• తాజా వార్తలు

 ఏ శ‌క్తి ప‌సిగ‌ట్ట‌లేని ర‌హ‌స్య చాటింగ్ చేయ‌డం ఎలా?

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

చాటింగ్‌..ఇది  చాలా ప్రైవేటు విష‌యం. కానీ ఎవ‌రికైనా ప‌క్క‌వాళ్ల గురించి కుతూహ‌లం ఉంటుంది. ఏం చాటింగ్ చేస్తాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాల‌ని కూడా అనుకుంటారు. నిజానికి ఇది కామ‌న్‌సెన్స్ కాదు. అయితే కొంత‌మంది మాత్రం అవ‌న్నీ ప‌ట్టించుకోరు. మ‌నం చాటింగ్ చేస్తుంటే మ‌న ఫోన్‌లోకి తొంగి చూస్తారు. అయితే ఇప్పుడు ర‌హ‌స్య చాటింగ్ ఆప్షన్ వ‌చ్చింది. దీంతో ఎవ‌రికి తెలియ‌కుండా ర‌హ‌స్య చాటింగ్ చేయ‌చ్చు. మ‌రి అదెలా సాధ్యం అంటారా?

సీక్రెట్ క‌న్వ‌ర్షేష‌న్‌
ఎవ‌రికీ తెలియ‌కుండా చాటింగ్ చేయ‌డం కోసం మెసెంజ‌ర్‌లో సీక్రెట్ క‌న్వ‌ర్షేష‌న్ ఫీచ‌ర్ వ‌చ్చింది. దీని అనేబుల్ చేసుకుంటే చాలు మూడోకంటి తెలియ‌కుండా.. ఏ ఇబ్బంది లేకుండా చాటింగ్ చేసుకోవ‌చ్చు.  అయితే దీన్ని ఉప‌యోగించుకోవాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి.

స్టెప్ 1
మెసెంజ‌ర్ ఓపెన్ చేసి  టాప్ లెఫ్ట్ కార్న‌ర్‌లో ఉన్న మీ సెక్ష‌న్ మీద క్లిక్ చేయాలి. దీనిపై మీ ఫ్రొఫైల్ ఫొటో కూడా ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే  సీక్రెట్ క‌న్వ‌ర్షేష‌న్ అనే ఆప్ష‌న్ క్లిక్ చేయాలి. 

స్టెప్  2
ఆన్ ఆప్ష‌న్‌ను స్విచ్ ఆన్ చేయాలి. అప్పుడు మీకో సీక్రెట్ క‌న్వ‌ర్షేష‌న్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతోంది.  ఎన్‌క్రిప్టెడ్ ఎండ్ టు ఎండ్ అనే మెసేజ్ మీకు  క‌నిపిస్తుంది.  ఆన్ ట‌ర్న్ఆన్ టు యాక్టివేట్ ఫీచ‌ర్ మీద క్లిక్ చేయాలి.  ఈ ప్ర‌క్రియ పూర్త‌యిన త‌ర్వాత మీరు సీక్రెట్‌గా క‌న్వ‌ర్షేష‌న్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది.

ఫేసుబుక్‌లో రహ‌స్య చాటింగ్ ఎలా...
స్టెప్-1

సెట్టింగ్స్ క్లిక్ చేస్తే కొన్ని ఆప్ష‌న్ల‌తో కూడిన లిస్ట్ వ‌స్తుంది నిక్‌నేమ్స్ అనే ఆప్ష‌న్ కింద గో టు సీక్రెట్ క‌న్వ‌రేష‌న్ అనే ఫీచ‌ర్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే  బ్లాక్ థీమ్‌తో ఒక కొత్త చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. 

స్టెప్-2
కొత్త‌గా ఓపెన్ అయిన చాట్ బాక్స్‌లో టెక్ట్ ఫీల్డ్‌లోకి వెళ్లి  మెసేజ్‌ల‌ను టైప్ చేసుకోవ‌చ్చు.  దీనిలో మీకు మూడు భిన్న‌మైన టైమ్ లిమిట్స్ క‌నిపిస్తాయి. 5 సెక‌న్లు. 10 సెక‌న్లు, 30 సెక‌న్లుగా ఇవి డివైడ్ అయి ఉంటాయి. మీరు ఎంత‌సేపు చాట్ చేస్తారో ఆ డ్యురేష‌న్ సెలక్ట్‌ చేసుకోవాలి. స్నాప్‌చాట్‌లో డిజ‌ప్పియ‌రింగ్ స్నాప్స్ లాంటిదే ఇది కూడా. 

జన రంజకమైన వార్తలు