• తాజా వార్తలు

జియో యాప్‌లో పోప‌ప్ యాడ్స్‌ను డిజేబుల్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

జియో యాప్‌.. జియో వాడుతున్న వాళ్ల‌కు దీని గురించి ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేదు.  రీఛార్జ్ చేయాల‌న్నా.. లేదా ఏమైనా మ్యూజిక్ వినాల‌న్నా, రింగ్‌టోన్స్ సెట్ చేసుకోవాల‌న్నా జియో యూజర్లు ఈ యాప్‌నే ఉప‌యోగిస్తుంటారు.  అయితే జియో యాప్‌లు వాడుతుంటే కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అదే పోప‌ప్ యాడ్స్‌. ఏమైనా యాప్ లింక్ ఓపెన్ చేస్తే చాలు . మ‌ధ్య మ‌ధ్య‌లో ఈ యాడ్స్ వ‌చ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి.  వాటిని క్లిక్ చేస్తే ఆ లింక్‌లు ఎక్క‌డికెక్క‌డికో వెళుతుంటాయి. మ‌రి జియో యాప్‌లో పోప‌ప్ యాడ్స్‌ను డిజేబుల్ చేయ‌డం ఎలా? అవి అడ్డుత‌గ‌ల‌కుండా మ‌న ప‌ని చేసుకోవ‌డం ఎలా?

డిజేబుల్ చేయ‌డం ఇలా...
మీరు జియో యాప్‌లో సినిమాలు చూస్తున్న‌ప్పుడో లేక ఏ రింగ్ టోన్ కోస‌మో వెతుకుతున్న‌ప్పుడో ఈ యాడ్స్ అస్త‌మానం అడ్డొచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ స్థితిలో వాటిని డిజేబుల్ చేయాలంటే  కొన్ని స్టెప్స్ పాటిస్తే చాలు..
ముందుగా జియో యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్ ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత దిగువ భాగంలో ఉన్న జియో యాప్ ఆన్ యువ‌ర్ ఛాయిస్  ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత అడ్వాన్స్‌డ్ సెక్ష‌న్ కింద డ్రా ఓవ‌ర్ అద‌ర్ యాప్స్ అనే ఆప్ష‌న్ వ‌స్తుంది. అందులోకి వెళ్లి  నో అనే ఆప్ష‌న్‌ను క్లిక్ చేయాలి. అంతే మీరు పోప‌ప్ యాడ్స్‌ను బ్లాక్ చేసినట్లే

ఆండ్రాయిడ్ వేరు ఓఈఎం వేరు
జియో యాప్‌లో పోప‌ప్ యాడ్స్‌ను డిజేబుల్ చేయ‌డం ఆండ్రాయిడ్‌లో వేరుగా ఉంటుంది. ఓఈఎం స్కిన్‌లో వేరుగా ఉంటుంది.  సాధార‌ణంగా ఈ ఆప్ష‌న్ యాప్ టాప్‌లో ఉన్న మూడు డాట్స్‌లో దాక్కొని ఉంటుంది. ట్రూ కాల‌ర్ లాంటి యాప్‌ల‌కు జియో ఎలా ప‌ర్మిష‌న్ ఇచ్చింద‌నేది ప్ర‌శ్నార్థ‌కం. అయితే జియోకు సంబంధించిన యాప్‌ల‌ను బ్రౌజ్ చేస్తున్న‌ప్పుడు మ‌న‌కు ఈ యాడ్‌లు క‌నిపించ‌వు. కానీ జియో కాకుండా వేరే యాప్‌ల‌ను జియో ద్వారా ఓపెన్ చేసిన‌ప్పుడు రాండ‌మ్‌గా యాడ్స్ క‌నిపిస్తాయి. ఎందుకంటే జియో త‌న సొంత యాప్‌ల‌ను క్లీన్‌గా మెయిన్‌టెన్ చేయాల‌నుకోవ‌డ‌మే దీనికి కార‌ణం. 

జన రంజకమైన వార్తలు