గూగుల్ తన సొంత ఫోన్లు గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లకు గూగుల్ ఫొటోస్‌లో అన్లిమిటెడ్ ఫ్రీ స్టోరేజిని ఇచ్చింది. దీంతో ఫొటోలు, వీడియోలను కంప్రెస్ చేయకుండా ఫుల్ రిజల్యూషన్, క్వాలిటీతో స్టోర్ చేసుకునే ఫెసిలిటీ పిక్సెల్ యూజర్లకు ఏర్పడింది. అయితే కొంత మంది డెవలపర్లు నాన్ పిక్సెల్ యూజర్లకు కూడా ఈ ఫెసిలిటీని వాడేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
రూట్ చేస్తే చాలు
ఆండ్రాయిడ్ నోగట్, అంతకంటే హై ఓఎస్ ఉన్న డివైస్‌లకు ఈ అన్లిమిటెడ్ ఫ్రీ స్టోరేజ్‌ను ఇచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు తమ డివైస్‌ను రూట్ చేసుకుంటున్నారు. పిక్సెల్ ఫోన్లో ఉండే అన్లిమిటెడ్ స్టోరేజి ఫైల్‌ను డౌన్లోడ్ చేసి, ఆ ఫైల్‌ను ఈ డివైస్‌లోకి లోడ్ చేస్తున్నారు. దీంతో మిగిలిన యూజర్లకు కూడా పిక్సెల్ యూజర్ల మాదిరిగానే అన్లిమిటెడ్ ఫ్రీ స్టోరేజి వస్తుందని చెబుతున్నారు. కొన్ని డివైస్‌లకు మరిన్ని అడ్జెస్ట్మెంట్లు అవసరమవుతున్నాయని, అయితే అన్లిమిటెడ్ స్టోరేజ్‌కి మాత్రం అవకాశం కలుగుతుందని డెవలపర్లు చెబుతున్నారు .
గూగుల్ గుర్తించేవరకే..
తన పిక్సెల్ ఫోన్ యూజర్లకు మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా తెచ్చిన ఈ ఫీచర్‌ను మిగిలిన యూజర్లు కూడా రూట్ చేసి వాడుకోగలుగుతున్నారని గూగుల్ గుర్తించేవరకే ఇది సాగుతుందని ఎక్స్పెర్ట్లు అంటున్నారు. గూగుల్ గుర్తిస్తే వెంటనే దీనికి ఓ సెక్యూరిటీ ప్యాచ్ రిలీజ్ చేస్తుందని, దాంతో డెవలపర్లకు రూట్ చేయడం కష్టమవుతుంది.