• తాజా వార్తలు
  •  

దివాళీ సంద‌ర్భంగా మీ స‌న్నిహితుల‌కు డిజిట‌ల్ మ‌నీ పంప‌డం ఎలా?

దీపావ‌ళి వేళైంది.. జ‌న‌మంతా పండుగ సంబ‌రాల్లో ఉన్నారు. షాపింగ్‌లు, బంగారం కొన‌డం ఇలా ఎవ‌రి హ‌డావుడి వాళ్ల‌ది.  మ‌నం స‌న్నిహితుల కోసం మ‌నం ఏదో ఒక‌టి స‌ర్‌ప్రైజింగ్ చేయాలంటే ఎలా? ఏముంది వారికి ఏదో ఒక‌టి గిఫ్ట్ ఇవ్వాలి! మామూలుగా అయితే బ‌ట్ట‌లు, స్వీట్లు కొనిస్తాం. కానీ ఇది డిజిట‌ల్ కాలం. అంత‌కుమించి ఏదో ఒక‌టి చేసి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాలి. అలాంటి వారి కోస‌మే వ‌చ్చింది డిజిట‌ల్ మ‌నీ. మ‌రి మ‌న స‌న్నిహితుల కోసం డిజిట‌ల్ మ‌నీ పంప‌డం ఎలా?

పేటీఎం లిఫాఫా
డిజిట‌ల్ మ‌నీ పంప‌డానికి పేటీఎంను మించిన ఫ్లాట్‌ఫాం మీకు దొర‌క‌బోదు. డిజిట‌ల్ మ‌నీ లావాదేవీల కోసం ఆ సంస్థ ఇటీవ‌లే  లిఫాఫా అనే ఆప్ష‌న్‌ను ప్ర‌వేశపెట్టింది. ఈ లిఫాఫా ద్వారా మీరు దివాళీ గిఫ్ట్‌ల‌ను పంపుకోవ‌చ్చు. దీనికి మీరేం చేయాలంటే పేటీఎం యాప్‌ను ఓపెన్ చేసి లిఫాఫాను ఓపెన్ చేయాలి. మీరు ఎవ‌రికి గిఫ్ట్ పంపాల‌నుకుంటున్నారో వారికి సంబంధించిన ఫోన్ డిటైల్స్‌ను ఎంట‌ర్ చేయాలి.  ఆ త‌ర్వాత ఎంత అమౌంట్ పంపాల‌నుకుంటున్నారో దాన్ని కూడా ఎంట‌ర్ చేయాలి. థీమ్ సెల‌క్ట్ చేసుకోవాలి. దీవాళి థీమ్‌ను ఎంపిక చేసుకోవాలి. సెక‌న్ల‌లో మీరు పంపిన మ‌నీ మీ స‌న్నిహితుల అకౌంట్లో ప‌డిపోతుంది. ఒక‌వేళ మీ వాళ్లు 10 రోజుల వ‌ర‌కు ఆ అకౌంట్ ఓపెన్ చేయ‌క‌పోతే ఆ డ‌బ్బులు మీకు తిరిగి వ‌చ్చేస్తాయి. ఈ  డ‌బ్బులు వాళ్లకు అందాలంటే లిఫాఫాను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. 

అమేజాన్ గిఫ్ట్ కార్డ్‌
అమేజాన్ ద్వారా కూడా మీ స్నేహితుల‌కు, బంధువుల‌కు పండ‌గ గిఫ్ట్ ఇవ్వొచ్చు.  అమేజాన్ గిఫ్ట్‌కార్డ్ ద్వారా ఇది సాధ్యం, రూ.20 వేలు వ‌ర‌కు సింగిల్ గిఫ్ట్ కార్డు ద్వారా పంపుకోవ‌చ్చు. ఈ అమౌంట్ అవ‌త‌లి వ్య‌క్తి అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో అందుతుంది. వాళ్లు ఆ మ‌నీని ఏమైనా కొనుగోలు చేయ‌డానికి ఉప‌యోగించుకోవ‌చ్చు. దివాళీ థీమ్స్‌ను కూడా అమేజాన్ క‌స్ట‌మ‌ర్ల కోసం అందిస్తోంది. ఆ థీమ్స్‌ను ఉప‌యోగించుకుంటూ ఈ మ‌నీ పంపొచ్చు. 

ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్‌కార్డ్‌
దీపావ‌ళికి గిఫ్ట్‌లు పంప‌డానికి ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కూడా ఫ్లాట్‌ఫాంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్‌కార్డుల ద్వారా మ‌న సన్నిహితులకు గిఫ్ట్‌ల‌ను పంపుకోవ‌చ్చు. రూ.10 వేల వ‌ర‌కు దీవాళి గిఫ్ట్ పంపుకోవ‌చ్చు అంతేకాదు ప‌ర్స‌న‌ల్ మేసేజ్ కూడా రాయ‌చ్చు.

హైక్ బ్లూ పాకెట్స్‌
సోష‌ల్ మీడియా సంస్థ హైక్ ద్వారా కూడా గిఫ్ట్‌లు పంపుకోవ‌చ్చు. దీనిలో ఉన్న బ్లూ పాకెట్స్ ద్వారా మీ స‌న్నిహితుల‌కు , బంధువుల‌కు డ‌బ్బులు పంపుకోవ‌చ్చు. ఈ యాప్‌లోని వాలెట్ సెక్ష‌న్ ద్వారా బ్లూ పాకెట్స్ అనే ఆప్ష‌న్ ఎంచుకోవాలి. రిసీపియంట్స్ వివ‌రాలు రాసి... అమౌంట్ ఎంట‌ర్ చేసి సెండ్ ఏయాలి.  మేక్ మై ట్రిప్‌, షాప‌ర్స్ స్టాప్‌ల ద్వారా కూడా ఈ గిఫ్ట్ కార్డులు పంపుకునే అవ‌కాశం ఉంది. 

జన రంజకమైన వార్తలు

విజ్ఞానం బార్ విశేషాలు