• తాజా వార్తలు
  •  

ఏంటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌లాక్‌?  ఉప‌యోగించేది ఎలా?

ఆండ్రాయిడ్‌లో రోజు రోజుకు కొత్త కొత్త ఫీచ‌ర్లు వ‌స్తున్నాయి. వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా అప్‌డేష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఆండ్రాయిడ్‌లో వ‌చ్చిన అలాంటి మార్పే ఆండ్రాయిడ్ స్మార్ట్‌లాక్‌. అంటే మీ  ఆండ్రాయిడ్ ఫోన్‌ను సుల‌భంగా అన్‌లాక్ చేసేపెట్టే టూల్‌. దీని వ‌ల్ల ఉప‌యోగం ఏమిటంటే ఫోన్ లేదా ట్యాబ్‌ మీ జేబులో ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా కూడా మీరు అన్‌లాక్ చేయ‌చ్చు. స్మార్ట్ లాక్ ఉప‌యోగించినప్పుడు మీరు ఎలాంటి పిన్‌, ప్యాట్ర‌న్‌, లేదా పాస్‌వ‌ర్డ్ వాడాల్సిన అవ‌స‌రం లేదు.  మీ డివైజ్‌ను బ‌ట్టి ఈ టూల్‌లో ఎన్నో ఆప్ష‌న్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్ లాక్‌ను ఎలా ఉపయోగించాలో చూద్దాం..

ఎలా ఉప‌యోగించాలంటే..
1. మీ ఫోన్లో ముందు లాక్ స్క్రీన్ సిస్ట‌మ్ ఉందో లేదో చూసుకోవాలి. ఆ త‌ర్వాత మీ డివైజ్ సెట్టింగ్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి.

2. ఆ త‌ర్వాత సెక్యూరిటీ ఆప్ష‌న్‌లోకి వెళ్లాలి. దీనిలో మీకు స్క్రీన్ లాక్‌, ఫింగ‌ర్ ప్రింట్‌, ఎన్‌క్రిప్ట్ ఫోన్‌, సెట్ అప్ సిమ్ కార్డ్ లాక్ మ‌రియు స్మార్ట్ లాక్ అనే ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. 

3. ఆపై లొకేష‌న్‌, స్మార్ట్‌లాక్ అనే ఫీచ‌ర్‌ను క్లిక్ చేయాలి.  

4. ఇందులో మీ పిన్‌, ప్యాట్ర‌న్ లేదా పాస్‌వ‌ర్డ్‌ల‌ను ఎంట‌ర్ చేయాలి.

5. స్మార్ట్‌లాక్ ఓపెన్ అవుతుంది. దీనిలో ఆన్‌బాడీ డిటెక్ష‌న్‌, ట్ర‌స్ట‌డ్ ప్లేసెస్‌, ట్ర‌స్ట‌డ్ డివైజ‌స్, ట్ర‌స్ట‌డ్ ఫేస్‌, వాయిస్ మ్యాచ్ అనే ఆప్ష‌న్లు ఉంటాయి

6.  ఇందులో మీరు ట్ర‌స్ట‌డ్ ప్ల్లేసెస్ ఆప్ష‌న్ లేదా డివైజ‌స్‌, లేదా వాయిసెస్ ఆప్ష‌న్లు ఎంచుకోవ‌చ్చు. మీరు ట్ర‌స్ట‌డ్ ప్లేసెస్ ఆప్ష‌న్ ఎంచుకుంటే మీకు ఒక మ్యాప్ ఓపెన్ అవుతుంది. ఆ మ్యాప్‌లో మీ ఇళ్లు, ఆఫీసు తదిత‌ర ప్లేస్‌ల‌ను యాడ్ చేసుకోవ‌చ్చు. ఈ ట్ర‌స్ట‌డ్ డివైజ్ కేట‌గిరిలో మీ స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ ఏదైనా యాడ్ చేసుకోవ‌చ్చు.

7. ఇలా యాడ్ చేసుకున్న త‌ర్వాత మీ ఫోన్ స్క్రీన్ అడుగు భాగంలో లాక్ ద‌గ్గ‌ర‌లో ఒక స‌ర్కిల్ క‌నిపిస్తుంది. దీన్ని ఉప‌యోగించి మీరు ఎక్క‌డ ఉన్నా కూడా ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవ‌చ్చు. లేదా లాక్ చేసుకోవ‌చ్చు. 

జన రంజకమైన వార్తలు