• తాజా వార్తలు
  •  

ఫోన్లో మీ లొకేష‌న్ షేర్ చేయ‌డంలో ఉన్న రిస్క్‌ను మినిమైజ్ చేయ‌డం ఎలా?

డిజిట‌ల్ కాలంలో మనం చేసినా..ఎటు క‌దిలినా స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉండాల్సిందే. స్మార్ట్‌ఫోన్ ఉంటే ఒక మ‌నిషే మ‌న‌కు సాయంగా ఉన్న‌ట్లు. ఈ నేప‌థ్యంలో మ‌నం ప్ర‌యాణాల్లో ఉన్న స‌మ‌యంలో స్మార్ట్‌ఫోన్ చేసే ప‌నుల్లో మొద‌టిది  మ‌న‌కు దారి చూపించ‌డం. అంటే లొకేష‌న్ ఎక్క‌డ ఉన్నామో తెలియజేయ‌డం. ఇటీవ‌లే వాట్స‌ప్ లైవ్ లొకేష‌న్ ఫీచ‌ర్‌ని అందుబాటులోకి తెచ్చింది. అయితే దీనితో ఒక చిక్కొచ్చి ప‌డింది.  లొకేష‌న్ షేరింగ్ వ‌ల్ల మ‌నం ఎక్క‌వ ఉన్నామో అంద‌రికి తెలిసిపోతుంది. ఇది ఒక ర‌కంగా ప్రైవ‌సీకి భంగ‌మే. అంతేకాదు ఒక్కోసారి ఇబ్బంది కూడా. మ‌రి మ‌నం లొకేష‌న్ షేర్ చేయ‌డంలో ఉన్న రిస్క్‌ను  మినిమైజ్ చేయ‌డం ఎలాగో చూద్దాం..

ఐఫోన్లో అయితే ఇలా..
మీరు మీ  లొకేష‌న్ షేర్ చేయ‌డానికి ఎంతవ‌ర‌కు యాక్సెస్ ఇస్తున్నార‌నేది కీలకం. ముందుగా మీ ఫోన్లోని సెట్టింగ్స్‌లోకి వెళితే ప్రైవ‌సీ మెనూ అనే ఆప్ష‌న్ వ‌స్తుంది. అందులోనే మీకు లొకేష‌న్ స‌ర్వీసెస్ అనే మ‌రో ఆప్ష‌న్ ఉంటుంది.  ఇది ఎప్పుడూ అల్వేస్ అనే ఆప్ష‌న్‌తో ఓపెన్ అయి ఉంటుంది. అంటే ఇది ఎప్పుడైనా మీ లొకేష‌న్ ట్రాక్ చేస్తుంది. అయితే యాప్ ఓపెన్ చేసిన‌ప్పుడు మాత్ర‌మే ట్రాక్ చేయాల‌నే విధంగా మీరు వైల్ యూజింగ్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.  మీరు లొకేష‌న్‌ను డిజేబుల్ చేయాల్సిన అవ‌స‌రం లేదు. ఇలా చేస్తే ఫోన్ మిస్ బిహేవ్ చేసే అవ‌కాశం ఉంటుంది. అంటే మీరు ప‌ర్మిష‌న్ ఇచ్చిన‌ప్పుడు మాత్ర‌మే ప‌బ్లిక్‌కు మీ లొకేష‌న్ ట్రాక్ అవుతుంది.  

ఆండ్రాయిడ్ న‌గెట్‌లో ఎలా..
ఆండ్రాయిడ్ న‌గౌట్‌లో లొకేష‌న్ స‌ర్వీసెస్ ద్వారా యాప్‌ల‌ను మ‌నం క‌నుక్కొవ‌చ్చు. స్క్రీన్ పైభాగంలో ఉండే నోటిఫికేష‌న్ ఆప్ష‌న్ ట్యాప్ చేయ‌గానే మీకు సెట్టింగ్స్ ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయ‌గానే మీకు యాప్స్ మెనూ క‌నిపిస్తుంది. గేర్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి. గెలాక్సీ డివైజ్‌ల‌లో  పైన కార్న‌ర్‌లో అయితే మీకు మూడు డాట్స్ క‌నిపిస్తాయి. వాటిని ట్యాప్ చేయాలి. అక్క‌డే మీకు యాప్ ప‌ర్మిష‌న్స్‌, ఫైండ్ ద లొకేష‌న్ ఆప్ష‌న్ కూడా క‌నిపిస్తుంది. అందులో మీరు ఎన్ని యాప్‌ల‌కు లొకేష‌న్ ట్రాక్ చేసే ప‌ర్మిష‌న్ ఇచ్చేర‌నేది కూడా క‌నిపిస్తుంది. మీకు అవ‌స‌ర‌మైన యాప్‌ల‌ను ఉంచి మిగిలిన యాప్‌ల‌ను డిజేబుల్ చేయాలి.

సోషల్ మీడియాలో ఐతే..
ఇవే కాదు  ఫేస్‌బుక్‌, ట్విట‌ర్‌, ఇన్‌స్టాగ్రామ్ లాంట సోష‌ల్ మీడియా సైట్ల‌కు కూడా మీరు లొకేష‌న్ స‌ర్వీసెస్ ప‌ర్మిష‌న్లు ఎలా ఇచ్చారో ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకోవాలి. లేక‌పోతే  మీరు ఈ సైట్ల‌ను ఎక్క‌డ ఓపెన్ చేసినా ఏ ఏరియాలో ఏ స‌మ‌యానికి ఓపెన్ చేశారో కూడా అంద‌రికి తెలిసిపోతుంది. కొన్ని సంద‌ర్భాల్లో ఇది ఇబ్బంది అవుతుంది. అందుకే ఆయా యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి లొకేష‌న్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి. ఇది ఆన్‌లో ఉంటే ట‌ర్న్ ఆఫ్ చేయాలి. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ అయినా ఇదే ప్రాసెస్‌.

జన రంజకమైన వార్తలు