• తాజా వార్తలు

ల్యాప్‌టాప్ బ్యాట‌రీ లైఫ్‌ను కొన‌కముందే అంచ‌నా వేయ‌డం ఎలా? 

  • - ఎలా? /
  • 6 సంవత్సరాల క్రితం /

ఫోన్‌, ల్యాప్‌టాప్ వ‌స్తువేదైనా స‌రే బ్యాట‌రీ బ్యాక‌ప్ కంపెఓనీ చెప్పిన‌దానికి నిజంగా బ్యాట‌రీ బ్యాక‌ప్‌కు చాలా వేరియేష‌న్ ఉంటుంది.  రీసెర్చ‌ర్ల చెప్పే లెక్క‌ల ప్ర‌కారం 86 శాతం కంపెనీలు ఈ విష‌యంలో అతిగానే చెబుతున్నాయి. ల్యాప్‌టాప్‌ల విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది.  ఏ  ల్యాపీ అయినా ఆ కంపెనీలు చెప్పిన‌ట్లు 14 గంట‌ల‌పాటు ఆగ‌కుండా ఎంఎస్ ఆఫీస్ మీద ప‌ని చేస్తాయా అంటే దుస్సాధ్య‌మ‌నే చెప్పొచ్చు. ల్యాపీ కొన్నాక వాడిన త‌ర్వాత బ్యాట‌రీ బ్యాక‌ప్ ఎంతో చెప్ప‌గ‌లుగుతాం. కానీ అప్ప‌టికే కొనేసి ఉంటాం కాబ‌ట్టి బ్యాటరీ బ్యాక‌ప్ బాగోలేక‌పోతే ఇబ్బందే క‌దా.. అలా కాకుండా ల్యాప్‌టాప్ కొన‌కముందే బ్యాట‌రీ బ్యాక‌ప్ ఎంత ఉంటుందో అంచ‌నా వేయ‌గ‌లిగితే.. సూప‌ర్ క‌దా.. అదెలాగో చూద్దాం 
 

ఇదీ లెక్క‌
బ్యాట‌రీ స్పెసిఫికేష‌న్‌ను వాట్ - అవ‌ర్స్‌లో లెక్క‌పెట్టాలి. దీనికి యూనిట్స్ Whr లేదా  Wh.  సాధార‌ణ యూసేజ్‌కు ఒక కంప్యూట‌ర్ లేదా ల్యాప్‌టాప్ గంట‌కు 10 నుంచి 15 వాట్స్ తీసుకుంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీరు 100Wh బ్యాట‌రీ బ్యాక‌ప్ ఉన్న ల్యాప్‌టాప్ (మాక్‌బుక్ ప్రో లాంటివి) నార్మ‌ల్ యూసేజ్‌లో ఇది ఏడు నుంచి 10 గంట‌ల వ‌ర‌కు వ‌స్తుంది . అంటే బ్యాట‌రీ వాట్స్ (100Wh)ను ఎస్టిమేటెడ్ వాటేజ్ (10 లేదా 15)తో భాగిస్తే వ‌చ్చిన టైమే మీ బ్యాట‌రీ బ్యాక‌ప్ టైం. వోల్టేజి డ్రాప్ ఉంటే దీనిలో కొంత మార్పు ఉండొచ్చు. అంతేకాదు చాలా ల్యాపీలు డేటా పోకుండా ఉండ‌డానికి బ్యాట‌రీ బాగా డౌన్ అయిప్పుడు ఆటోమేటిగ్గా స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోతాయి. కాబ‌ట్టి బ్యాట‌రీ బ్యాక‌ప్ కొద్దిగా త‌క్కువ‌గా కూడా ఉండొచ్చు.
 

వాటేజ్ ఎస్టిమేష‌న్ (ESTIMATING WATTAGE)
మీ ల్యాప్టాప్ వాటేజ్ అంచ‌నా వేయ‌డం క‌ష్టం. అయితే దీనికి కొన్ని లెక్క‌లున్నాయి. ఒక ల్యాప్‌టాప్ ఫుల్ లోడ్‌తో ప‌నిచేస్తుంటే 65 నుంచి 90 వాట్స్ వ‌ర‌కు ప‌వ‌ర్ యూజ్ చేసుకుంటుంది. అందుకే ఫుల్లీ లోడెడ్ వ్యాట్సాప్ బ్యాట‌రీ బ్యాక‌ప్ గంట వ‌ర‌కే ఉంటుంది. మీ ప్రొడ‌క్ట్ మ్యాగ్జిమం వాటేజ్ ఎంతో దాని స్పెసిఫికేష‌న్ పేజీలో చూడొచ్చు. ఛార్జింగ్ ప‌వ‌ర్ అడాప్ట‌ర్ వెన‌క కూడా వాటేజ్ వివ‌రాలు రాసి ఉంటాయి. అంతేకాదు మ‌నం వాటేజ్ ఎంతవుతుందో ర‌ఫ్‌గా కూడా లెక్కేయొచ్చు
* హెవీ గేమింగ్‌, వీడియో రెండ‌రింగ్‌: మ‌్యాగ్జిమం 60 వాట్స్‌
* లైట్ గేమింగ్ 40- 60 వాట్స్‌
* వీడియో లేదా ఫొటో ఎడిటింగ్ 30- 40 వాట్స్‌
* హెచ్‌డీ వీడియో ఆన్‌లైన్లో చూస్తే 20-30 వాట్స్ 
* హెచ్‌డీ వీడియో ఆఫ్‌లైన్లో చూస్తే 15-20 వాట్స్ 
* వెబ్‌బ్రౌజింగ్ (ఎక్కువ ట్యాబ్‌లు ఓపెన్ చేయ‌కుండా), టెక్స్ట్ ఎడిటింగ్‌, మ్యూజిక్ ప్లే చేయ‌డం వంటి సాధార‌ణ‌యూసేజ్‌కు10-15 వాట్స్ 
* జ‌స్ట్ స్క్రీన్ ఆన్ అయి ఉంటే 8-10 వాట్స్ ఖ‌ర్చ‌వుతాయి. 
ఇది సాధార‌ణ లెక్క‌. వీటిలో టాప్ లిమిట్‌నే తీసుకోవాలి.
 

బ్యాటరీ యూసేజ్ ఎక్కువ‌గా ఉండ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు
* మీ స్క్రీన్ సైజ్ 15 అంగుళాల కంటే ఎక్కువ ఉంటే.
* స్క్రీన్ బ్రైట్‌నెస్ బాగా ఎక్కువ‌గా ఉంటే
* ఇంటెల్ గ్రాఫిక్స్ లాంటి డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉన్న ల్యాప్‌టాప్ అయినా
* ఫోన్‌, హెడ్‌సెట్ లాంటి ఇత‌ర డివైస్‌లు కూడా ల్యాపీకి క‌నెక్ట్ చేస్తే
* అప్లికేష‌న్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో ర‌న్న‌వుతున్నా ప‌ట్టించుకోకపోతే మీ బ్యాట‌రీ యూసేజ్ ఎక్కువ‌గా ఉంటుంది.

వాట్ అవ‌ర్స్ ఎక్క‌డ క‌నిపిస్తాయి?
వాట్ అవ‌ర్ నెంబ‌ర్‌ను డిస్క్రిప్టివ్ స్పెసిఫికేష‌న్ షీట్‌లో చూడొచ్చు. ఆన్‌లైన్ స్టోర్స్‌లో కూడా స్పెసిఫికేష‌న్స్ ట్యాబ్‌లో ఈ వివ‌రాలుంటాయి.  బ్యాట‌రీ ఎంఏహెచ్ వివ‌రాలు మాత్ర‌మే ఉంటే వాటిని ఆన్‌లైన్ కాలిక్యులేట‌ర్స్ ద్వారా వాట్స్‌లోకి మార్చ‌వ‌చ్చు. కొన్ని ల్యాపీల్లో వాట్స్ వివ‌రాలుక‌న‌ప‌డ‌వు. సేమ్ స్పెసిఫికేష‌న్స్‌, ప్రైస్ రేంజ్‌లో ఉన్న వాట్స్‌ను దీనికి అప్ల‌యి చేసి వాట్ అవ‌ర్స్ లెక్కేయొచ్చు. 100Wh కంటే ఎక్కువ వాటేజ్ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీలుంటే ఫ్లైట్‌లో తీసుకెళ్ల‌నివ్వ‌రు. అందుకే అంత‌కంటే ఎక్కువ వాటేజ్‌తో ల్యాపీలు వచ్చేఅవ‌కాశాలు ఉండ‌వు.

ల్యాపీని యాక్సెస్‌చేయ‌గ‌లిగితే..
విండోస్ 10, మ్యాక్ ఓఎస్ ఉన్న ల్యాపీలు బ్యాట‌రీ ఇన్ఫ‌ర్మేష‌న్ చూడ‌డానికి అవ‌కాశ‌మిస్తాయి. మీకు సేల్స్‌మెన్ తెలిసినా లేదంటే ఆ ల్యాపీ వాడుతున్న‌వాళ్లు ప‌రిచయం ఉన్నా  బ్యాట‌రీ స్పెసిఫికేష‌న్ చూడ‌డానికి ఆ ల్యాపీని ఒక్క‌సారి వాడ‌తామ‌ని అడ‌గండి.
విండోస్ 10 అయితే cmd కోసం సెర్చ్ చేయండి. Command promptను క్లిక్ చేయండి. ఓపెన్ చేసి  powercfg /batteryreport. అని టైప్ చేయండి. ఆ పాత్‌ను ఫాలో అయితే battery-report.html కనిపిస్తుంది. దీన్ని వెబ్ బ్రౌజ‌ర్‌లో చూడొచ్చు. ఆ వివ‌రాల్లో నుంచి  ల్యాపీ  Design capacity,  Full charge capacity వివ‌రాల‌ను తీసుకోండి. అవి రెండూ ఒకే నెంబ‌ర్ ఉంటాయి.ఆ నెంబ‌ర్‌ను 1000తో డివైడ్‌చేస్తే మీ బ్యాట‌రీ వాట్ అవ‌ర్స్
మ్యాక్‌లో అయితే..
ఇలాగే మ్యాక్‌లో కూడా చేయొచ్చు. ఆప్ష‌న్ కీని హోల్డ్ చేసి యాపిల్ మెనూ క్లిక్ చేయండి. System informationను సెలెక్ట్ చేసి Hardware → Powerకు నావిగేట్ చేయండి. Full Charge Capacity (mAh) , Voltage (mV) వివ‌రాల‌ను 1000తో డివైడ్ చేయండి. ఈ నెంబ‌ర్‌ను క‌న్వ‌ర్ష‌న్ కాలిక్యులేట‌ర్‌లో వేస్తే ఫోన్ వాట్ అవ‌ర్స్ తెలుస్తాయి.

జన రంజకమైన వార్తలు