఒక్కదానిపైనే ఈ ఆఫర్ పెట్టడంతో ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందోమరి..