• తాజా వార్తలు

ఆండ్రాయిడ్‌లో టెక్స్ట్‌ను బయ‌టికి చ‌దివి వినిపించడానికి మూడు మార్గాలు

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఆండ్రాయిడ్ డివైస్‌లో టెక్స్ట్ చ‌ద‌వడానికి మీకు టైం లేదా? ఇంట్లో వ‌య‌సులో పెద్ద‌వాళ్లు ఆండ్రాయిడ్ ఫోన్‌లో టెక్ట్స్ చ‌దవ‌డానికి ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే టెక్ట్స్‌ను బ‌య‌టికి చ‌దివి వినిపించే మార్గాలున్నాయి. అవేంటో చూడండి. 

1. గూగుల్ అసిస్టెంట్

ఆండ్రాయిడ్ గూగుల్ అసిస్టెంట్ మీకు ఈ ప‌ని చేసిపెడుతుంది. లాస్ట్ 5 మెసేజ్‌ల‌ను గూగుల్ అసిస్టెంట్ మీకు చ‌దివి వినిపిస్తుంది. వాయిస్ కమాండ్ ద్వారా రీడ్ మెసేజ్ అని చెబితే చాలు. మీకు వ‌చ్చిన లాస్ట్ మెసేజ్‌ను చ‌దివి వినిపిస్తుంది. దాన్ని కావాలంటే రిపీట్ చేయ‌మ‌ని, లేదంటే రిప్ల‌యి ఇవ్వ‌మ‌ని వాయిస్ క‌మాండ్ ఇవ్వ‌చ్చు. దాని త‌ర్వాత మ‌రో మెసేజ్ చ‌ద‌వ‌మ‌ని క‌మాండ్ ఇస్తే త‌ర్వాత మెసేజ్‌ను చ‌దివి వినిపిస్తుంది.

2.టెక్స్ట్ టు స్పీచ్‌

గూగుల్ అసిస్టెంట్‌ను వాడ‌కుండా ఆండ్రాయిడ్‌లో ఉన్న‌నేటివ్ ఫీచ‌ర్ల ద్వారా టెక్స్ట్‌ను చ‌దివి వినిపించే సౌల‌భ్యం ఉంది.

Go to Settings > Accessibility > Text-to-Speechని ఎనేబుల్ చేయాలి. స్పీచ్ రేట్‌, పిచ్‌ను అడ్జ‌స్ట్ చేసుకోవాలి.  మ‌ళ్లీ యాక్సెస‌బులిటీ స్క్రీన్‌కు వెళ్లి స్పీక్ ఆప్ష‌న్ సెలెక్ట్ చేసుకుని టూగుల్ చేయాలి.  ఇప్పుడు మీస్క్రీన్ మీద కార్న‌ర్‌లో ఒక చిన్న స్పీచ్ బబుల్ వ‌స్తుంది. మీకు పైకి చ‌దివి వినిపించాల్సిన పేజీలేదా యాప్‌కు నావిఏగేట్ చేయండి. ఇప్పుడు స్పీచ్ బబుల్‌ను టాప్ చేయండి. అది బ్లూక‌ల‌ర్‌లోకి మారుతుంది. మీరు లౌడ్‌గా వినాల‌నుకున్న టెక్స్ట్‌ను సెలెక్ట్ చేయండి. మీకు ఆ టెక్స్ట్‌ను చ‌దివి వినిపిస్తుంది. అయితే దీనిలో వాయిస్ క‌మాండ్ ద్వారా టెక్స్ట్‌ను చ‌ద‌వ‌మ‌ని క‌మాండ్ ఇవ్వ‌లేం.మాన్యువ‌ల్‌గానే సెలెక్ట్ చేసుకోవాలి.

3. థ‌ర్డ్‌పార్టీ యాప్స్ 

మీకు గూగుల్ అసిస్టెంట్ లేదు.. టెక్స్ట్‌ను సెలెక్ట్ చేసి వినిపించ‌మ‌న‌డం ఇబ్బందిగా అనిపిస్తే OutLoud లాంటి థ‌ర్డ్ పార్టీ యాప్స్‌కు వెళ్లాలి. ఇది మీ నోటిఫికేష‌న్ల‌న్నీ చ‌దివి వినిపిస్తుంది. యాప్ ఛాయిస్‌ను సెలెక్ట్ చేసుకున్నాక  ప్రిఫ‌రెన్సెస్ ట్యాబ్‌లోకి వెళ్లి ఫీచ‌ర్‌ను ట‌ర్న్ ఆన్ చేసుకోవాలి. ప్రిఫ‌రెన్స్‌లో ఆటేమేటిక్ ఆన్‌, ఆఫ్‌ను సెట్ చేసుకోవ‌చ్చు. బ్లూ టూత్‌, హెడ్ ఫోన్స్ పెట్టుకుని మీరు ఎక్క‌డికైనా ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు డివైస్‌ను జేబులోంచి, లేదా బ్యాగ్‌లోంచి బ‌య‌టికి తీయ‌కుండానే  మెసేజ్ ఏమిటో తెలుసుకోవ‌డానికి ఈ యాప్ ఫీచ‌ర్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ యాప్ అప్‌గ్రేడ్ వెర్ష‌న్ ను 2 డాల‌ర్లు పెట్టి ప‌ర్చేజ్ చేస్తే అన్‌లిమిటెడ్ యాప్స్‌ను యాక్సెస్ చేసి మీ మెసేజ్‌ల‌ను చ‌దివి వినిపించుకోవ‌చ్చు.  కొన్ని వ‌ర్డ్స్‌ను మాత్ర‌మే లౌడ్‌గా వినిపించ‌మ‌నొచ్చు. లేదంటే లౌడ్ అవుట్  షెడ్యూలింగ్ చేసుకోవ‌చ్చు. ఈ రెండు ఫీచ‌ర్లు పెయిడ్ యాప్‌లోనే అందుబాటులో ఉన్నాయి.

జన రంజకమైన వార్తలు