• తాజా వార్తలు

జియో ఫోన్ బుక్ చేశారా? అయితే స్టేట‌స్ చెక్ చేసుకోండిలా..!

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

జియో ఫీచ‌ర్ ఫోన్‌... ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఈ మాటే. ఈనెల 24న జియో ఫోన్ బుక్ చేసుకోవ‌చ్చంటూ ఆ సంస్థ సందేశాలు పంపిన మ‌రు క్ష‌ణమే జ‌నం చాలా వేగంగా ఫోన్ల‌ను బుక్ చేసే కార్య‌క్ర‌మంలో ప‌డిపోయారు. సాయంత్రం 5.30 గంట‌ల‌కు ఫోన్ బుకింగ్ మొద‌లైన త‌ర్వాత వినియోగ‌దారుల తాకిడి త‌ట్టుకోలేక జియో సైట్ క్రాష్ కూడా అయింది.  అయితే తాకిడి త‌ట్టుకోలేక ప్రి బుకింగ్స్‌ను కూడా నిలిపేసింది జియో. ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మంది ఫోన్ బుక్ చేసుకున్నార‌ని.. ఇక తాము ప్రిబుకింగ్‌ను నిలిపి వేస్తున్న‌ట్లుగా జియో చెప్పింది. అయితే జియో ఫోన్ బుక్ చేశారు స‌రే.. మ‌రి మ‌న‌కు ఫోన్ వ‌స్తుందా రాదా? అస‌లు మ‌న ఆర్డ‌ర్ స్టేట‌స్ ఏంటి?

 

స్టేట‌స్ తెలుసుకోవాలంటే..

రూ.500 చెల్లించి ల‌క్ష‌లాది మంది జియో ఫోను ప్రి బుకింగ్ చేసుకున్నారు. ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ బేసిస్‌ను ఈ ఫోన్‌ను అందించేందుకు జియో ఏర్పాట్లు చేస్తోంది. ఫోన్ రాక‌పోతే మ‌నీ కూడా వాప‌స్ వ‌చ్చేస్తుంది. అయితే మ‌న బుకింగ్ స్టేట‌స్ ఎలా తెలుసుకోవాలి? ఇది చాలా మంది వినియోగ‌దారుల‌కు క‌లిగే సందేహ‌మే.  మీ బుకింగ్ స్టేట‌స్‌ను తెలుసుకోవాలంటే తొలి ప‌ద్ధ‌తి 18008908900 నంబ‌ర్‌లో సంప్ర‌దించాలి. ఈ నంబ‌ర్‌కు కాల్ చేసి మీరు జియో ఫోన్ బుక్ చేయ‌డానికి ఇచ్చిన నంబ‌ర్‌ను రిజిస్ట‌ర్  చేయాలి. అప్పుడు మీ ఫోన్‌కు సంబంధించిన డిటైల్స్ మీకు మెసేజ్ రూపంలో వ‌స్తాయి.  రెండో ఆప్ష‌న్ మీ జియో యాప్ ఉప‌యోగించ‌డం. మీ జియో యాప్ ఓపెన్ చేయ‌గానే మేనేజ్ బుకింగ్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. మీరు అది ట్యాప్ చేయ‌గానే మై ఓచ‌ర్స్ ఆప్ష‌న్ వ‌స్తుంది. అందులో హ్యాండ్ సెట్ స్టేట‌స్ క‌నిపిస్తుంది. మీరు ఫోన్ ఎక్క‌డ తీసుకోవాలో మీకు ఒక మెసేజ్ వ‌స్తుంది. ఆ స్టోర్‌కు వెళ్లి మిగిలిన రూ.1000 క‌ట్టి ఫోన్ తీసుకోవ‌చ్చు.

జియో బుకింగ్ ఎలా కాన్సిల్ చేయాలి?

ప్ర‌స్తుతానికి జియో బుకింగ్‌ను కాన్సిల్ చేయ‌డానికి ఎలాంటి ఆప్ష‌న్ లేదు. కానీ త్వ‌ర‌లోనే ఆ ఆప్ష‌న్ కూడా పెట్ట‌నున్నారు.  అయితే జియో యాప్‌లో మై అకౌంట్లోకి వెళితే అందులో ట్రాన్స‌ఫ‌ర్ అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. అంటే మీకు ఆ బుకింగ్ ఓచ‌ర్‌ను వేరే నంబ‌ర్‌కు ట్రాన్స‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు.  అయితే మ‌రిన్నివివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.

జన రంజకమైన వార్తలు